How to check laptop battery health in 1 minute| మీ లాప్టాప్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయండి

Introduction: Laptop battery health

ఈరోజుల్లో అందరూ Laptops వాడటం సర్వ సాధారణమైనది. ఇదివరకు కన్నా ఎక్కువ laptop మోడల్స్ మరియు ఎక్కువ ఫీచర్స్ ఉన్నవి మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి ఇప్పుడు. మరి మీకు తెలుసా! ఈ ఫీచర్స్ లో ఒకటి Battery Capacity కూడా.

లాప్టాప్ రేటు పెరిగే కొద్దీ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. కొన్నప్పుడు కంపెనీ వాళ్లు ఇచ్చిన బ్యాటరీ కెపాసిటీ మొదట్లో ఎలా ఉందో మనం వాడే కొద్దీ బ్యాటరీ కెపాసిటీ అలా ఉండదు. అలాంటి మీ బ్యాటరీ కెపాసిటీ ఇప్పుడు ఎంతుందో మీకు చెక్ చేయడం తెలుసా?

Battery Capacity ఎందుకు తగ్గుతుంది?

మన లాప్టాప్ లో చాలా రకాలైన అప్లికేషన్స్ ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా ( అంటే బ్యాగ్రౌండ్ లో) రన్ అవుతాయి. ఈ మొత్తము ఆపరేటింగ్ సిస్టము మీద ఆధారపడి వాటికి కావలసిన పవర్ బ్యాటరీ నుండి తీసుకుంటాయి.

మరి ఈ బ్యాటరీ పవర్ స్టోరేజ్ చేసుకోవాలంటే దానికి ఒక మెటీరియల్ యూస్ చేస్తారు. ఎక్కువగా కార్బన్ మెటీరియల్ యూస్ చేస్తారు. రోజులు గడిచే కొద్దీ ఈ కార్బన్ మెటీరియల్ కెపాసిటీ తగ్గుతుంది. ఇందువల్ల ఆటోమాటిక్గా మన బ్యాటరీ కెపాసిటీ కూడా తగ్గుతుంది.

బ్యాటరీ కెపాసిటీ తగ్గడం వల్ల నష్టాలు:

  • లాప్టాప్ ఆటోమేటిగ్గా స్విచ్ ఆఫ్ అయిపోవడం
  • 100% చూపించాల్సిన ఛార్జింగ్ ఒక్క క్షణంలో 20 30 40 కి పడిపోవడం
  • Charging ప్లగ్గు కనెక్ట్ చేస్తూ laptop use చేయడం, లేకుంటే ఆటోమేటిగ్గా స్విచ్ ఆఫ్ అయిపోవడం

ఇలా ఇంకా చాలానే ఉంటాయి పర్సనల్గా ఫేస్ చేస్తే మనకు తెలుస్తుంది.

Laptop Battery health చెక్ చేసుకోవడం ఎలా?

ముందుగా Laptop Keyboard లో Window key + R క్లిక్ చేస్తే, Run Panel ఓపెన్ అవుతుంది. ఇక్కడ CMD అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. Command పానెల్ ఓపెన్ అవుతుంది. ఈ ప్యానల్ లో కింద ఇచ్చిన command prompt ఎంటర్ చేయండి.

powercfg /batteryreport

పైన ఇచ్చిన Command Prompt టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒక local file path వస్తుంది. ఈ local file path ని కాపీ చేసుకొని మీకు నచ్చిన బ్రౌజర్ లో ఓపెన్ చేయాలి. నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నా.

How to check laptop battery health capacity
CMD panel

బ్రౌజర్ సెర్చ్ బార్ లో కాపీ చేసిన file path ని paste చేసి ఎంటర్ చేయాలి.  అప్పుడు మనకి ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి బ్యాటరీ కెపాసిటీ డీటెయిల్స్ అండ్ బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు వచ్చిన బ్యాటరీ డీటెయిల్స్ ఇవి.  మీ లాప్టాప్ లో డిఫరెంట్ గా ఉండవచ్చు.

How to check laptop battery health capacity
Chrome Browser

ఇక్కడ మనకి లాప్టాప్ కంపెనీ Manufacturer, Serial number, Battery కి యూస్ చేసిన కెమిస్ట్రీ ఐడి మరియు మెయిన్ గా మనకు కావాల్సిన Design Capacity మరియు Full Design Capacity ఉంటాయి.

ఇక్కడ నా Design Capacity 41,440  mwh మరియు Full Design Capacity ఇప్పటికీ నాకు మొత్తంగా తగ్గి 36112 mwh గా ఉంది.

ఇప్పుడు నేను పర్సంటేజ్ గా క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిగ్గా నా Battery health capacity తెలుస్తుంది. ఈ ఫార్ములా యూస్ చేసి మనము మన బ్యాటరీ హెల్త్ కెపాసిటీ చెక్ చేసుకోవచ్చు .

Full charge capacity / Design charge capacity x 100.

ఇలా చేసిన తర్వాత నాకు 87 పర్సంటేజ్ వచ్చింది. మరి మీకు ఎంత వచ్చిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.

Laptop battery capacity ఎక్కువ తగ్గకుండా జాగ్రత్తలు:

  • ప్లగ్ కనెక్ట్ చేసి లాప్టాప్ వాడకపోవడం మంచిది.
  • 20% చార్జింగ్ ఉన్నప్పుడు మాత్రమే లాప్టాప్ చార్జర్ కనెక్ట్ చేయడం మంచిది.
  • 80% చార్జింగ్ దాటకుండా . చార్జింగ్ ప్లగ్ రిమూవ్ చేసుకోవడం మంచిది. 
  • లాప్టాప్ యూస్ చేయని సమయంలో షట్ డౌన్ చేయడం మంచిది.

ఇలా తగిన టిప్స్ ఫాలో అవటం ద్వారా మన లాప్టాప్ బ్యాటరీ కెపాసిటీ ఒకేసారి తగ్గకుండా కాపాడుకోవచ్చు.

కంక్లూషన్:

ఈ విధంగా మనం Laptop battery health చెకప్ చేసుకోవడం ద్వారా ఇంకా మన బ్యాటరీ ఎంత కాలం వస్తుంది అని మనము ఒక అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు మీ బ్యాటరీ హెల్త్ చెకప్ చేసుకోవడం ఎలానో తెలిసింది కదా! మరి మీకు వచ్చిన బ్యాటరీ కెపాసిటీ పర్సంటేజ్ ఎంత అనేది మీరు మాతో షేర్ చేసుకోవడం నచ్చినట్లయితే కామెంట్స్ లో మెన్షన్ చేయండి.

తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ Laptop battery capacity తగ్గకుండా చూసుకోండి. ఈ పోస్ట్ మీకు మంచిగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ సురేష్.  Telugu Tech Train బ్లాగ్ డైలీ ఫాలో అవ్వగలరు.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “How to check laptop battery health in 1 minute| మీ లాప్టాప్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయండి”

Leave a Comment