Thalliki Vandanam Payment Status 2026: మీ ఖాతాలో ₹13,000 పడ్డాయా? ఇలా చెక్ చేయండి

Thalliki Vandanam Scheme payment status: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన తల్లికి వందనం స్కీమ్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో 13000 రూపాయల డబ్బులు వేస్తుంది. మరి ఈ పథకానికి మీరు కూడా అర్హులు అయితే మీకు 13 వేల రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో పడతాయా? లేదో తెలుసుకోండి.

ఇలా మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయో లేదో అని తెలుసుకోవడానికి మీరు గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం కి వెళ్లి తిరగాల్సిన అవసరం లేదు. మీ యొక్క మొబైల్ మరియు ఆధార్ నెంబర్ ఉంటే చాలు తల్లికి వందనము పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంట్లో ఈ పథకానికి అర్హుడైన విద్యార్థికి 13 వేల రూపాయలు DBT (Direct Benefit Transfer) పద్ధతిలో తల్లి బ్యాంకు ఖాతాలోను పడేలా నిధులు విడుదల చేసింది.

ఆన్‌లైన్‌లో ‘Thalliki Vandanam’ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?:

  1. ముందుగా మీ మొబైల్లో google chrome బ్రౌజర్ ఓపెన్ చేసి, అందులో bm-sgsw.ap.gov.in వెబ్ పేజీని ఓపెన్ చేయండి.
  2. ఇలా ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో Menu ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే “Application status” కనపడుతుంది.
  3. Application status మీద క్లిక్ చేస్తే మరొక కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
  4. ఇక్కడ మీరు Scheme దగ్గర Thalliki Vandanam సెలెక్ట్ చేసుకొని, Year 2026-2027 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు “Search By” ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది.
  5. ఈ Search By దగ్గర మీరు “Mother/Father/Guardian” అని సెలెక్ట్ చేసుకోండి.
  6. ఆ తర్వాత ఇక్కడ తల్లి యొక్క ఆధార్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత “Get OTP” మీద క్లిక్ చేయండి.
  7. ఆ తర్వాత ఇక్కడ మీరు Captcha ఎంటర్ చేసి, తల్లి యొక్క ఆధార్ నెంబర్కు లింకు అయిన మొబైల్ కి వచ్చిన OTP ని ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేయండి.

ఇలా చేసిన తర్వాత మీకు మీ Details మరియు తల్లికి వందనం పేమెంట్ యొక్క వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ రకంగా మీరు Thalliki Vandanam Scheme payment status చెక్ చేసుకోవచ్చు.

వాట్సాప్ (WhatsApp) ద్వారా పేమెంట్ స్టేటస్ తెలుసుకునే విధానం:

  1. ఇలా కేవలం ఆన్లైన్లోనే కాకుండా మీ మొబైల్ లో ఉండే whatsapp ద్వారా కూడా మీయొక్క తల్లికి వందనం స్కీం యొక్క పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
  2. మొదటగా మీరు 95523 00009 నెంబర్ను సేవ్ చేసుకోవాలి.
  3. whatsapp లో ఆ నెంబర్ కి “Hi” అని మెసేజ్ పంపండి.
  4. Hi పెట్టిన తర్వాత మనకు ఆటోమేటెడ్ మెనూ వస్తుంది మనం తల్లికి వందనం స్కీమ్ ఎంచుకొని ఆధార్ ఇంటర్ చేయడం వలన మనం స్టేటస్ తెలుసుకోవచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ముగింపు:

మీ ఇంట్లో తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన విద్యార్థులు ఉన్నట్లయితే ఈ విధంగా మీయొక్క స్టేటస్ను ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు.

నా సలహా ప్రకారం మీరు కేవలము అధికారిక URL యూస్ చేసి మాత్రమే మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఎలాంటి తెలియని లింకు ద్వారా క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వకండి. కేవలము అధికారిక URL మాత్రమే వాడండి. ఇదంతా ఎందుకు అనుకుంటే నేను పైన చెప్పిన లింక్ అధికారిక లింకు ద్వారా మీ పేమెంట్ స్టేటస్ను తెలుసుకోండి.

ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాలు మీ ముందుకు రావాలంటే Telugu Tech Train బ్లాగును ప్రతిరోజు ఫాలో అవ్వండి.

మీకు ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను.

You may also like these:

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “Thalliki Vandanam Payment Status 2026: మీ ఖాతాలో ₹13,000 పడ్డాయా? ఇలా చెక్ చేయండి”

Leave a Comment