Motorola Edge 70: భారత్‌లో వచ్చేసింది – ఈ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Motorola Edge 70: మోటరోలా ఇండియాలో తన Edge series లో ఒక కొత్త ఫోన్ ని డిసెంబర్ 15 2025 న.లాంచ్ చేసింది. అదే Moto Edge 70. ఇది Premium segment లో వచ్చిన కొత్త Mid range mobile. ఈ మొబైల్ కావాలనుకునేవారు డిసెంబర్ 23 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మొబైల్ ఈ నెల అనగా డిసెంబర్ 23Motorola official పేజీలో, Flipkart లో మరియు offline Stores లో సేల్ స్టార్ట్ అవుతుంది.

Specifications మరియు Features:

మొదటగా ఈ మొబైల్ చూసినట్లయితే మనకి మూడు కలర్ వేరియంట్స్ లో వస్తుంది. అవి ఏంటంటే

  • PANTONE Gadget Grey
  • PANTONE Lily Pad
  • PANTONE Bronze Green

ఈ మొబైలు 6.7 inches ఉంటుంది దీనితో పాటుగా Extreme AMOLED 1.5K Super HD display తో వస్తుంది. maximum 4500 peak Brigtness తో వస్తుంది మరియు 120 Hz refresh rate ఉంటుంది. ఇది ఎండలో కూడా ఈ Motorola edge 70 స్క్రీన్ చాలా brightness గా మనకి కనబడుతుంది. అంతేకాక ఈ మొబైల్ స్క్రీన్ చాలా sharper గా, smooth గా కనబడుతుంది.

ఈ మొబైల్ లోని స్క్రీన్ Corning Gorilla Glass 7i తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. మరి ఇందులో మనకి HDR10+ కంటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు మనకి Dolby Vision కూడా సపోర్ట్ చేస్తుంది.

మరి ఈ Moto edge 70 thickness చూసుకున్నట్లయితే మనకి 5.99 mm thickness తో వస్తుంది. ఈ మొబైల్ కి వాడిన ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ ప్రేమ్ కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ aircraft-grade aluminium frame తో వస్తుంది.అదే విధంగా weight విషయానికి వస్తే 159 grams గా ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది ఈ మొబైల్ ఎంత weightless గా ఉందో అని.

అంతేకాక ఇది IP 68 మరియు IP 69 Rating తో రావడం వల్ల ఇది Dust మరియు under water rotection గా యూస్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. MIL-STD-810H military-grade durability తో రావడం వల్ల ఈ Edge 70 mobile ను కొంచెం హార్డ్ గా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు ఈ మొబైల్లో.

Motorola Edge 70 Performance(పెర్ఫార్మన్స్ ):

Motorola Edge 70 మొబైల్ లో మనకి Qualcomm’s Snapdragon 7 Gen 4 chipset యూజ్ చేసారు. మరియు ఇది మనకి 8GB RAM మరియు 256 GB storage తో వస్తుంది. ఇక్కడ మనకి 8GB RAM LPDDR5x RAM. మరియు మనకి స్టోరేజ్UFS 3.1 storage సపోర్టుతో వస్తుంది. ఈ మొబైల్ లో మనం ర్యామ్ 12GB RAM వరకు బూస్ట్ చేసుకోవచ్చు. దీని వల్ల మొబైల్ పర్ఫామెన్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు.

Mobile Price
8GB RAM మరియు 256 GB storage29,999/- రూపాయలు

ఈ మొబైలు మనకి multi tasking, gaming మరియు content creation చేసే వాళ్ళకి చాలా స్మూత్ గా ఉంటుంది. అంతేకాక ఇందులో 4600 mm స్క్వేర్ vapor chamber cooling system కూడా యూస్ చేశారు. ఇది యూస్ చేయడం వలన మనకి థర్మల్ పెర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. ఈ మొబైల్ లో మనం ర్యామ్ 12 జిబి వరకు బూస్ చేసుకోవచ్చు. దీనివ ల్ల మనం పర్ఫామెన్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు.

ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 తో తీసుకురాబడింది. అంతేకాక ఇందులో Motorola’s Hello UI చేశారు.

Battery(బ్యాటరీ):

ఈ మొబైల్లో 5000 mAh silicon-carbon బ్యాటరీ యూస్ చేసారు. ఇది యూస్ చేయడం వల్ల బ్యాటరీ ఛార్జ్ ఎక్కువ సేపు వస్తుంది. అంతేకాక ఇది స్లిమ్ ఫోన్ కాబట్టి దీనికి ఈ కార్బన్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ యూస్ చేయడం వల్ల capacity ఎక్కువగా మరియు చాలా తక్కువ thickness గా ఉంటుంది. ఈ Motorola Edge 70, 68W TurboPower fast charging తో వస్తుంది మరియు 15 W wireless charging కూడా ఉంది.

Camera(కెమెరా):

ఈ మొబైల్లో మనకి rare side మూడు కెమెరాలు ఉన్నాయి. Primary camera వచ్చేసి 50MP optical image stabilization(OIS) తో వస్తుంది. ఇది స్టెబిలిటీ కోసం ఉపయోగపడుతుంది.

ఇంకొక కెమెరా 50MP Ultrawide LENS తో వస్తుంది. దీని ద్వారా మనము ఎక్కువ వైడ్ ఉన్న ఫొటోస్ ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

మూడోది 3-in-1 light సెన్సార్ తో వస్తుంది.

ఈ Rare side Camera లతో మనం 4k UHD (30fps), FHD 60fps లేదా 30fps తో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు.

మరి Front side చూసుకున్నట్లయితే మనకి సెల్ఫీ కెమెరా 50MP కెమెరాతో వస్తుంది. దీంతో మనం 4K Selfies తీసుకోవచ్చు.

Audio(ఆడియో ):

మరి ఆడియో విషయానికొస్తే ఇది DolbyAtmos తో వస్తుంది. దీంట్లో FM Radio లేదు. మనకి Head Phone jack USB Type-C తో ఉంటుంది. ఈ మొబైల్లో మనకి రెండు Microphone లు ఉన్నాయి.

ఈ బాక్స్ లో ఏమేమి వస్తాయి?

ఈ మొబైలు మనం కొన్నప్పుడు మనకి బాక్స్ లో, మొబైల్ తో పాటు USB Type-C to USB Type-C cable, Turbo Power 68W charger వస్తాయి.

అంతేకాక వీటితోపాటు Signature packaging fragrance, guide మరియు sim tool కూడా వస్తాయి.

ముగింపు:

మోటరోలా తీసుకువచ్చిన Motorola Edge 70 మొబైల్, మనం డైలీ యూసేజ్ పర్పస్ కోసం, మల్టీ టాస్కింగ్ కోసం, బ్యాటరీ ఎక్కువ సమయం కావాలి అనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ చాలా మంచిగా సెట్ అవుతుంది.

ఈ మొబైల్ కొనాలనుకునేవారు మీ బంధువుల్లో ఉన్న లేదా మీ మిత్రుల్లో ఉన్న వారికి ఈ ఆర్టికల్ షేర్ చేయండి.

ఇంకా మీకు ఈ మొబైల్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలుపగలరు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన Telugu Tech Train బ్లాగ్ ను డైలీ ఫాలో అవ్వండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

3 thoughts on “Motorola Edge 70: భారత్‌లో వచ్చేసింది – ఈ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!”

Leave a Comment