BSNL New Plan: 365 రోజులు డేటా & అన్‌లిమిటెడ్ కాలింగ్ – Big Update for Users! పూర్తి వివరాలు తెలుసుకోండి

BSNL New Plan: ప్రస్తుతం భారత్ లో ఉన్న టెలికాం రంగంలో Airtel, Jio మరియు Vi వంటి ప్రైవేటు టెలికాం సంస్థలకు దీటుగా భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL తన కొత్త వార్షిక ప్లాను తీసుకువచ్చింది. అదే BSNL 2799 prepaid recharge plan. ఈ 2799 రూపాయల వార్షిక ప్లాన్ ను BSNL ఈ నెల శుక్రవారం అనగా డిసెంబర్ 26 వ తేదీన తీసుకువచ్చింది.

కేవలం ఈ ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు, ఏడాది పొడవునా మనం రీఛార్జి గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఈ ప్లాన్ బెనిఫిట్స్ మనం యూస్ చేసుకోవచ్చు.

BSNL 2799 Plan Benifits:

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL తన వినియోగదారులకు సరికొత్తగా ఒక ప్లాను తీసుకువచ్చింది. అదే మనం పైన తెలిపినట్లుగా BSNL 2799 రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ లో చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఈ ప్లాన్ లో ఉన్న బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామా!

  • Validity: ఈ ప్లాన్ తో మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు 365 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది.
  • Data: ఈ ప్లాన్లో మనకి ప్రతిరోజు 3GB high speed డేటా వస్తుంది. అంటే నెలకి మనకు దాదాపుగా 90GB డేటా వస్తుంది. ఇది ఇంటర్నెట్ వాడేవారికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ 3GB హై స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత మనకు 40kbps స్పీడుతో కూడా డేటా లభిస్తుంది.
  • Unlimited Calls: మనం ఏ నెట్వర్క్ కు అయినా (ఎయిర్టెల్ కానీ, జియో కానీ, వీ కానీ, BSNL కానీ) మనం Unlimited Calls మాట్లాడుకోవచ్చు. ఇలా మనకు ఈ ప్లాను వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు అన్లిమిటెడ్ కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు.
  • SMS: ఈ ప్లాన్ లో భాగంగానే మనకు డేటాలో పాటు ఉచిత SMS సౌకర్యం కూడా మనకి వస్తుంది. రోజుకు మనము 100 SMS ల వరకు మనం ఎవరికైనా పంపించుకోవచ్చు.

ఈ BSNL New Plan ఎవరు తీసుకోవచ్చు:

మరి BSNL తీసుకువచ్చిన ఈ కొత్త ప్లాన్ ఎవరు యూస్ చేసుకోవచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాము.

  • ఈ BSNL SIM కి సిగ్నల్ ఎవరికైతే బాగా వస్తుందో వారికి ముఖ్యంగా ఈ 2,799 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
  • మీ ఇంట్లో WIFI లేకుండా, కేవలం మొబైల్ డేటా మీద ఆధారపడి, అంత ఎక్కువ డేటా యూస్ చేయకుండా ఒక మాదిరి డేటా యూస్ చేసే వారికి ఇది కొంచెం మంచిదే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో రోజుకి 3GB డేటా వస్తుంది.
  • ఎవరైతే పదే పదే రీచార్జ్ వేసుకోకుండా ఉండడానికి ఇష్టపడతారో, వారికి ఈ ప్లాను మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాన్ ను ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే మనకి 365 రోజులు వస్తుంది.

రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

మీకు ఎవరికైనా BSNL సిమ్ ఉండి ఈ BSNL New Plan 2,799 రీఛార్జ్ ప్లాన్ ను చేసుకోవాలంటే, చాలా సులభంగా మనం రీచార్జ్ చేసుకోవచ్చు.

