Aadhaar Update: ఇకపై ఇంటి నుండే Mobile number మార్చండి

The Unique Identification Authority of India (UIDAI): భారతదేశంలో ఆధార్ కార్డు అంటే తెలియని వ్యక్తి ఉండరు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. ఈరోజు అనగా సోమవారము డిసెంబర్ 8వ తేదీన తాజాగా అందిన న్యూస్ ప్రకారం, Aadhaar యాప్ లో కొత్త update వచ్చింది. ఈ అప్డేట్ వల్ల చాలామంది విద్యార్థులు, సామాన్యులు, సీనియర్ సిటిజన్ లు Aadhaar Center లకి తిరగవలసిన అవసరం లేదు, ఈ అప్డేట్ ద్వారా. ఆ అప్డేట్ ఏంటంటే Mobile number Update చేసుకోవడం.

ఈ Aadhaar Update వల్ల ప్రయోజనం ఏమిటి?

ఇంతకు ముందు మనం Aadhaar Card లో Mobile number update చేపించాలంటే ఆధార్ సెంటర్ కి వెళ్లి లైన్ లో నిలబడి, ఆధార్ కి లింక్ అయినా mobile number అప్డేట్ చేయించుకోవలసి వచ్చేది. దీని వలన మనము ఎక్కువ సమయం spend చేయవలసి వచ్చేది. ఆధార్ లో మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం విద్యార్థులు గాని, సామాన్యులు గాని, సీనియర్ సిటిజన్ లు గాని చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ఈ Aadhaar Update వల్ల ఇకపై Mobile Number అప్డేట్ చేసుకోవాలన్న లేదా చేంజ్ చేసుకోవాలనుకున్న ఈ ఆప్షన్ ద్వారా మనం చాలా ఈజీగా లైన్లో నిలబడకుండా గంటల కొద్ది సమయం వృధా చేసుకోకుండా మన ఇంటి దగ్గర నుండి మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు.

Mobile number update చేసుకోవడం ఎలా?

  • ముందుగా Google Play Store లో Aadhaar app డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి.
  • ఈ ఆధార్ అప్లికేషన్ మీ మొబైల్ లో ఉంటే దానిని అప్డేట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మనం ఈ యాప్ లో మనం రిజిస్టర్ చేసుకోవాలి.
  • రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు ఈ యాప్ ఇంటర్ఫేస్ లో Mobile Number Update option క్లిక్ చేయడం ద్వారా మనం మొబైల్ నెంబర్ ని అప్డేట్ చేసుకోవచ్చు లేదా చేంజ్ చేసుకోవచ్చు.
  • ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసిన తర్వాత మీకు OTP వస్తుంది. ఆ OTP ని ఎంటర్ చేసి face authentication చేయడం ద్వారా మీ ఆధార్ రికార్డ్స్ లో మీ కొత్త నెంబర్ అప్డేట్ అవుతుంది.

ఇంకా Enable లోకి రావాల్సిన Options:

మీరు ఆధార్ లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే ఆప్షన్స్ దగ్గర, Update your address, Email మరియు Name, వంటి మిగతా ఆప్షన్లు కూడా మీకు కనపడతాయి. ఏ ఆప్షన్స్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. ఇవి తొందరలో ఎనేబుల్ అవ్వవచ్చు.

ఈ ఆప్షన్స్ ఎనేబుల్ ఎనేబుల్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ బ్లాగ్ ఫాలో అవుతూ ఉంటే నేను మీకు వీటి యొక్క అప్డేట్స్ అందించే అవకాశం ఉంది.

మరొక అప్డేట్- Rules For Entities Using Aadhaar Verification:

ఇకపై మీరు ఏదైనా హోటల్ కానీ లేదా ఈవెంట్ కానీ వెళ్ళినప్పుడు, వారు మీ ఆధార్ కార్డు జిరాక్స్ అడిగినప్పుడు, మీరు ఇకపై ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే UIDAI ప్రవేశపెట్టిన కొత్త రూల్ ప్రకారం వ్యాపార సంస్థలు, హోటల్లు, ఈవెంట్ సంస్థలు, మరి ఏ ఇతర ప్రైవేటు సంస్థలు అయినా మీ ఆధార్ కార్డ్ ని ఫిజికల్ గా కాకుండా, ఆధార్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రేమ్ వర్క్ కింద వారు వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. దీనికోసం ముందుగా ఆయా సంస్థలు UIDAI దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి.

ఈ రూల్ ప్రకారం, మనము కేవలము QR code స్కాన్ చేయడం వల్ల మన ప్రైవసీ దెబ్బతినకుండా, మన Personal Information లీక్ కాకుండా వెరిఫై అవుతుంది.

ఇదంతా Digital Personal Data Protection Act (DPDP Act) కి అనుగుణంగా ఉంటుంది. అంతేకాక ఇది రాబోవు 18 నెలల్లో పూర్తిగా అమలులోకి వస్తుందని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది.

ఆధార్ నుండి వచ్చిన ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్ ద్వారా తెలుపగలరు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందా? లేదా? అని కూడా కామెంట్లో తెలుపగలరు.

ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు రావాలంటే ఈ Telugu Tech Train ను డైలీ ఫాలో అవుతూ ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ షేర్ చేయండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

4 thoughts on “Aadhaar Update: ఇకపై ఇంటి నుండే Mobile number మార్చండి”

Leave a Comment