Bharat Taxi app: భారత్ టాక్సీ యాప్ వచ్చేసింది – పూర్తి వివరాలు

Bharat Taxi app: ఈ రోజుల్లో మనం ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి వెళ్లాలంటే చాలా ఈజీగా వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఎలాగంటే ఇదివరకు రోజుల్లో మనం ఆటో కోసం వెయిట్ చేయడం కానీ, లేదంటే బస్సు కోసం వెయిట్ చేయడం కానీ, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ వరల్డ్ లో చాలా ఈజీగా అయిపోయింది.

Bharat Taxi కి గల కారణాలు:

సింపుల్ గా మన మొబైల్ ఓపెన్ చేసి Rapido లేదా Ola లేదా Uber యాప్స్ ద్వారా మనం బైక్ కావాలంటే బైక్ మీద గాని, ఆటో కావాలంటే ఆటోలో గాని, కార్ కావాలంటే కార్లో గాని బుక్ చేసుకొని, నేరుగా మన ఉన్నచోటకి వాటిని రప్పించుకొని మనకు కావాల్సిన ప్రదేశానికి ఈజీగా వెళ్తున్నాము.

మరి ఇంత ఈజీ అయింది అంటే దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా ఖర్చు చేయవలసి ఉంది మరి!. మొదట్లో ఈ Ola, Uber, Rapido వంటి యాప్ లు మనం యూస్ చేసేటప్పుడు వివిధ ఆఫర్ల కింద లేదా అప్పుడే రావడం వలన ఏమో కానీ, ఈ యాప్ లో బుక్ చేసుకుని ride fare చాలా తక్కువగా ఉండేది.

కానీ ఇప్పుడు రోజులు పెరిగే కొద్దీ ఆ యాప్స్ నిర్వహణ ఖర్చు మూలంగానూ లేదా ఇతర ఖర్చుల వలన ఇప్పుడు రైడ్ బుక్ fare ఎక్కువగా ఉంది. అంతేకాక కొన్ని సార్లు పీక్ టైం లో హూ నార్మల్ రైడ్ ఫేర్ మాములుగా ఉండే దానికన్నా ఎక్కువ అమౌంట్ ఉంటుంది.

దానికి తగ్గట్లుగానే మనల్ని ఒకచోట నుండి ఇంకొక చోటికి తీసుకువెళ్లే మరియు ఈ యాప్ లలో వర్క్ చేసే డ్రైవర్లకు కూడా చాలా కష్టంగానే ఉంది. ఎలాగంటే ఈ ప్రైవేట్ యాప్ యూస్ చేసుకొని మనం Raid బుక్ చేసినప్పుడు, డ్రైవరు ఈ యాప్స్ ద్వారా రైడ్ ఆక్సెప్ట్ చేసి, ఆ యాప్ లను యూస్ చేస్తున్నందుకు తనకు వచ్చే రైడ్ అమౌంటు లో ఇంత పర్సంటేజ్ అమౌంట్ యాప్ సంస్థకు చెల్లించాల్సి ఉంది.

Bharat Taxi App అంటే ఏమిటి?

ఈ పైన చెప్పబడిన సమస్యలకు కొంత ఊరటగా ఉండడానికి ప్రభుత్వం, ఈ Ola, Uber, Rapido వంటి తరహాలో తన సర్వీస్ ని పైలెట్ ఆపరేషన్ కింద డిసెంబర్ 2 2025 న Bharat Taxi అనే ఆప్ ను తీసుకువచ్చింది. ఇది మొదటగా ఢిల్లీ-NCR, గుజరాత్ లో ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తూ వస్తూ ఉంది.

అలాంటిది ఈరోజు అనగా గురువారం ఫిబ్రవరి 5వ తేదీ 2026 నా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ Bharat Taxi App ను అధికారికంగా లాంచ్ చేశారు. రాబోయే రెండు మూడేళ్లలో ఈ భారత్ టాక్సీ యాప్ సేవలను ను భారతదేశం అంతా వాడుకునే లాగా తీసుకువస్తామని తెలియజేశారు.

Bharat Taxi app ప్రత్యేకతలు:

కేంద్రం ఎటువంటి ప్రత్యేకతలు లేకుండా విడుదల చేయదు కనుక వాటి గురించి మనము మాట్లాడుకుందాం.

  1. ఇది మనదేశంలో తీసుకురాబడిన మొదటి cooperative-based ride-hailing app
  2. ఇందులో డ్రైవర్లు యజమానులుగా ఉండే మోడల్ వంటిది.
  3. ఈ భారత్ టాక్సీ ఆప్ లో ఎలాంటి కమీషన్ వసూలు చేయరు కాబట్టి దీనితో డ్రైవర్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
  4. పీక్ అవర్స్ లో ప్రయాణికుల మీద పడే అదనపు చార్జీలు ఉండబోవు
  5. డ్రైవర్లకు సారథి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అంతే కాదండోయ్ రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా లభిస్తాయి.

ఇదండీ భారత టాక్సీ యాప్ గురించి, ఇంకా నేను మీతో ఏమైనా షేర్ చేసుకోకపోతే లేదా మిస్ చేసినట్లయితే మీకు తెలిసిన విషయా లను ఈ కింద కామెంట్ లలో తెలియజేయగలరు.

అంతేకాదు ఈ భారత్ టాక్సీ ఆప్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ లో మీరు షేర్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వేచి చూస్తూ ఉంటాను.

నా అభిప్రాయం ప్రకారం అయితే, ప్రైవేటు యాప్స్ యూస్ చేసే ప్రయాణికులకు ఇదొక ఎక్కువ ఖర్చుల నుండి ఇది కొంచెం మనకు ఊరట లాగా ఉంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన Telugu Tech Train బ్లాగ్ ఫాలో అవ్వండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “Bharat Taxi app: భారత్ టాక్సీ యాప్ వచ్చేసింది – పూర్తి వివరాలు”

Leave a Comment