Oppo K14x 5G: 6500mAh భారీ బ్యాటరీ! ఇండియాలో లాంచ్ – ధర & ఫుల్ స్పెక్స్

Oppo K14x 5G: ఈ రోజుల్లో 5G ఇంటర్నెట్ అనేది మన జీవితంలో ఎంతలాగా మెయిన్ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. మరి అలాంటి 5G internet అందరికీ అందుబాటులో ఉండాలంటే 5G supported గల మొబైల్స్ కావాలి. మరి తక్కువ బడ్జెట్ లో దొరికితే చాలా బాగుంటుంది కదా! ఈ విషయాన్ని తెలుసుకున్న మొబైల్ కంపెనీలు బడ్జెట్లో 5G మొబైల్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. అలానే అందులో ఒకటైన Oppo ఈరోజు తన ఒక కొత్త 5జి మొబైల్ ని లాంచ్ చేసింది అదే Oppo K14x 5G మొబైల్.

Oppo K14x 5G variants and Price:

ఈ ఒప్పో K14x మొబైలు మనకి రెండు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

  1. Icy Blue ( ఐ సి బ్లూ)
  2. Prism Voilet (ప్రిజం వైలెట్)

అదే విధంగా మనము RAM చూసుకున్నట్లయితే మనకు ఇది 4 GB RAM మరియు 6 GB RAM వేరియంట్ లలో దొరుకుతుంది. మరి స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 128 GB storage తో . తీసుకువచ్చారు. ఇప్పుడు మరి ఈ మొబైల్ వేరియంట్ ప్రకారం వాటి ప్రైస్ వివరాలను మనం చూద్దాం.

Mobile VariantPrice
4 GB RAM + 128 GB STORAGE14,999/- రూపాయలు
6 GB RAM + 128 GB STORAGE16,999/- రూపాయలు

Oppo K14x 5G sale:

ఈ ఒప్పో K14x mobile ఈరోజు లాంచ్ అయింది అఫీషియల్ గా. సేల్ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి ఈ మొబైల్ కొనాలనుకున్న వారు మాత్రం ఈనెల ఫిబ్రవరి 16 నుండి కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ లో మనము Oppo Official Page నుండి లేదంటే Flipkart కానీ buy చేసుకోవచ్చు.

ఒప్పో అఫీషియల్ పేజీలో చూసినట్లయితే మాకు ఈ మొబైల్ మీద బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కింద 1500 రూపాయల వరకు తగ్గుతుంది.

Oppo K14x 5G Features:

Oppo K14x మొబైల్ లో మనకు 6.75 inches HD+ మరియు LCD display తో తీసుకువచ్చారు. రిఫ్రెష్ రేటు చూసుకున్నట్లయితే 120Hz Refresh Rate తో వస్తుంది. ఈ మొబైల్లో 1125 nits brightness తో తీసుకువచ్చారు దీని వలన మనకు ఎండలో ఈ మొబైల్ వాడుకునేందుకు మంచిగానే ఉంటుంది. ఈ మొబైల్లో మనకు MediaTek Dimensity 6300 యూస్ చేశారు. ఈ మొబైల్ మనము lag లేకుండా మరియు Multi tasking పర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు.

ఈ ఒప్పో కే14 ఎక్స్ లో, మనము కావాలంటే RAM ని కూడా Expand చేసుకోవచ్చు. ఇంకా ఇది మనకు IP 64 water and Dust Resistance తో వస్తుంది. అంటే మనకు వాన పడిన లేదా ఏదైనా తుంపర్లు గాని లేదా ఏదైనా దుమ్ము పడినా కానీ ఈ మొబైల్ మీ మనం కాన్ఫిడెంట్గా యూస్ చేసుకోవచ్చు.

Oppo K14x mobile Camera:

ఈ మొబైల్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకు 50 MP AI Main Camera తో వస్తుంది. దీని ద్వారా మనం ఫొటోస్, వీడియోస్ చాలా మంచిగా తీసుకోవచ్చు. మరియు AI ఉండడం వలన మనం AI ఫీచర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా rare side సెకండరీ కెమెరా చూసినట్లయితే మనకు 2 MP Camera ఇచ్చారు. ఇది కొంచెం ఎక్కువ మెగాపిక్స్ ఇచ్చినట్లయితే బాగుందని నాకు అనిపించింది.

Front Camera మనకు 5MP కెమెరాతో వస్తుంది. ఈ కెమెరాను కూడా కొంచెం ఇంప్రూవ్ చేసినట్లయితే మంచిగా ఉంటుంది.

Oppo K14x 5G battery:

ఈ ఒప్పో k14 ఎక్స్ 5g యొక్క బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. మరి ఇంత కెపాసిటీ ఉన్న బ్యాటరీని మనము ఛార్జ్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి తగ్గ Fast Charger కావాలి కదా మరి అందుకని వీళ్లు 45 watts charger ను ప్రొవైడ్ చేశారు.

కనుక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనము ఒక రోజంతా మంచిగా యూస్ చేసుకోవచ్చు. అంతేకాదు చాలా మంచి ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు అదే Reverse Wiring Charge. సింపుల్ గా చెప్పాలంటే ఇది మనకు ఒక పవర్ బ్యాంకు లాగా పనిచేస్తుంది. ఒక మొబైల్ నుండి వేరే ఒక మొబైల్ ఛార్జ్ పెట్టుకోవడానికి.

బాక్స్ లో ఏమేమి వస్తాయి:

ఈ ఫోనును మనము ఆర్డర్ చేసుకున్నప్పుడు మనకు ఏమేం వస్తాయో అని తెలుసుకోవాలని ఉంటుంది కదా! సో ఈ బాక్సులు మనకు ఏమేమి వస్తాయి అని అంటే ఒక Phone, ఒక Charger, ఒక USB Data Cable, ఒక SIM Ejector Tool, ఒక Protective Case, ఒక Quick Guide ప్రొవైడ్ చేస్తున్నారు

ఈ మొబైలు ఎవరికి మంచిగా ఉంటుందంటే బ్యాటరీ ఎక్కువసేపు రావాలి అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ మంచిగా ఉంటుంది మరియు ఫ్రంట్ సైడ్ కెమెరా అంతగా వాడము అనే వాళ్లకి చాలా మంచిగా ఈ మొబైల్ ఉంటుంది.

ఇంకా మీకు ఏమీ అనిపించిందో కామెంట్ లో తెలుపగలరు. మీలో ఎవరైనా ఒప్పో బ్రాండ్ మొబైల్ యూస్ చేస్తున్నట్లయితే కామెంట్స్ లో OPPO అని టైప్ చేయండి.

ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు రావాలంటే ప్రతిరోజు Telugu Tech Train బ్లాగ్ ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాతి పోస్ట్ తో మళ్లీ కలుసుకుందాం.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment