Infinix Note Edge 5G: భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే – పూర్తి వివరాలు

Infinix Note Edge 5G: Infinix నుండి ఒక కొత్త 5G మొబైల్ వచ్చింది. అదే Infinix Note Edge 5G. ఈ మొబైల్ మిడ్ రేంజ్ 5G మొబైల్ గా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ బ్యాటరీ 6500 mAh తో తీసుకువచ్చారు. ఈ మొబైలు మనకు అఫీషియల్ గా ఈరోజు అనగా 18 ఫిబ్రవరి 2026న లాంచ్ అయింది. Infinix బ్రాండ్ నుండి ఏదైనా 5G మొబైల్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే ఒకసారి ఈ మొబైల్ గురించి చూడండి. తాజాగా ఈ రోజే లాంచ్ అయిన మొబైల్ కదా ఒక లుక్ వేయండి.

Infinix Note Edge 5G Specifcations:

ఈ ఇన్ఫినిక్స్ మొబైల్ మనకు 7.2 mm slim గా అంటే అంత మందంగా ఉంది. Infinix అఫీషియల్ పేజీలో కూడా హైలెట్ చేసి చూపించారు. మరి ఫోను inches చూసుకున్నట్లయితే 6.78 inches FHD+ మరియు 3D curved 1.5K AMOLED display తో వస్తుంది. అంతే కాదండోయ్ Refresh rate ఈ మొబైల్ లో 120 Hz ఇచ్చారు. మరి brightness విషయానికి వచ్చినట్లయితే 4500 nits వరకు Peak Brightness ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ display Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ తో వస్తుంది.

Infinix Note Edge 5G Price and Variant:

ఈ Infinix బ్రాండ్ నుండి వచ్చిన Note Edge 5G మొబైల్ మనకు 3 కలర్ వేరియంట్లలో తీసుకువచ్చారు.

  1. Lunar Titanium
  2. Stellar Blue
  3. Silk Green

మరి మొబైల్ RAM చూసుకున్నట్లయితే 6 GB మరియు 8 GB వేరియంట్లలో LPDDR5X RAM తో తీసుకువచ్చారు. అదేవిధంగా స్టోరేజ్ ప్రకారంగా చూసినట్లయితే 128 GB, 256 GB తో UFS 2.2 స్టోరేజ్ టైపు తో మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ స్టోరేజ్ టైపు ఇంకా అడ్వాన్స్గా వచ్చినట్లయితే ఇంకా ఈ మొబైల్ బాగుండేది.

మరి RAM మరియు స్టోరేజ్ ప్రకారంగా వాటి ప్రైస్ ఆధారంగా ఈ క్రింది టేబుల్ లో చూద్దాము.

Infinix Note EdgePrice
6 GB RAM + 128 GB Storage21,999 /-
8 GB RAM + 128 GB Storage23,999 /-
8 GB RAM + 256 GB Storage25,999/-

Infinix Note Edge 5G Performance(పెర్ఫార్మన్స్):

ఈ Note Edge మొబైల్ MediaTek Dimensity 7100 తో వస్తుంది. అదే విధంగా వీళ్లు Infinix అఫీషియల్ పేజీలో Antutu score 750000+ గా మెన్షన్ చేశారు.

Infinix Note Edge 5G Camera(కెమెరా):

ఈ మొబైల్లో కెమెరాను చూసినట్లయితే మనకు 50 MP Primary Camera (wide angle) లో ఇచ్చారు. ఈ 50 మెగాపిక్సల్ live photo mode తో వస్తుంది. ఈ కెమెరాను యూస్ చేసుకొని 2k @30 fps Video Recording చేసుకోవచ్చు. మరి Flash light గురించి చూసినట్లయితే ఈ మొబైల్ Dual LED Flash తో వస్తుంది.

ఫ్రంట్ సైడ్ కెమెరా 13 MP wide angle కెమెరాతో తీసుకువచ్చారు. మనం చీకట్లో ఫొటోస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ మొబైల్ లో మనకు Screen flash ఇవ్వడం వల్ల ఈజీగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ కెమెరాతో మనకు 2k @30 fps Video Recording చేసుకోవచ్చు.

Infinix Note Edge 5G Battery ( బ్యాటరీ):

మనం పైన చెప్పుకున్నట్లే ఈ మొబైల్లో 6500 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ తో తీసుకువచ్చారు. ఇంత బ్యాటరీ చార్జ్ చేయాలంటే గ్యారంటీగా పోస్ట్ చార్జర్ ఉండాల్సిందే! అందుకు ఈ రేంజ్ లో 45 Watts Fast charger ను ప్రొవైడ్ చేస్తున్నారు.

వీళ్లు అఫీషియల్ పేజీలో మెన్షన్ చేసిన ప్రకారం గా ఈ బ్యాటరీ 50% వరకు 27 minutes లలో చార్జ్ అవుతుంది. అదేవిధంగా 100% కొరకు చార్జ్ అవ్వాలంటే సుమారుగా 62 minutes లలో చార్జ్ అవుతుంది. ఇంతటితో ఆగిపోలేదు ఈ రేంజ్ లో Reverse wired charging ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ఇది కొంచెం అట్రాక్టివ్ గా ఉంది.

ప్రత్యేక విషయాలు:

  • ఈ మొబైల్ NFC support తో రావడం వలన మనం జస్ట్ tap and pay తో పేమెంట్స్ చేసుకోవచ్చు. క్లారిటీగా చెప్పాలంటే ఎలాంటి కార్డు స్వైప్ చేయకుండా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా ఒక tap తో payment చేసేయొచ్చు.
  • ఈ Infinix Note Edge 5G మొబైల్ లో JBL చే Dual speakers యూస్ చేశారు. JBL బ్రాండ్ అంటే చాలామందికి తెలిసిన బ్రాండ్. ఇక సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
  • ఈ మొబైల్ IP 65 తో తీసుకురావడం వల్ల Dust మరియు water splashes కు మొబైల్ ప్రొటెక్షన్ గా ఉంటుంది.

ఈ మొబైల్ ఎవరు తీసుకోవచ్చు అని నా అభిప్రాయం ప్రకారం:

ఎవరైతే బ్రాండ్ తో సంబంధం లేకుండా ఎక్కువ బ్యాటరీ లాభాలతో, ఒక మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే కావాలి మరియు NFC support, JBL speakers audio కావాలి అని అనుకునే వాళ్లకు ఈ మొబైల్ మంచిగా సరిపోతుంది.

ఇదండీ Infinix Note Edge 5G మొబైల్ గురించి. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ చెప్పడం మిస్ అయినట్లయితే కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. ఎవరైతే Infinix మొబైల్ ఇప్పటికే వాడుతున్నారో వారు కూడా మీరు ఏ బ్రాండ్ వాడుతున్నారో కామెంట్ చేయండి.

ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలంటే ప్రతి రోజు Telugu Tech Train బ్లాగును ఫాలో అవుతూ ఉండండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Infinix Note Edge 5G: భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే – పూర్తి వివరాలు”

Leave a Comment