WhatsApp Privacy settings: మీరు ఎవరికైనా మెసేజ్ చేయాలన్న, లేకపోతే వీడియో కాల్స్ మాట్లాడాలన్నా, లేదా వాయిస్ కాల్స్ మాట్లాడాలన్నా ఎక్కువ వాడే యాప్ ఏంటి? ఇలా అడిగితే చాలామంది చెప్పే యాప్ ఏంటంటే WhatsApp అని మనం చెప్పుకోవచ్చు. అంతలా WhatsApp మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది.
అయితే ఈ వాట్సాప్ యూస్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురుకోవాల్సి ఉంది. తెలియని నంబర్ల నుంచి Spam Calls, unwanted messages, ఫేక్ job offers, suspicious links మరియు వేరే వేరే తెలియని WhatsApp Group లో add చేయడం. ఇలాంటి వాటివల్ల కొన్నిసార్లు privacy మరియు security సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత, మనకు ఒక మంచి విషయం ఏంటంటే, మనం చెప్పుకున్న వాటినుండి ఎంతో కొంత మనల్ని మనం save చేసుకోవడానికి WhatsApp లో కొన్ని Privacy Settings ఉన్నాయి. వాటిని సరైన విధంగా మార్చుకుంటే మీ privacy మరియు securityను కాపాడుకోవచ్చు.
తెలియని నంబర్ల కాల్స్‌ను మ్యూట్ చేయడం | Silence Unknown Callers:
మీరు ఫోను పక్కన పెట్టారు అనుకోండి. సరిగ్గా ఫోన్ మోగుతుంది. ఎవరో మన ఫ్రెండ్ కానీ లేదా మన చుట్టాల్లో ఎవరైనా ఫోన్ చేశారేమో అనుకుంటాము. కానీ చూస్తే Unknown Number. ఎవరు అని ఫోన్ లిఫ్ట్ చేస్తే అది రాంగ్ నెంబర్ అయి ఉండొచ్చు, లేదంటే స్పామ్ Call అయ్యుండొచ్చు, రాంగ్ నెంబర్ అయితే ఓకే కానీ స్పామ్ కాల్ అయితే మనం ఇబ్బంది పడొచ్చు.
అప్పుడు మీకు Silence Unknown Callers అనే ఆప్షన్ మంచిగా ఉపయోగపడవచ్చు.
ఎలా ఆన్ చేయాలి?
- మీరు WhatsApp ఓపెన్ చేసి కుడివైపున పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి Settings లోకి వెళ్లండి
- ఇక్కడ మీకు Privacy అనే ఆప్షన్ కనపడుతుంది. దానిమీద ట్యాప్ చేయండి.
- ఆ తర్వాత వచ్చిన ఆప్షన్లలో, క్రిందికి స్క్రోల్ చేసి Calls పై క్లిక్ చేయండి.
- ఇక్కడ కనపడే “Silence Unknown Callers” ను ఆన్ (Enable) చేయండి.
దీనివల్ల Use ఏంటంటే: Silence Unknown Callers అనే ఆప్షన్‌ను ఆన్ చేసుకోవడం వల్ల, ఎవరైనా మీ Contact list లో number లేని వాళ్ళ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తే మీ ఫోను రింగ్ అవ్వదు. Silent లో ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియని నెంబర్ దగ్గర నుండి ఏదైనా స్పామ్ కాల్ వస్తే మీరు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ఆ తర్వాత మీకు వచ్చిన తెలియని వాళ్ళ దగ్గర నుండి వచ్చిన మిస్డ్ కాల్ మీ Calls ట్యాబ్‌లో చూపిస్తుంది.
Unknown People మిమ్మల్ని Groupsలో Add చేయకుండా చూడండి:
ఈరోజుల్లో WhatsApp లో spam Groups కూడా చాలామందికి ఇబ్బందిగా మారాయి. అది ఎలాగంటే, Part-time Jobs అని, Investment అని, ఇలా చాలా తెలియని గ్రూప్స్ లో మనల్ని యాడ్ చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్లు వస్తూ, స్పాం గ్రూపుల్లో మనం ఇరుక్కుపోవాల్సి వస్తుంది.
ఇలా మనకు అవసరం లేని Groups లో, మనల్ని ఎవరు పడితే వారు add చేయకుండా WhatsAppలోనే ఈ సెట్టింగ్ మార్చుకోవచ్చు.
ఎలా మార్చాలి?
- మీరు వాట్సప్ ఓపెన్ చేసి, ఇలా ఆప్షన్స్ లోకి వెళ్ళండి. Settings > Privacy > Groups.