  • BSNL Selfcare App: మనం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి BSNL Selfcare App డౌన్లోడ్ చేసుకొని BSNL mobile number తో లాగిన్ అయి రీఛార్జ్ సెక్షన్ లోకి వెళ్లి ఈ 2,799 రీఛార్జ్ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు.
  • UPI Apps: పైన చెప్పినట్లుగా కాకుండా, మీ దగ్గర Phonepe, Google pay, లేదా Paytm గాని వంటి UPI యాప్స్ ఉంటే ఈ యాప్స్ ద్వారా మనము రీఛార్జ్ చేసుకోవచ్చు.
  • Retailer: లేదు ఇదంతా కాదు అనుకుంటే, మీ దగ్గరలోని ఏదైనా రీఛార్జ్ సెంటర్ కి వెళ్లి మన మొబైల్ నెంబర్ చెప్పి ఈ 2799 ప్లాన్ ని రీచార్జ్ చేయించుకోవచ్చు.

BSNL మరియు ప్రైవేటు టెలికాం సంస్థలు:

మనం ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోలిచినట్లయితే BSNL, వేరే టెలికాం సంస్థలు అయిన Jio మరియు Airtel తరహాలో 365 రోజు ప్లాన్ కావాలంటే మనకు సుమారుగా 3,500 అంత కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ 365 రోజు ప్లాన్ విషయంలో మనం BSNL గురించి మంచిగానే చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఇస్తుంది మంచి బెనిఫిట్స్ ఇస్తుంది.

అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, BSNL ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4g నెట్వర్క్ గా ఉంది. మీరు ఉన్న ప్రాంతంలో BSNL network signal బాగుంటే, ఈ ప్లానుకు సరిపడే ఇంకొక ప్లాను లేదని మనం చెప్పుకోవచ్చు.

నా అభిప్రాయం:

మీరు BSNL సిమ్ యూస్ చేస్తున్నట్లయితే మీ ఏరియాలో మంచిగా సిగ్నల్ వస్తున్నట్లయితే, మీరు పదేపదే రీచార్జ్ వేసుకోకుండా ఉండాలి అని అనుకున్నట్లయితే, ఒకేసారి ఈ 365 రోజులకి 2799 రూపాయల రీఛార్జి ప్లాన్ వేసుకోవడం మంచిదే.

ప్రస్తుతం మనం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం రీఛార్జ్ విషయం లో బడ్జెట్లో వెళ్లాలి అనుకున్నా, BSNL new sim యూస్ చేయాలనుకున్నా వారికి ఈ ప్లాను మంచిగా ఉంటుంది. ఏడాది పొడవునా మనం రీఛార్జి చేయాల్సిన అవసరమే లేదు.

ఇప్పుడున్న ప్రైవేటు రంగ టెలికాం సంస్థలు ఎయిర్టెల్, జియో ప్లాన్ ధరల కంటే BSNL సిమ్ ఉన్నవారికి ఇది కొంచెం వెసలుబాటు గానే ఉంటుంది. కనుక ఎవరికైతే BSNL sim ఉందో వారికి ఇది ఉపయోగకరమైన ప్లాను.

మీరు కనుక BSNL సిమ్ వాడాలని ప్లాన్ చేస్తున్నా లేదా ఇప్పటికే వాడుతున్న ఈ పండగ సీజన్లో ఈ ప్లాన్ అయితే మాత్రం అసలు వదులుకోవద్దు.

మరి మీలో బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరైనా వాడుతున్నారా వాడుతున్నట్లయితే మీకు ఈ ప్లాన్ నచ్చిందా?నచ్చితే కింద కామెంట్ లో మాతో పంచుకోండి.

ఈ కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టెక్ విషయాలు మీ ముందుకు రావాలంటే ప్రతిరోజు మన Telugu Tech Train బ్లాగ్ ను ఫాలో అవుతూ ఉండండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “BSNL New Plan: 365 రోజులు డేటా & అన్‌లిమిటెడ్ కాలింగ్ – Big Update for Users! పూర్తి వివరాలు తెలుసుకోండి”

Leave a Comment