10001 mAh బ్యాటరీతో Realme P4 Power 5G: ఈ ధరలో భారీ బ్యాటరీ ఫోన్..

Realme P4 Power 5G: 10001 mAh battery తో తన పవర్ ని చూపించిన, కొత్తగా రిలీజ్ అయిన మొబైల్ Realme P4 Power 5G. ఎంత ఎక్కువ mAh ఉంటే అంత ఎక్కువ సేపు మనం మొబైల్ ని యూస్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తో తీసుకొచ్చినట్టు ఉన్నారు ఈ Realme brand వాళ్ళు ఈ మొబైల్ ని. ప్రస్తుతం అయితే మార్కెట్లో ఉన్న మొబైల్ లో ఇదే Highest battery Capacity గల మొబైల్. మరి అలాంటి మొబైల్ గురించి మనం తెలుసుకుందాం రండి.

Features and Specifications:

ఈ మొబైలు మనకు మూడు కలర్ వేరియంట్లలో తీసుకువచ్చారు అవి ఏంటో చూద్దాం.

  • TransSilver
  • TransOrange
  • TransBlue

మరి ఈ Realme P4 Power display గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.8 inches AMOLED Full HD+ display తో వస్తుంది. ఈ మొబైలు మనకి 144 Hz Refresh rate తో వస్తుంది. 6500 nits peak brightness ప్రొవైడ్ చేశారు. ఇంత ఎక్కువ నీటితో రావడం వల్ల మనకు ఎండలో కూడా మొబైల్ స్క్రీన్ చాలా నీట్ గా క్లియర్ గా కనబడుతుంది.

ఈ మొబైల్ లో మనకు HDR10+ తో తీసుకువచ్చారు. ఇది ఉండడం వల్ల మనము HDR supported కంటెంట్ ని కూడా చూడవచ్చు. ఈ మొబైలు Corning Gorilla Glass 7i గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది.

Variants and Prices:

ఈ మొబైల్ 8 GB, 12 GB లు గల LPDDR4X RAM లతో మరియు 128 GB, 256 GB UFS 3.1 Storage తో మూడు రకాలుగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటో వాటి prices ఎలా ఉన్నాయో టేబుల్ ఫార్మటు లో చూద్దాము.

Mobile variant (Realme P4 Power)Price
8 GB RAM + 128 GB Storage25,999/- రూపాయలు
8 GB RAM + 256 GB Storage27,999/- రూపాయలు
12 GB RAM + 256 GB Storage30,999/- రూపాయలు

Realme P4 Power Processor:

ఈ మొబైల్ Processor గురించి మనము మాట్లాడుకున్నట్లయితే ఇది Dual-chipset తో వస్తుంది. అందులో ఒకటి MediaTek Dimensity 7400 Ultra, ఇది మొబైల్ మొబైల్ కి సంబందించిన పర్ఫామెన్స్ కోసం మంచిగా ఉపయోగపడుతుంది.

రెండవది Hyper Vision+ AI chip, దీనివలన మనకు Mobile Display యొక్క పెర్ఫార్మన్స్ చాలా మంచిగా కనపడుతుంది. మనం తక్కువ క్లారిటీ ఉన్న వీడియోస్ ని చూస్తున్నప్పుడు క్లారిటీ పెంచడం, లైట్ మోషన్ గా ఉండే వీడియోస్ ని కొంచెం క్లారిటీగా కనపడేటట్టు చేయటం లాంటివి ఉదాహరణకు. మొబైల్ అఫీషియల్ పేజీలో చూసినట్లయితే ఈ చెప్పు యూస్ చేయడం ద్వారా Power consumption. అనేది 16% వరకు సేవ్ అవుతుందని Realme వాళ్ళు మెన్షన్ చేశారు.

Realme P4 Power Camera:

ఈ మొబైల్ లో Rare side వీళ్ళు 50 MP (mega pixel) Primary Camera మరియు 8 MP Ultra-Wide Angle Camera తో తీసుకువచ్చారు. మనం 50 MP కెమెరా యూస్ చేసుకొని upto 20x వరకు Digital Zoom చేయవచ్చు. ఈ rare side కెమెరా లతో మనము 4k @30 fps Video Recording చేసుకోవచ్చు.
వీటితో పాటుగా మనకు LED Flash కూడా ఉంటుంది.

Front Cameraచూసినట్లయితే మనకు 16 MP (mega pixel) కెమెరాతో వస్తుంది. అంతేకాకుండా మనం ఏదైనా చీకట్లో ఫొటోస్ తీసుకోవాలని Screen flash తో మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ rare side కెమెరా తో Full HD @30 fps Video Recording చేసుకోవచ్చు.

Realme P4 Power 5G Battery:

ఈ మొబైల్లో బ్యాటరీ ముందుగా మనం చెప్పుకున్నట్లుగా 10001 mAh కెపాసిటీతో వస్తుంది. మరియు 80W Ultra Charge వరకు సపోర్ట్ చేస్తుంది. 50% ఛార్జ్ కేవలం 36 minutes లో కంప్లీట్ అవుతుంది.

Realme official పేజీ లో ఇచ్చి డేటా ప్రకారం మనం 32.5 గంటల వరకు Youtube చూడవచ్చు. 11.7 గంటల వరకు BGMI ఆడవచ్చు. 185.7 గంటల వరకు Spotify వాడుకోవచ్చు.

ఇతర ప్రత్యేకతలు:

  • ఈ మొబైల్ HyperGlow 4D Curve+ Display తో వస్తుంది.దీని ప్రకారం 4 సైడ్ లు Curve తో వస్తుంది.
  • ఈ Realme P4 Power IP69, IP68 మరియు IP66 తో రావటం వల్ల ఈ మొబైల్ Water and Dust Resistance కి బాగా సపోర్ట్ చేస్తుంది.

చివరిగా ఈ Realme P4 Power ఎవరు తీసుకోవచ్చు అంటే రోజంతా ఎక్కువ సేపు Gaming లేదా Multi tasking చేసే వాళ్ళకి Battery Percentage తొందరగా తగ్గిపోకుండా ఎక్కువ సమయం బ్యాటరీ కావాలి అనుకున్న వాళ్ళకి గానీ, కొంచెం బడ్జెట్ ఎక్కువ అయినా పర్వాలేదు మంచి పెర్ఫార్మన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి గానీ ఈ మొబైల్ చాలా మంచిగా సూట్ అవుతుంది.

ఈ మొబైల్ లో ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తే ఈ మొబైల్ snapdragon Chipset యూస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో అయితే ఇంకా బాగుంటుంది.

ఇంకా మీరేమనుకుంటున్నారో ఈ మొబైల్ గురించి కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా నేను ఏదైనా కొన్ని విషయాలు చెప్పక పోతే మిస్సయిన పాయింట్లు కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు ఉండాలంటే ప్రతి రోజు Telugu Tech Train బ్లాగును ఫాలో అవుతూ ఉండండి.

మీరు ఇంత లా చదివి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క రీడర్ కు నా ధన్యవాదాలు.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

6 thoughts on “10001 mAh బ్యాటరీతో Realme P4 Power 5G: ఈ ధరలో భారీ బ్యాటరీ ఫోన్..”

Leave a Comment