Vi New Recharge Plans: మనదేశంలో టాప్ నెట్వర్క్ సంస్థలు గురించి మనకు తెలుసు అవి ఏంటంటే airtel, jio, Vi. ఇందులో ఒకటైన Vi(వోడాఫోన్ ఐడియా) ఇప్పుడు సరికొత్తగా మూడు ప్లాన్స్ తీసుకువచ్చింది. ప్రతి నెట్వర్క్ సంస్థ తెచ్చే ప్లానులే కదా! దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి అని మనం అనుకోవచ్చు! కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఈ మూడు ప్లాన్స్ లో 25,000 రూపాయల వరకు మన మొబైల్ మీద ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది.
Vi recharge with mobile insurance:
వోడాఫోన్ ఐడియా(Vi) Insurance Coverage తో తెచ్చిన ఆ మూడు Data Voucher Plans ఏమిటంటే, ఒకటి 61 రూపాయల డేటా ప్లాన్, రెండోది 201 రూపాయల డేటా ప్లాన్ మరియు మూడోది 251 రూపాయల డేటా ప్లాన్. ఈ మూడు ఫ్రాన్స్ మనకు కేవలం డేటా ప్లాన్ కాకుండా మన Mobile కు ఇన్సూరెన్స్ కవరేజ్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి.
ఇవి కేవలం Data Voucher Plans మాత్రమే వీటిని రీచార్జ్ చేస్తే మనకు Internet Data మరియు Insurance Coverage మాత్రమే వస్తుంది. కానీ ఆల్రెడీ మనము రీఛార్జ్ చేసుకున్న మొబైల్ ప్లాన్ లో ఉన్న Calls మరియు SMS లకు ఎటువంటి ప్రభావితం కాదు. అనగా అవి extend అవ్వవు. ఇవి Data Voucher Plans, ఇవి కేవలం డేటా తో కాకుండా మన మొబైల్ కు ఇన్సురెన్స్ కవరేజ్ తో వస్తున్నాయి అంతే .
61 Data Voucher Plan:
- వోడాఫోన్ ఐడియా(Vi) 61 రూపాయల డేటా ప్లాన్ ని మనము రీఛార్జ్ చేసుకున్నప్పుడు మన మొబైల్ కి 2GB డేటా వస్తుంది. అది 15 days Validity తో వస్తుంది.
- దానితోపాటుగా మనకు 30 రోజుల వరకు 25 వేల రూపాయల వరకు మన మొబైల్ కు insurance coverage లభిస్తుంది.
- ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ మనకు కేవలము మన మొబైల్ చోరీ జరిగినప్పుడు లేదా పోగొట్టుకున్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది.
201 Data Voucher Plan:
- ఈ డేటా ఓచర్ ప్లాన్ కూడా పైన తెలిపిన ప్లాన్ లాగానే ఉంటుంది. ఈ వోడాఫోన్ ఐడియా 201 డేటా ప్లాన్ ని మనం రీచార్జ్ చేసుకున్నప్పుడు మన మొబైల్ కి 10 GB డేటా 30 days Validity తో వస్తుంది.
- దానితో పాటుగా మనకు 180 రోజల వరకు 25 వేల రూపాయల వరకు మన మొబైల్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది.
- ఇది కూడా పైన చెప్పిన విధంగా మన మొబైల్ చోరీకి గురైనప్పుడు లేదా పోగొట్టుకున్నప్పుడు వంటి పరిస్థితుల్లో మనకి ఈ ప్లాను వర్తిస్తుంది.
251 Data Voucher Plan:
- ఈ 251 రూపాయిల డేటా ఓచర్ ప్లాన్ ను మనము రీఛార్జ్ చేసుకున్నప్పుడు పైన తెలిపిన ప్లాన్లో లాగానే మన మొబైల్ కి 10 GB డేటా 30 days Validityతో వస్తుంది.
- అలాగే మనకు 365 రోజుల పాటు 25 వేల రూపాయల వరకు మన మొబైల్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది.
- అది కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే మన మొబైల్ దొంగతనము జరిగినప్పుడు లేదా మన మొబైల్ ని పోగొట్టుకున్నప్పుడు ఈ ప్లాను మనకు వర్తిస్తుంది.
ఈ ప్లానుకు గల షరతులు:
మనము ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ మనకు 25000 రూపాయల వరకు మన మొబైల్ కి వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ని ప్రొవైడ్ చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ABHICL’s terms ప్రకారం మన handset అంటే మొబైల్ అర్హత కలిగి ఉంటే మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.
- మన మొబైల్ దొంగతనం జరిగినప్పుడు లేదా పోయినప్పుడు మాత్రమే మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. మన మొబైల్ స్క్రీన్ పగిలినప్పుడు కానీ పాడైనప్పుడు గానీ ఈ ప్లాను లో గల ఇన్సూరెన్స్ కవరేజ్ మన మొబైల్ కి వర్తించదు.
- ఈ డేటా ఓచర్ ప్లాన్లు మనం రీఛార్జ్ చేసుకున్న 48 గంటలలోపు మనకు ఇన్సూరెన్స్ పార్ట్నర్ నుండి ఒక SMS వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ లో మన హ్యాండ్ సెట్ ని అంటే మన మొబైల్ ని మన మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అది కూడా మన హ్యాండ్ సెట్ అంటే మన మొబైల్లో Vi mobile number కు మాత్రమే రిజిస్టర్ అయ్యి ఉండాలి. మరియు మూడు సంవత్సరాలు కంటే మన మొబైలు పాతదిగా ఉండకూడదు.
- ఇలా ఇన్సూరెన్స్ పార్ట్నర్ యొక్క కండిషన్స్ కి అనుగుణంగా మన మొబైల్ అర్హత కలిగి ఉంటే, మనకు మన మొబైల్ మీద 25వేల రూపాయల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ వాలిడిటీ మనకు మనము తీసుకున్న ప్లాన్ల ఆధారంగా ఉంటుంది.
ముగింపు:
వోడాఫోన్ ఐడియా కొత్తగా తీసుకువచ్చిన ఈ డేటా ఓచర్ ప్లాన్లు కేవలం డేటా తోనే కాకుండా ఇన్సూరెన్స్ కవరేజ్ ను కూడా కలిగి ఉంటాయి.
అది కూడా మనం ఎంచుకున్న Data plan ప్రకారము మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ వ్యాలిడిటీ తో లభిస్తుంది. ఆ ప్లాన్స్ పైన చెప్పిన విధంగా 61 Data plan, 21 Data plan, 251 Data plan లు డేటా ఓచర్ ప్లాన్లుగా ఉన్నాయి.
వోడాఫోన్ ఐడియా తనదైన కొత్త స్టైల్ తో తన కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ కాంపిటీషన్లో నిలబెట్టుకునేందుకు ఈ కొత్త ప్లాన్లతో ముందుకు వచ్చింది.
మీలో ఎవరైనా వోడాఫోన్ ఐడియా సిమ్ యూస్ చేస్తున్నట్లయితే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి యూస్ చేస్తున్నాము అని, అదేవిధంగా ఈ ప్లాన్లు ఎలా ఉన్నాయో కింద కామెంట్ లో చెప్పండి.
ఇలాంటి మరెన్నో కొత్త అప్డేట్స్ లో మీ ముందు ఉండాలంటే మీరు డైలీ తప్పకుండా మన Telugu Tech Train బ్లాగ్ ఫాలో అవుతూ ఉండండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ మీ మిత్రులకు మీ బంధువులకు షేర్ చేయండి.









Good Information, Thank you
Thanks for your support
Great info
Thanks for your support