Realme 16x 5G:ప్రముఖ మొబైల్ బ్రాండ్లలో ఒకటి అయిన Realme భారత మార్కెట్లోకి తన 5G mobile సెగ్మెంట్ లో Realme 16x 5G ని అఫీషియల్‌గా లాంచ్ చేసింది! 7,000mAh battery, 144Hz Refresh rate Display, VC cooling సిస్టమ్ మరియు Military-Grade డ్యూరబిలిటీ లాంటి అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
అయితే ఒక విషయం ఇక్కడ గమనించాలి. కేవలం 7,000mAh battery ఉందని ఈ ఫోన్‌ను వెంటనే కొనేయడం సరైన నిర్ణయం కాదు. మిగతా ఫీచర్లు కూడా చూసి, మన అవసరానికి సరిపోతుందో లేదో అని తెలుసుకొని కొనడం మంచిది.
మరి Realme 16x 5G ధర ఎంత? ఇందులో ఏం ఫీచర్లు ఉన్నాయి? ఈ ఫోన్ ఎవరికి సరిపోతుంది? కొనాలా వద్దా? పూర్తి వివరాలు గురించి ఈ ఆర్టికల్ లో చెప్పుకుందాము.
Realme 16x 5G: Variants and Price | వేరియంట్ మరియు ధర:
ఈ Realme 16x 5G మొబైల్ మార్కెట్లోకి రెండు రకాల కలర్ వేరియంట్లలో లాంచ్ చేశారు.
- Endurance Brown (ఎండ్యూరెన్స్ బ్రౌన్)
- Glory White (గ్లోరీ వైట్)
మరి అదే విధంగా RAM మరియు Storage వేరియంట్ల ప్రకారం చూసుకున్నట్లయితే, ఈ మొబైల్లో మూడు రకాలుగా తీసుకురావడం జరిగింది.
| ర్యామ్ & స్టోరేజ్ వేరియంట్ | Launch Price(అధికారిక లాంచ్ ధర) | Offer Price(Instant Discount), ఆగష్టు 13 నాటికి (As per Aug 13) |
| 4GB RAM + 128GB Storage | 25,999 /- రూపాయలు | 23,999 /- రూపాయలు |
| 6GB RAM + 128GB Storage | 27,999 /- రూపాయలు | 25,999 /- రూపాయలు |
| 6GB RAM + 256GB Storage | 30,999 /- రూపాయలు | 28,999 /- రూపాయలు |
గమనిక: ఇక్కడ నేను అధికారికంగా లాంచ్ అయిన Prices మెన్షన్ చేశాను. ఒకవేళ మీరు ఈ మొబైల్ ను కొనాలని చూస్తున్నప్పుడు మీకు అక్కడ కార్డు ఆఫర్స్ లేదా పాత మొబైల్ ఎక్స్చేంజ్ ఉపయోగించినట్లయితే మీకు ఈ Price ఇంకా తగ్గే అవకాశం ఉంది.
Realme 16x 5G sale ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎక్కడ కొనవచ్చు?:
ఈ Realme 16x 5G ఎవరైతే కొనాలనుకుంటున్నారో వారు కొంచెం సమయం వేచి ఉండాల్సి ఉంది ఎందుకు అంటే ఈ మొబైల్ యొక్క సేల్ అంటే అమ్మకాలు ఈ రోజు అనగా ఆగస్టు 13 మధ్యాహ్నం 12 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. అది కూడా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయినా Flipkart మరియు అఫీషియల్ Realme India వెబ్సైట్ లో సేల్ స్టార్ట్ అవుతుంది.
- Realme P4x mobile గురించి తెలుసుకోవాలా ? : Realme P4x
Realme 16x 5G Display and Specifications | డిస్ప్లే మరియు స్పెసిఫికేషన్లు:
ఇక్కడ Realme 16x 5G ఒక్క Design మరియు Build Quality గురించి కంపెనీ కొంత శ్రద్ధ వహించింది అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ మొబైలు మనకు 7,000mAh battery ఉన్నా కూడా ఈ ఫోన్ యొక్క మందం చూసుకున్నట్లయితే 8.88 mm మరియు weight చూసుకున్నట్లయితే 217 గ్రాములు గా ఉంది. చేతిలో పట్టుకుని వాడుకోడానికి కొంచెం మంచిగానే ఉంటుంది.
