WhatsApp లో Meta AI తో ఫొటోలు ఎడిట్ చేయడం ఎలా? పూర్తి గైడ్

Meta AI photo editing: ఈ రోజుల్లో WhatsApp అంటే తెలియని వారు ఎవరు ఉండరు అని మనం చెప్పుకోవచ్చు. వాట్సాప్ అంటే chatting చేసుకోవడానికి, Status లు పెట్టుకోవడానికి, WhatsApp Group ల్లో మెసేజ్లు చేసుకోవడానికి మాత్రమే వాడుకోవచ్చు అని అనుకుంటారు చాలామంది. అయితే వాట్సాప్ లో కూడా AI ఉందని, మిగతా AI లు అంటే Google Gemini, Chatgpt, Claude లు లాగా వాడుకోవచ్చు అని కొంతమందికే తెలుసు. చాలామందికి తెలియకపోవచ్చు.

ఇంతకీ WhatsApp యాప్ లో ఉన్న AI పేరు ఏంటో తెలుసా? అదేనండి Meta AI. ఈ Meta AI ని మిగతా AI లాగా వాడుకుని మన పనులు ఈజీ చేసుకోవచ్చు. అలాంటి పనులలో ఒకటి ఫొటోలను AI తో ఎడిట్ చేయడం.

మీరు చెప్పండి? ఒకప్పుడు మనం ఫోటో దిగినప్పుడు ఆ ఫోటోలో ఎవరైనా వేరే వ్యక్తి పడినప్పుడు ఆ వ్యక్తిని ఫోటోలో నుండి తీసేయాలంటే, లేదా ఫోటోలోని బ్యాగ్రౌండ్ మార్చాలంటే Photoshop లాంటి సాఫ్ట్వేర్ వాడేవాళ్ళం. లేదంటే లాప్టాప్ గాని, కంప్యూటర్ గాని లేకపోతే Mobile
లో Photo editing apps డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకునే వాళ్ళం.

అయితే ఇప్పుడు అంతకు ముందులా కాదు ఈ AI మనకి కావాల్సినట్టుగా prompts ఇచ్చి మన పనిని సులభంగా చేసుకోవచ్చు.అసలు WhatsAppలో Meta AIతో ఫొటోలను ఎలా ఎడిట్ చేయాలి? అనేది ఇప్పుడు step-by-stepగా చూద్దాం.

Meta AI తో Photo Editing చేయవచ్చా? ఏం చేయవచ్చు?:

Meta AI తో ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చా? అని అంటే అవును చేసుకోవచ్చు. ఈ Meta AI ని యూస్ చేయడం అనేది అంత పెద్ద కష్టం ఏం కాదు. మనం WhatsApp లో ఒక పర్సన్ కి ఎలాగైతే message చేస్తామో! అలా మెసేజ్ చేసినట్లే సింపుల్ గా chat చేసుకుని మనం మనకు కావాల్సిన ఫొటోస్ ని ఎడిట్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు మనం పైన చెప్పుకున్నట్లే ఏదైనా ఒక ఫోటోలో వేరే తెలియని పర్సన్ ని తీసివేయాలనుకుంటే దాన్ని సింపుల్ గా Meta AI కి prompt ద్వారా చెప్పి ఆ వ్యక్తిని తీయడం కానీ, లేదంటే Background change చేసుకోవడం గానీ లాంటి Edit మనం ట్రై చేయొచ్చు.

ఇంకా మనం వివరంగా చెప్పుకోవాలి అంటే

  1. అనవసరమైన వస్తువులు లేదా వ్యక్తులను తీసేయడం: మనం ఎక్కడైనా దిగిన ఫొటోలో వెనుక ఎవరో నడుస్తూ వచ్చినా, చెత్తబుట్ట లేదా ఇంకా ఏమైనా వస్తువులు కనిపించినా వాటిని ఈజీగా Remove చేయవచ్చు.
  2. బ్యాక్‌గ్రౌండ్ మార్చడం: మనం సరదాగా ఇంట్లో తీసుకున్న ఫోటోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ చేంజ్ చేసి బీచ్ దగ్గర దిగినట్టు, లేదంటే ఆఫీసులో ఉన్నట్టు లేదా ఇలాంటి వేరే వేరే background సెట్ చేయవచ్చు.
  3. కొత్త వస్తువులు చేర్చడం: ఒకవేళ మీరు ఫోటో దిగారు అనుకోండి ఆ ఫోటో చాలా బాగా వచ్చింది కానీ ఒక sunglasses పెట్టుకొని ఉండుంటే బాగుంటుంది అని అనిపించింది అనుకోండి. అప్పుడు సన్ గ్లాస్ పెట్టమని అడగొచ్చు. ఇలా కొత్త వస్తువులు add చేయవచ్చు.
  4. క్రియేటివ్ లుక్ ఇవ్వటం: మనం దిగిన ఫోటోలను, sketch, painting లేదా cartoon లాంటి creative look లో మార్చుకోవచ్చు.
  5. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేయడం: మనం మామూలు ఫోన్లో దిగిన ఫోటోలకు, DSLR కెమెరాలతో ఫోటో తీస్తే ఎలాగైతే background లో blur వస్తుందో అలాగా blur చేయమని కూడా అడగవచ్చు.

