ఈ రోజుల్లో మొబైల్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది మీకు కూడా తెలుసు. మొబైల్ ని మనం ఇంతలాగా మన లైఫ్ లోకి తెచ్చుకోవడానికి కారణం Internet. కేవలం ఇంటర్నెట్ అంటే సరిపోదు. ఇంటర్నెట్ స్పీడ్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
ఒకప్పుడు తక్కువ బడ్జెట్లో 4G మొబైల్స్ వస్తున్నాయంటే ఆశ్చర్యపోయే వాళ్ళము. అలాంటిది ఈరోజు Samsung తక్కువ బడ్జెట్లో 5G segment లో కొత్త మొబైల్ ని లాంచ్ చేసింది. Samsung బ్రాండ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అవును కదా! అలాంటి కంపెనీ నుండి లాంచ్ అయిన కొత్త 5G మొబైల్ ఏంటంటే Samsung Galaxy F70e 5G.
Samsung Galaxy F70e 5G – Specifications:
ఈ మొబైల్ గురించి మనం ముందుగా చెప్పుకోవాలంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏమిటంటే 6000 mAh బ్యాటరీతో 5G మొబైల్ తక్కువ బడ్జెట్లో రావటం.
ఈ మొబైలు మనకి రెండు కలర్ వేరియంట్ లో వస్తుంది. అవి ఏంటంటే
- Lime Light Green
- Spotlight blue
అంతే కాదండోయ్ ఈ మొబైలు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూసినట్లయితే మనకి Leather finish వస్తుంది చూడటానికి చాలా మంచిగా ఉంది.
ఈ మొబైల్ 8.2 mm slim thickness మరియు 17.13 inches Display తో వస్తుంది. ఈ మొబైలు మనకు HD+ డిస్ప్లే తో వస్తుంది. మరి రిఫ్రెష్ రేటు చూసుకున్నట్లయితే 120 Hz refresh rate తో వస్తుంది. దీనితోపాటుగా brightness విషయానికొస్తే 800 nits ఉంటుంది.
Samsung F70e – Processor:
ఈ మొబైల్లో ప్రాసెస్ గురించి చెప్పుకోవాలంటే నాకు MediaTek Dimensity 6300 processor తో అందుబాటులోకి వస్తుంది. Samsung Official పేజీలో ఇచ్చిన ప్రకారముగా చూసినట్లయితే AnTuTu score 623000 గా ఉంది. కాబట్టి ప్రాసెస్ లో విషయంలో చూసుకున్నట్లయితే మనకు ఈ మొబైలు lag free మరియు Multi Tasking పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు.
Samsung F70e 5G – Price and Variants:
ఈ సాంసంగ్ F70e మొబైల్ మనకు 2 వేరియన్స్ లో లభిస్తుంది. ఒకటి 4GB RAM మరియు రెండవది 6GB RAM. ఈ రెండు మొబైల్స్ కు కామన్ గా 128 GB స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైస్ వేరియన్స్ ని ఒక టేబుల్ ఫార్మేట్ లో చూస్తే ఈ విధంగా ఉంటుంది.
| Variant | Price |
| 4 GB RAM + 128 GB storage | 12,999 /- రూపాయలు |
| 6 GB RAM + 128 GB storage | 14,999 /- రూపాయలు |
Samsung F70e 5g – Camera:
ఈ మొబైల్లో camera చూసుకున్నట్లయితే మనకి 50 MP Ultra clear camera తో మరియు 2MP depth camera తో రేర్ సైడ్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనితో ఫొటోస్ మరియు వీడియోస్ మంచి క్వాలిటీ లో తీసుకోవచ్చు.
మరి సెల్ఫీ కెమెరా అదేనండి ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు 8 MP కెమెరాతో వస్తుంది ఈ విధంగా చూసుకున్నట్లే మనము మంచిగానే ఫొటోస్ మరియు వీడియోస్ తీసుకోవచ్చు. ఈ బడ్జెట్లో మనకు ఈ కెమెరా ఆప్షన్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు.
Samsung F70e – Battery:
ఈ మొబైల్లో ప్రత్యేకత ఏంటంటే అది 6000 mAh బ్యాటరీ అని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ లో. మరి అలాంటి ఈ బ్యాటరీని రీచార్జ్ చేసుకోవడానికి మనకు 25 watts charger ఇస్తున్నారు. మీరు ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే మనము రోజంతా యూస్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికొస్తే మనకి ఈ బడ్జెట్ లో 6000 mAh అంటే ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు.
Samsung Galaxy F70e – Sale:
ఈ మొబైలు samsung brand నుండి ఈరోజు లాంచ్ చేశారు కానీ సేల్స్ మాత్రం ఈ నెల అంటే ఫిబ్రవరి 27 వ తేదీ 12 PM నుండి Flipkart మరియు Samsung యొక్క Official page నుండి స్టార్ట్ అవుతాయి. ఎవరికైనా ఈ మొబైల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బడ్జెట్లో కావాలనుకున్నవారు కొనుక్కోవచ్చు.
నా అభిప్రాయం ప్రకారం తక్కువ బడ్జెట్లో సాంసంగ్ బ్రాండ్ నుండి మొబైల్ యూస్ చేసుకోవాలనుకుంటే, అది కూడా 5జి మొబైల్ మరియు 6000 mAh బ్యాటరీ తో కావాలనుకున్న వారికి ఈ మొబైల్లో చాలా మంచిగానే ఉంటుంది.
నా అభిప్రాయం ప్రకారం తక్కువ బడ్జెట్లో సాంసంగ్ బ్రాండ్ నుండి మొబైల్ యూస్ చేసుకోవాలనుకుంటే, అది కూడా 5G Mobile మరియు 6000 mAh బ్యాటరీ తో కావాలనుకున్న వారికి ఈ మొబైల్ చాలా మంచిగానే ఉంటుంది.
ఈ Samsung Galaxy F70e మొబైల్ మీకు నచ్చిందా? లేదా? అని నాకు చెప్పాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చెప్పగలరు. మీలో ఎవరైనా సాంసంగ్ మొబైల్ యూస్ చేస్తున్నట్లయితే Samsung mobile అని కామెంట్ చేయండి.
ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు రావాలంటే తెలుగు Telugu Tech Train డైలీ ఫాలో అవ్వండి.









Good
thank you for supporting us.