ఇక నుండి మీ ఫోన్లో ఈ యాప్ ఉండాల్సిందే. అదే దాని పేరు Sanchar Saathi. భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ యాప్ ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండవలసిందే. భారత కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, ప్రముఖ మొబైల్ కంపెనీ తయారుదారులైన Apple, Samsung, Vivo మరియు Oppo కంపెనీలకు ఇచ్చిన ఆదేశం ప్రకారము ఇక నుండి మార్కెట్లో రిలీజ్ అయ్యే ప్రతి మొబైల్ లోను భారత ప్రభుత్వం చే తీసుకువచ్చిన Sanchar Saathi అప్లికేషన్ ను డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేయవలసి ఉంది.. మరియు ప్రస్తుతం యూజర్లు వాడుతున్న మొబైల్ ఫోన్ లకు తదుపరి అప్డేట్స్ ద్వారా ఇన్స్టాల్ చేయవలసి ఉంది.
అయితే ఈ నిబంధనను అంగీకరించి మరియు Sanchar Saathi app ఇన్స్టాల్ చేయడానికి ఆయా మొబైల్ కంపెనీలకు 90 రోజులు గడువు విధించింది. ఇదే కాకుండా, యూజర్ Uninstall మరియు Disable(delete) చేయడానికి వీలుగా లేకుండా ఉండేటట్లు సంచార సాతి యాప్ ను default గా ఇన్స్టాల్ చేయవలసిందిగా ఆదేశించింది.
ఈ పైన చెప్పినదంతా నిన్నటి మాట అనగా సోమవారం డిసెంబర్ ఒకటవ తేదీ అది ఆ దేశం ప్రకారము.
Sanchar Sathi DELETABLE OR NOT?
Sanchar Saathi App డిలీట్ చేయడానికి వీలుగా లేకపోవడం వలన చాలా విమర్శలు రావడంతో, ఈరోజు మంగళవారం రెండవ తేదీ డిసెంబర్ నెల మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ Jyotiradtiya Scindia గారు క్లారిటీ ఇచ్చారు. అది ఏమిటంటే ఈ యాప్ ఫీచర్స్ యూస్ చేసుకోవడానికి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే యూజర్ తనకు నచ్చినపుడు అన్ఇన్స్టాల్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. ఇలా భారత కమ్యూనికేషన్ మినిస్టర్ తన Twitter ఖాతా ద్వారా తెలిపారు.
Sanchar Sathi Portal:
ఎన్నో కోట్ల జనాభా ఉన్న మన భారత దేశంలో, రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సైబర్ నేరాల వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులు, నష్టాల నుండి దూరం చేయడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి, సైబర్ నేరాలపై ప్రజలు నేరుగా కంప్లైంట్స్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం Sanchar Saathi portal ను మే నెల 2023లో విడుదల చేసింది.
Join WhatsApp
Join NowJoin Telegram
Sanchar Sathi App:
అదేవిధంగా ఈ సంవత్సరం అనగా 2025 జనవరి నెలలో, మన భారత ప్రభుత్వం ఈ Sanchar Saathi appని విడుదల చేసింది. మనకు కావలసిన విధంగా యాప్ ద్వారా లేదంటే పోర్టల్ ద్వారా సర్వీస్ ని యూస్ చేసుకునే విధంగా భారత ప్రభుత్వం మన ముందుకు తీసుకువచ్చింది.
Sanchar Sathi Features:
ప్రభుత్వం టెలికం భద్రతను పెంచడానికి మరియు బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ లో ఈ యాప్ ఉండవలసిందిగా ఆదేశించింది. మన చుట్టూ జరుగుతున్న మొబైల్ దొంగతనాలు, ఫేక్ IMEI మోసాలు, స్పామ్ CALLS మరియు Fraud SMS లు మరియు మనకు తెలియకుండానే మన పేరుతో సిమ్ కార్డులు తీసుకోవడం ఇలాంటివి చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. ఇలాంటి సమస్యలు నియంత్రించడానికి Sanchar Saathi app ని install చేయడం అన్ని ఫోన్లో తప్పనిసరి చేశారు.
1)పోయిన / దొంగిలించబడిన ఫోన్ బ్లాకింగ్ (CEIR):
- మన ఫోన్ పోయినప్పుడు లేదా దొంగలించినప్పుడు మన మొబైల్ IMEI number ఆధారంగా ఆ ఫోనును మన ఇండియా నెట్వర్క్ లో బ్లాక్ చేయించవచ్చు.
2)మన పేరు మీద ఉన్న సిమ్ కనెక్షన్ లో చెక్ చేయడం:
- ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఏదైనా మనకు తెలియని Sim Card మన పేరు మీద ఉంటే వెంటనే దానిని రిపోర్ట్ చేసుకోవచ్చు.
3)IMEI Authenticity Check:
- మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు అసలు ఆ మొబైల్ దొంగలించిన మొబైలా? లేదా డూప్లికేట్ IMEI number కలిగిన మొబైలా? అని ఈ యాప్ యూస్ చేసి IMEI Number ఎంటర్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం వేరే వాళ్ళ చేతిలో మోసపోవడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
4)Fraud Report (Chakshu):
- మనకు ఏవైనా స్పామ్ CALLS మరియు ఫ్రాడ్ SMS లు లేదా వాట్సాప్ నుండి ఫ్రాడ్ మెసేజీలు వచ్చినప్పుడు మనము ఈ CHAKSU అనే ఫీచర్ యూస్ చేసుకొని ఈ Sanchar Saathi app లో రిపోర్ట్ చేస్తాము.
మొబైల్ తయారీదారుల కంపెనీలు ఈ నిర్ణయానికి అంగీకరిస్తాయా?
ఈ పోస్ట్ రాసే సమయానికి ఇంకా ఏ ఒక్క కంపెనీ ముందుకు వచ్చి బహిరంగంగా ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. ఇకముందు అభ్యంతరం తెలుపుతాయో, తెలపవో అని ముందు నాటికి చూడాల్సి ఉంది.
అయితే అధికారం గా ఆపిల్ కంపెనీ ఏ విషయం ప్రకటించలేదు కానీ కొన్ని ఆర్టికల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నాయి ఏమిటంటే అసంతృప్తిగా ఉంది అని.
Sanchar Saathi app Installation :
ఈ Sanchar Saathi app మొదటగా డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయ్యి ఉండి డిసేబుల్ అవ్వడానికి లేకుండా ఉండేటట్లు తీసుకున్న నిర్ణయం ఆ తరువాత వచ్చిన విమర్శలు ఎదుర్కొన్న అనంతరం ఈ యాప్ డిసేబుల్ చేసుకోవడానికి సదుపాయం ఉంది అని తెలిపిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి.
ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన అంతవరకు ఈ సంచార్ సాతి ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉండటం ఉపయోగకరమా? కాదా? అని మీ అభిప్రాయము కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు.
కంక్లూషన్:
భారత కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశం ప్రకారం తప్పనిసరి చేసిన సంచార్ సాతి ఇన్స్టాలేషన్ మరియు ఈ యాప్ వలన కలిగే ఉపయోగాలు గురించి మనం తెలుసుకున్నాము.
మరొక పోస్టుతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన Telugu Tech Telugu బ్లాగును రెగ్యులర్గా చూస్తూ ఫాలో అవ్వగలరు. మేము షేర్ చేసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు లేదా మీ బంధువులకు షేర్ చేయగలరు.