గమనిక: అయితే ప్రతి edit ప్రతిసారీ ఒకేలా perfect గా వస్తుందని అనుకోవద్దు. ఫొటోను బట్టి result మారవచ్చు.

ఇలా నాకు తెలిసినవి నేను మీకు ఇక్కడ చెప్పాను. ఇంకా నాకు తెలియనివి, నేను ఏదైనా చెప్పకపోతే అవి మీరు కామెంట్స్ సెక్షన్ లో చెప్పండి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

WhatsApp లో ఉన్న Meta AI తో Photo Edit చేయడం ఎలా? Step-by-Step Guide:

మీరు ఇంతకుముందు ఈ Meta AI యూస్ చేసుకుని ఫోటోలు ఎడిట్ చేయకపోతే, అయితే ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము అని అనుకుంటున్నారా? అయితే ఈ steps follow అవ్వండి.

Step 1: ముందుగా WhatsApp Update చేసుకోండి:

మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్ లో ఉన్నWhatsApp Update లో ఉందా? లేదా? అని తెలుసుకోవడం. ఒకవేళ లేకపోతే మీ ఫోన్‌లో ఉన్న Play Store లేదా App Store ఓపెన్ చేసి Latest version ఉన్న WhatsApp ని వెంటనే update చేసుకోండి.

ఇలా ఎందుకు అంటే మీరు పాత WhatsApp యాప్ వాడుతున్నట్లయితే అందులో ఈ AI Features కనిపించొచ్చు లేదా కనిపించకపోవచ్చు. అందుకని ముందుగా మన దగ్గర ఉన్న WhatsApp యాప్ ని అప్డేట్ చేసుకోవడం మంచిది.

Step 2: Meta AI Chat open చేయండి:

ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి, WhatsApp లో కుడివైపు కార్నర్ లో ఉన్న Chats Tab పైన, Meta AI Icon కనిపిస్తుంది. దానిపై Tap చేయండి, ఒకవేళ అక్కడ గాని కనపడకపోతే Search Bar లో “Meta AI” అని Type చేసి తెరవండి.

Step 3: Photo Select చేయండి:

Meta AI Chat లో, Attachment Icon పై క్లిక్ చేసి, మీరు Edit చేయాలనుకునే Photo ని Gallery నుండి Select చేయండి.

అలా కాదు ఎడిట్ చేయాల్సిన ఫొటోస్ మీ దగ్గర ఏమీ లేవు అనుకుంటే అనుకుంటే డైరెక్ట్ గా అప్పటికప్పుడు కొత్త Photo తీసుకోవచ్చు.

Step 4: మీకు కావాల్సిన Prompt Type చేయండి:

పైన చెప్పిన విధంగా Photo సెలెక్ట్ చేసుకున్న తరువాత, కింద కనపడే కాప్షన్ బాక్స్ లో మీరు ఆ ఫోటోలో ఏమేమి మార్పులు చేయాలి అనుకుంటున్నారో అది స్పష్టంగా రాయాలి. ఒకవేళ మీరు తెలుగులో రాసిన అర్థం చేసుకుంటుంది. లేదంటే English లో Simple words వాడిన అర్థం చేసుకుంటుంది.

సింపుల్ గా కొన్ని examples చెప్పుకుందాము:

  • “Remove the person in the background” (వెనుక ఉన్న వ్యక్తిని తీసేయి)
  • “Change background to a modern office” (బ్యాక్‌గ్రౌండ్‌ ను మోడరన్ ఆఫీస్‌గా మార్చు)
  • “Make the background blur” (వెనుక భాగాన్ని బ్లర్ చేయి)
  • “Add stylish sunglasses to the face” (ముఖానికి కూలింగ్ గ్లాసెస్ పెట్టు)
  • “Convert this photo into a pencil sketch” (దీన్ని పెన్సిల్ స్కెచ్‌లా మార్చు)

Step 5: AI ఇచ్చిన ఫొటోను చెక్ చేయండి:

మీరు మీరు ఇచ్చిన Prompt ప్రకారం, కొన్ని సెకండ్లలో Meta AI ఆ ఫొటోను ఎడిట్ చేసి చాట్‌లో మీకు పంపుతుంది. మీకు ఆ రిజల్ట్ నచ్చితే నేరుగా సేవ్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఏదన్నా చిన్న తప్పు ఉండి రిజల్ట్ మీకు నచ్చకపోతే, అక్కడ కనపడే chat ద్వారా మళ్ళీ మీరు Prompt ఇచ్చి, ఆ photo ను మీకు నచ్చినట్లుగా వచ్చేంతవరకు ఎడిట్ చేయించుకోవచ్చు.

