Airtel యూజర్లకు అప్డేట్: Perplexity Pro AI ఆఫర్ ఇక లేదు – కారణం ఇదే

మీరు ఎయిర్టెల్ సిమ్ యూస్ చేస్తున్నారా? అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే! ఈరోజుల్లో మనకి AI అంటే అందరికీ తెలిసిన మాటే. మరి ఈ AI యొక్క ఫీచర్స్ ను మరింత దగ్గరగా చేయడానికి Airtel తన యూజర్లకు 17,000 /- రూపాయల విలువ గల Perplexity Pro ను Complementary Offer ఆఫర్ గా ఒక సంవత్సరం పాటుగా వాడుకునేందుకు తీసుకు వచ్చిందని మనందరికీ తెలుసు. ఈ ఆఫర్ గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా?

Airtel Perplexity pro ఆఫర్ ఉందా? లేదా?:

మరి అలాంటి ఈ ఆఫర్ ను ఎయిర్టెల్ నిలిపివేసినట్లు మీ అందరికీ తెలుసా! అవునండి ఎయిర్టెల్ తన Perplexity Pro ఆఫర్ ను నిలిపివేసింది. ఇదివరకు మనం Perplexity Pro ఆఫర్ ఉన్న రీఛార్జి ప్లాన్ చేసినప్పుడు మనకి ఎయిర్టెల్, Perplexity Pro ప్లాన్ ని కూడా ప్రొవైడ్ చేసేది. కానీ ఇప్పుడు ఆ ఆఫర్ను చూపించట్లేదు..

అయితే ఇక ఎయిర్టెల్ Perplexity Pro ప్లాన్ లేనట్లేనా? ఈ ప్లాన్ ని మనము ఇక యూస్ చేసుకోలేమా? ఎవరికైనా ఈ ప్లాన్ ఇంకా అందుబాటులో ఉందా? అనే విషయాల గురించి మనం ఇంకా ఈ పోస్టులో దీని గురించి మరింత తెలుసుకుందాం.

అసలు Airtel ఎందుకు ఇలా చేసింది?

ఎయిర్టెల్ తన వినియోగదారులకు, గత సంవత్సరము మధ్య భాగం నుండి ఒక తాత్కాలిక ఆఫర్ ను తీసుకువచ్చింది. అది Airtel Perplexity Pro offer. ఈ కంప్లీమెంటరీ ఆఫర్ ను తమ రీఛార్జి ప్లాన్లో కలిపి తీసుకువచ్చింది. అప్పుడే ఎయిర్టెల్ ఈ ఆఫర్ గడువు తాత్కాలికంగా ఉంటుందని చెప్పుకొచ్చిందని తెలుస్తుంది. అది ఈ సంవత్సరం జనవరి 16వ తేదీ వరకు అని ఇంటర్నెట్లో కనిపిస్తుంది.

అయితే ఈ కంప్లీమెంటరీ ప్లాన్ ఇంకా ఎవరైనా యూస్ చేసుకోవచ్చా అంటే, అవును యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ ఆఫర్ జనవరి 16వ తేదీ కంటే ముందు రీఛార్జ్ ప్లాన్ వేయించుకొని ఎయిర్టెల్ Perplexity Pro offer ని ఎవరైనా క్లైమ్ చేసుకుంటే, వారు ఈ ప్లాను ఇంకా సంవత్సరం పాటుగా యూస్ చేసుకోవచ్చు అని సమాచారం.

జనవరి 16వ తేదీ తర్వాత నుండి ఇంకా ఎవరైనా, ఇదివరకు ఎయిర్టెల్ తీసుకువచ్చిన Perplexity ప్రో ఆఫర్ ఉన్న రీఛార్జి ప్లాన్ ను మనము రీఛార్జ్ వేయించుకుంటే, ఆ రీఛార్జి ప్లాన్ తో ఇక ఈ కంప్లీమెంటరీ ఆఫర్ రాదు. కేవలము ఈ సంవత్సరం జనవరి 16, 2026 లోపున ఈ ఆఫర్ను claim చేసుకున్న వారు మాత్రమే ఈ Perplexity Pro ఫ్రీ ఆఫర్ ను యూస్ చేసుకోగలరు.

ఇదండీ ఎయిర్టెల్ ప్రో ఆఫర్ గురించి ఇంటర్నెట్లో వస్తున్న విషయాలు.

Airtel తీసుకువచ్చిన మరొక ఆఫర్, Adobe Express Premium:

మీరు ఈ పెర్ప్లేక్సిటీ ప్రో ఆఫర్ ముగిసిందని దిగులు పడుతున్నారా? అయితే మీరు ఎయిర్టెల్ తీసుకువచ్చిన ఈ సరికొత్త ఆఫర్ గురించి విన్నట్లయితే కూసింత సంతోషిస్తారు. అదే ఎయిర్టెల్ తీసుకు వచ్చిన 4,000/- రూపాయల విలువగల Adobe Express Premium.

ఈ మధ్య చాలామంది Youtube లేదా ఎడిటింగ్ గురించి అవగాహన ఉన్నవాళ్లు ఎక్కువగా Canva లాంటి గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ ఉపయోగిస్తున్నారు. అలాంటి Graphic Design Tool, ఈ Adobe Express Premium. దీని ద్వారా మనము ఎడిటింగ్ వర్క్ చాలా అంటే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు.

ఈ విధంగా ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం ఇలాంటి కొత్త కాంప్లిమెంటరీ ఆఫర్స్ ను తీసుకువస్తుంది.

ఇది నా యొక్క వివరణ.

మీకు ఎయిర్టెల్ తీసుకువచ్చిన ఈ Adobe Express Premium కంప్లీమెంటరీ ప్లాన్ ఎలా అనిపించిందో కామెంట్లులో తెలియజేయండి. అదేవిధంగా మీరు Airtel ఏ ప్లాన్ ను యూస్ చేస్తున్నారో ఆ రీఛార్జ్ ప్లాన్ ను కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంత మంది ఏ ప్లాన్ వాడుతున్నారా అని.

ఇలాంటి మరెన్నో విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే మన ఈ Telugu Tech Train బ్లాగు ఫాలో అవుతూ ఉండండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

3 thoughts on “Airtel యూజర్లకు అప్డేట్: Perplexity Pro AI ఆఫర్ ఇక లేదు – కారణం ఇదే”

Leave a Comment