మీరు ఇంకా మీ PAN మరియు Aadhaar Link చేసుకోలేదా? లేకపోతే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు. తప్పనిసరిగా భారత ప్రభుత్వం రూల్ ప్రకారం PAN మరియు Aadhaar Link లింక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా Aadhaar తప్పనిసరి అవుతుంది. అది మీకు తెలిసిందే.
ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజుల్లో PAN Card కూడా తప్పనిసరి అవుతుంది. భారత ప్రభుత్వం Tax విషయంలో మరింత సురక్షితంగా ఉండటానికి మరియు ట్రాన్స్ఫరెన్సీగా ఉండటానికి ఈ రూల్ ని తీసుకువచ్చింది. ఈ పాన్ కార్డు ని ఫైనాన్షియల్ క్యాటగిరిలో బాగా యూస్ చేస్తాము. అది మనందరికీ తెలిసిన విషయమే.
PAN, Aadhaar Link చేయకపోవడం వల్ల జరిగే నష్టాలు:
ఇప్పుడు భారత ప్రభుత్వం పాన్ మరియు ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఒకవేళ మీరు పాన్ మరియు ఆధార్ లింక్ చేయకపోతే మీరు Banking మరియు Investments చేసుకోలేరు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అంటే Stocks కొనడం, అమ్మడం, Mutual Funds కొనడం, అమ్మడం ఇలాంటి ఫైనాన్షియల్ కి సంబంధించినవి. అంతేకాక IT returns ఫైలింగ్ మరియు TDS వంటి సేవలు కూడా మీకు నిలిపివేయబడతాయి. ఇలాంటి ఇబ్బందులు మనము ఎదురుకోకుండా ఉండాలంటే తక్షణమే మనము Aadhaar మరియు PAN ని లింక్ చేసుకోవాలి.
Join WhatsApp
Join NowJoin Telegram
PAN, Aadhaar లింక్ అయి ఉందని తెలుసుకోవడం ఎలా?
ముందుగా మీరు incometax.gov.in/iec/foportal/ ఈ లింక్ ని బ్రౌజర్ లో ఓపెన్ చేసి ఎంటర్ చేస్తే మనకి Income Tax పోర్టల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం చూసినట్లయితే Quick Links బాక్సులో Link Aadhaar Status అని ఉంటుంది. ఈ లింకు మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మన Aadhaar మరియు PAN నంబర్స్ ఎంటర్ చేసి View Aadhaar Link Status మీద క్లిక్ చేస్తే మనకి లింక్ అయి ఉంటే ఆధార్ పాన్ లింక్ అయింది అని చెప్తుంది. ఆ రెండు లింక్ అవ్వకపోతే లింక్ చేసుకోమని చెప్తుంది. ఇలా చాలా ఈజీగా మనం పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ అయ్యాయో లేదో అని తెలుసుకోవచ్చు.

PAN, Aadhaar Link చేసుకోవడం ఎలా?
పైన చెప్పిన విధంగా మీరు ట్రై చేసిన తర్వాత మీకు Aadhaar మరియు PAN లింక్ అవ్వలేదు, లింక్ చేసుకోమని చూపించినట్లయితే మీరు ఈ విధంగా చేయాలి. మీరు ముందుగా, ఏదైతే Income Tax పోర్టల్ ఓపెన్ చేశారో, ఆ పోర్టల్ ఓపెన్ చేసి Quick Links బాక్స్ లో మీరు Link Aadhaar అని చూస్తారు. సింపుల్గా ఆ link మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు తర్వాత పేజీ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మీకు అక్కడ Aadhaar మరియు PAN ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఎంటర్ చేసిన వెంటనే, తర్వాత ప్రాసెస్ లో ఆధార్లో ఉన్న మీ పేరు మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటిపి వస్తుంది. ఇలా ఓటిపి ఎంటర్ చేయడం ద్వారా మీ ప్రాసెస్ ను కొనసాగించవచ్చు.
అయితే ఇలాగా ఆధార్ మరియు పాన్ లింక్ చేయడం అనేది ఇప్పుడైతే ఉచితంగా లేదు. దీనికి మనము లేటు ఫీజు కింద ₹1000 పే చేయవలసిందే.
ఆధార్ మరియు పాన్ లింక్ నుండి మినహాయింపు ఉందా?
ఆధార్ మరియు పాన్ కార్డు లింక్ నుండి మినహాయింపు ఉంది, అంటే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అది ఎవరెవరికంటే NRI’s అనగా అంటే ఇక్కడ నుండి విదేశాలకు వెళ్లి settle అయిన వాళ్ళు, మరియు భారత దేశ పౌరుడు కానీ వాళ్లు. మరియు క్రిందటి సంవత్సరంలో ఎప్పుడైనా గాని, ఒక వ్యక్తికి వయస్సు 80 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉంటే అతనికి కూడా ఇది అవసరం లేదు.
అంతేకాక ఎవరిది అయితే రాష్ట్రము అస్సాం, మేఘాలయ మరియు జమ్మూ కాశ్మీర్ అయినట్లయితే వాళ్లకి కూడా పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి కాదు. ఈ మినహాయింపు ఇన్ఫర్మేషన్ మనము డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్లో పాన్ మరియు ఆధార్ లింక్ చేసేటప్పుడు చూడవచ్చు.
ముగింపు:
మనము ఆధార్ మరియు పాన్ లింక్ చేయడం తప్పనిసరి కనుక, పైన చెప్పిన విధంగా Aadhaar మరియు PAN కార్డు లింక్ అయ్యాయో లేదో తెలుసుకోవడం మరియు Aadhaar కార్డు మరియు PAN కార్డు లింక్ చేయడం ఎలా అనేది చాలా సులభంగా మనం తెలుసుకున్నాము.
ఇలాంటి మరెన్నో ఉపయోగపడే అంశాలతో మీ ముందుకు రావాలంటే ప్రతిరోజు మన Telugu Tech Train బ్లాగ్ ని డైలీ ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌటు ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయగలరు.