Realme 16x 5G లో ఈ సెగ్మెంట్లో రియల్ మీ వాళ్ళు 6.8-inch HD+ LCD display డిస్ప్లేను 144Hz Refresh Rate తో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ మొబైల్ ను సాధారణ 60Hz display డిస్ప్లే లతో పోలిస్తే scrolling, social media browsing, animations వంటి వాటిలో smoothness గమనించవచ్చు
ఈ Realme 16x 5G లో 1200 Nits Peak Brightness ఉండటం వల్ల మొబైల్ వాడేటప్పుడు brightness చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, ఎండలో ఈ మొబైల్ వాడాల్సి వస్తే, ఎండలో (Direct Sunlight) కూడా screen చాలా మంచిగా కనబడుతుంది.
Realme 16x 5G ప్రత్యేకతలు:
ఇంకా ఈ మొబైల్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పుకోవాలి అనుకుంటే ఈ స్పెసిఫికేషన్స్ గురించి కూడా చెప్పవచ్చు.
- MIL-STD-810H Certification: ఈ మొబైల్ MIL-STD-810H military-Grade సర్టిఫికేషన్ ఉండటం వల్ల షాక్ మరియు డ్రాప్ రెసిస్టెన్స్ చాలా బాగుంటుంది.
- IP65 Rating : మీ మొబైల్ లో ఐపీ 65 రేటింగ్ ఉండడం వల్ల Dust మరియు Water Splash లకు రేసిస్టెంట్ గా ఉంటుంది.
- 5,300 mm² AirFlow Vapor Chamber Cooling: ఎక్కువసేపు ఈ మొబైల్ ద్వారా గేమింగ్ ఆడినా లేదా వీడియోలు రికార్డ్ చేసినా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 5,300 mm² AirFlow Vapor Chamber Cooling సిస్టమ్‌ను ప్రొవైడ్ చేశారు.
- 3.5mm Headphone Jack: ఈ మధ్య చాలా మొబైల్‌లలో 3.5mm Headphone Jack కనబడట్లేదు. కానీ వీరు సరికొత్తగా వైర్డ్ ఇయర్ఫోన్లు వాడే వారి కోసం 3.5mm Audio Headphone Jack ప్రొవైడ్ చేశారు.
Realme 16x 5G Performance | పెర్ఫార్మెన్స్:
ఈ Realme 16x 5G ఫోన్ MediaTek Dimensity 6300 5G ఆక్టా-కోర్ Chipset తో పనిచేస్తుంది. ఉంటాయి. ఇది రోజూవారీ మల్టీటాస్కింగ్, వీడియో కాలింగ్, యూట్యూబ్ స్ట్రీమింగ్ మరియు గేమ్‌ల వంటి వాటికీ యూస్ చేసుకోవచ్చు.
ఇక RAM గురించి చెప్పుకోవాలంటే, ఈ మొబైల్ లో 4GB లేదా 6GB LPDDR4X RAM మరియు 128GB లేదా 256GB UFS 2.2 Storage వాటి వేరియంట్ల ఆధారంగా తీసుకువచ్చారు. అలాగే మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.
ఇందులో Android 16 తో Realme UI 7.0 రన్ అయ్యేలా తీసుకువచ్చారు. ఈ మొబైల్ కు OS Updates 2 Years వరకు ఉంటాయి. అదే విధంగా Security Updates 3 Years వరకు ఉంటాయి.
Realme 16x 5G 7000 mAH Battery and Charging | బ్యాటరీ మరియు చార్జింగ్:
ఈ ఫోన్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హైలెట్ పాయింట్ ఏంటంటే 7000 mAh battery. నేను రియల్ మీ పేజీలో ఈ మొబైల్ గురించి చూస్తుంటే, ఈ మొబైల్ ను ఒకసారి చార్జ్ చేస్తే 2 రోజుల వరకు వస్తుందని వాళ్ల పేజీలో మెన్షన్ చేశారు. ఇంకా ఈ మొబైల్ 45W SuperVOOC Fast Charging సపోర్టుతో తీసుకువచ్చారు. అంతేకాదండోయ్ Reverse Wired Charging సపోర్టు కూడా ఈ మొబైల్ లో ఉంది. అంటే ఈ మొబైల్ నుండి మరొక మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
Bypass Charging feature:
మరొక ఫీచర్ కూడా ఉంది అదే Bypass Charging. ఈ ఫీచర్ అంటే ఏందో ఒక మాటలో చెప్తాను. నార్మల్ గా మనం ఫోన్ కి ఛార్జ్ చేసేటప్పుడు, పవర్ డైరెక్ట్‌గా బ్యాటరీ కి వెళ్లి బ్యాటరీ చార్జ్ అవుతున్నాయి. కానీ బైపాస్ చార్జింగ్ విషయంలో చెప్పుకోవాలి అంటే మీరు ఎప్పుడైతే ఛార్జింగ్ వైర్ పెట్టి గేమ్ ఆడేటప్పుడు పవర్ నేరుగా బ్యాటరీకి వెళ్లకుండా మదర్‌బోర్డ్‌కు మాత్రమే వెళ్తుంది. దీనివల్ల ఫోన్ వేడెక్కడం చాలావరకు తగ్గుతుంది.