Step 6: Save లేదా Share చేసుకోండి:

Final Result మీకు నచ్చిన తర్వాత, Photo ని Download చేసుకోవచ్చు, అలాగే అవసరమైతే నేరుగా Friends, Groups లేదా WhatsApp Status లో share చేసుకోవచ్చు.

Meta AI photo editing వల్ల లాభం ఏంటి?:

  • స్టోరేజ్ ఆదా: ఇదివరకు లాగా మనము photo edit చేయడం కోసము వేరే editing apps ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేదు. Storage తక్కువ ఉన్న మొబైల్స్ లో కూడా మనం చాలా సింపుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు ఇలా AI యూస్ చేసుకొని.
  • త్వరగా ఎడిట్ చేయొచ్చు: చిన్నedit కోసం, పెద్ద Editing Software గురించి నేర్చుకొని ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఎడిట్ చేసుకోవచ్చు తొందరగా.
  • Beginners కి ఉపయోగకరం: ఎలాంటి ఎడిటింగ్ నాలెడ్జ్ లేకపోయినా, Text Instructions తో ప్రొఫెషనల్ గా ఎడిట్ చేయొచ్చు.

గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు:

ఈ ఫీచర్ ఉపయోగకరంగానే ఉన్నా, AI tools వాడేటప్పుడు privacy విషయంలో మాత్రం కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి.

  • Personal లేదా సెన్సిటివ్ ఫొటోలు పెట్టకండి: Aadhaar, PAN, bank documents, passwords లేదా ఇతర సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఫొటోలను AI కి అప్లోడ్ చేయకుండా ఉండటం మంచిది.
  • చిన్న తప్పులు ఉండొచ్చు: ఒక్కొక్కసారి చేతి వేళ్లు, ముఖం, లైటింగ్ లేదా complicated బాక్గ్రౌండ్ ఉన్న ఫొటోల్లో AI సరిగ్గా edit చేయకపోవచ్చు. ఫోటో ఎడిట్ చేసి ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి.
  • అందరికీ ఇంకా రాకపోవచ్చు: నాకు తెలిసి ఈ Meta AI సంబంధించినఫీచర్స్ అందరికీ ఎనేబుల్ అయి ఉండొచ్చు. ఒకవేళ WhatsApp update చేసినా ఈ features కనిపించకపోతే కొన్ని రోజుల తర్వాత మళ్లీ చెక్ చేయండి.

Meta AI తో ఇంకా ఏం చేయొచ్చు?:

ఈ Meta AI తో మనం Photo Editing మాత్రమే కాదు రోజువారీ పనుల్లో ఒక AI Assistant లా కూడా ఉపయోగించుకోవచ్చు.

  1. ప్రశ్నలు అడగడం: Doubts clear చేసుకోవచ్చు, facts తెలుసుకోవచ్చు, కొత్త ideas అడగొచ్చు.
  2. Content Create చేయడం: Images, captions, emails, stories లాంటివి create చేయొచ్చు.
  3. Planning: Trips, budget, schedules, meal plans వంటివి plan చేసుకోవచ్చు.
  4. Work and Coding: Code రాయడం, errors fix చేయడం, emailsలో help తీసుకోవచ్చు.
  5. Latest Updates: News, weather, scores, trends గురించి తెలుసుకోవచ్చు.

Final గా చెప్పాలంటే:

నా అభిప్రాయం ప్రకారం, చిన్న చిన్న ఫొటో కరెక్షన్లు, సోషల్ మీడియా DP లు, సరదా ఎడిటింగ్స్ కోసం Meta AI నిజంగా చాలా మంచిగా ఉపయోగపడే ఒక టూల్. అదేవిధంగా ఫోటోలో ఏదైనా తీసేయాలన్నా, బ్యాక్‌గ్రౌండ్ మార్చాలన్నా ఎవరినీ అడగాల్సిన పనిలేదు, WhatsApp లోనే నిమిషాలలో చేసేసుకోవచ్చు.

ఇకనుండి మీరు ఎలాంటి Editing Apps ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి మీరు మనం ఎప్పుడూ వాడే WhatsApp లోనే మనం చెప్పుకున్న విధంగా ఫాలో అయ్యి ఫొటోస్ ను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు.

WhatsApp లో Meta AI ఫీచర్ను మీరు ఎప్పుడైనా వాడారా అయితే వాడితే ఏ ఏ పర్పస్ మీద వాడారో? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.

ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి కానీ వాట్సాప్ గ్రూపులో కానీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త విషయాలను మీ ముందు ఉండాలంటే మన Telugu Tech Train బ్లాగును డైలీ ఫాలో అవుతూ ఉండండి.

You may also like these:

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

3 thoughts on “WhatsApp లో Meta AI తో ఫొటోలు ఎడిట్ చేయడం ఎలా? పూర్తి గైడ్”

Leave a Comment