Realme 16x 5G Camera | కెమెరా:
Realme 16x 5G లో Rear Camera 50MP AI Primary Camera తో తీసుకువచ్చారు.దీనితోపాటుగా Flash Light కూడా తీసుకువచ్చారు. సాధారణ photos, social media కోసం photos, documents వంటి వాటికి ఈ camera సరిపోవచ్చు. ఈ కెమెరా ద్వారా Full HD @30 fps, HD @30 fps వరకు వీడియో షూట్ చేసుకోవచ్చు.
ఈ మొబైల్లో Front Camera 8MP Wide Angle కెమెరాను తీసుకువచ్చారు. ఈ కెమెరాతో మనం సెల్ఫీలు వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు.
Realme 16x 5G Pros & Cons)| ప్లస్‌లు మరియు మైనస్‌లు:
ప్లస్‌లు (Pros):
- Battery: 7,000mAh బ్యాటరీ తీసుకురావడంవల్ల ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్లేవారికి చార్జింగ్ ఇబ్బందులు అంతగా ఉండకపోవచ్చు. అలా అనే కాదు ఎక్కువగా ఫోన్ చేసేవారికి కూడా ప్రతిసారి చార్జింగ్ పెట్టే ఇబ్బంది ఉండకపోవచ్చు.
- Vapour Cooling: మొబైలు ఎక్కువసేపు వాడటం వల్ల వచ్చే హీట్ వల్ల ఫోన్ బాగా వేడి కాకుండా ఉండడానికి ఇందులో 5,300 mm² వేపర్ ఛాంబర్ ప్రొవైడ్ చేశాడు.
- Military Grade Certificate: MIL-STD-810 military-Grade సర్టిఫికేషన్ వల్ల ఈ మొబైలు షాక్ మరియు డ్రాప్ రెసిస్టెన్స్ లాంటి వాటిని తట్టుకోగలుగుతుంది.
- Bypass Charging: ఈ ఫీచర్ కొంచెం మంచిగానే ఉంది. ఫోను ఛార్జింగ్ పెట్టి వాడేటప్పుడు బ్యాటరీ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటుంది.
మైనస్‌లు (Cons):
- HD+ LCD dispaly: ఈ మొబైల్లో LCD Display HD+ తో రావడం కొంచెం మైనస్ గా చెప్పుకోవచ్చు.
- 8 MP Front camera: సెల్ఫీల కోసం కేవలం 8 MP Front Camera మాత్రమే ఇచ్చారు దీనిని ఇంకొంచం ఎక్కువ Megapixels తో ఇచ్చినట్లైతే బాగుండేది.
Realme 16x 5G ఎవరు కొనవచ్చు?
మీరు తక్కువ mAH బాటరీ ఉన్న మొబైల్ వాడేవాళ్లు అయితే ఈసారి మాకు ఎక్కువ mAH ఉండే బ్యాటరీ బాగుంటుంది అని అంతేకాక ఎక్కువసార్లు చార్జింగ్ పెట్టకుండా, మొబైల్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలి అని అనుకునే వాళ్ళు అయితే ఈ మొబైల్ బ్యాటరీ పరంగా మంచిగానే ఉంది.
మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు స్క్రీన్ ఎండలో కూడా మంచిగా కనపడాలి అని అనుకునే వాళ్ళు అయితే, ఎక్కువగా సోషల్ మీడియా, యూట్యూబ్ లో వీడియోలు చూసేవారైతే, రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ కావాలి అనుకునేవారైతే, గేమ్స్ ఆడినప్పుడు ఫోన్ అంతగా హీట్ కాకూడదు అనేవారు అయితే, ముఖ్యంగా 5G పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే Realme 16x 5G మంచిగానే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది అంతా ఇది నా అభిప్రాయం ప్రకారమే.
మీరు ఇంతవరకు చదివారు అంటే ఈ పోస్టు మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరికి అయినా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్లకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టెక్నాలజీ విషయాలు ప్రతిరోజు తెలుగు Telugu Tech Train బ్లాగ్ ను ఫాలో అవుతూ ఉండండి.
You may also like these:









Good information about the Realme 16x ,but price is to expensive.
Hi Murali, Ram Prices are increased, because of that Mobile prices are increased