- “Who can add me to groups” అనే option కనిపిస్తుంది. ఇది Everyone అని సెలెక్ట్ అయి ఉంటుంది.
- ఇక్కడ మీరు “My Contacts” ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ contactsలో ఉన్నవారు మాత్రమే direct గా add చేయగలరు.
- అలా కాకుండా “My Contacts Except…” ఆప్షను సెలెక్ట్ చేసుకుంటే, మీరు వద్దనుకునే కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ exclude చేయవచ్చు.
Privacy కోసం సాధారణంగా My Contacts మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
దీనివల్ల Use ఏంటంటే: మీ contacts లో లేని వ్యక్తి మిమ్మల్ని డైరెక్ట్ గా Groupలోకి add చేయలేరు. అవసరమైతే వారు గ్రూప్ లోకి యాడ్ చేయాలనుకుంటే Group invitation పంపుతారు. అప్పుడు ఇలా తెలియని Group invitation వస్తే మీరు అందులో Join అవ్వాలా? లేదా? అని మీ అవసరం మీద తెలుసుకొని చూసుకోండి.
Profile Photo అందరికీ కనిపించకుండా చేయండి:
మన WhatsApp Profile Photo ప్రతి ఒక్కరికీ కనిపించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మన phone number ఎవరెవరి దగ్గర ఉందో మనకి తెలియదు కదా! ఒకవేళ వాళ్ళు మన నెంబర్ సేవ్ చేసుకొని మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మన Profile Photo వాళ్లకి ఈజీగా కనబడుతుంది కదా! ఇలా మీ ఫోటో అందరికీ కనపడకుండా ఈ సెట్టింగ్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు.
ఎలా మార్చాలి?
- మీరు వాట్సాప్ లో Settings > Privacy > Profile Photo లోకి వెళ్లండి.
- ఇక్కడ మీరు మీకు అవసరమైన ఆప్షన్ ని ఎంచుకోండి.
- Everyone
- My Contacts
- My Contacts Except…
- Nobody
మీకు కొంచెం privacy కావాలి అనుకుంటే My Contacts అనేది మంచి మంచి ఆప్షన్. ఇలా చేస్తే కేవలం మీ contacts లో వారికి మాత్రమే మీ Profile Photo కనిపిస్తుంది.
లేదు మీకు ఇంకా ఎక్కువ privacy కావాలంటే Nobody option ను కూడా select చేసుకోవచ్చు . ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎవరికి మీ Profile Photo కనబడదు.
Last Seen & Online Status ను Privateగా ఉంచండి:
మీరు వాట్సాప్ లో ఎప్పుడు Online లో ఉన్నారు, లేదా చివరిసారిగా ఎప్పుడు Online లోకి వచ్చారు అనే విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే Unknown persons ఇది చెక్ చేసుకుని మీకు స్పాం కాల్స్ చేసే అవకాశం ఉంది.
ఇలా మీ Last Seen & Online Status కనపడకుండా వాట్సాప్ లో ఇలా సెట్టింగ్ మార్చుకోవచ్చు.
ఎలా మార్చాలి?
- మీరు WhatsApp ఓపెన్ చేసి Settings కి వెళ్లండి.
- ఇక్కడ కనపడే Privacyపై ట్యాప్ చేయండి.
- ఆ తర్వాత Last Seen and Online ను ఓపెన్ చేయండి.
- ఇక్కడ మీరు Who can see my last seen లో My Contacts లేదా Nobody సెలెక్ట్ చేసుకోండి
- ఆ తర్వాత కింద Who can see when I’m online లో Same as last seen సెలెక్ట్ చేసుకోండి.
గమనిక: ఇక్కడ మీరు కేవలము మీ కాంటాక్ట్స్ వరకే కనపడాలి అనుకుంటే My Contacts మరియు Same as last seen కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇంకా ఎక్కువ ప్రైవసీ కావాలి అనుకుంటే Nobody మరియు Same as last seen సెలెక్ట్ చేసుకోండి.
ఇలా చేస్తే మీరు ఎప్పుడూ ఆన్‌లైన్‌లోకి వచ్చారు అనేది, Unknown persons కి తెలియదు.
WhatsApp Calls కోసం Protect IP Address ఆన్ చేయండి:
మీరు తెలియని నెంబర్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నారు అనుకోండి. అవతల వాళ్లు మీ IP Address ను ట్రేస్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. మీకు ఇలాంటి ఇబ్బంది రాకుండా మీ WhatsApp Calls లో ఎక్కువ privacy కావాలి అంటే, ”Protect IP Address in Calls” ఎనేబుల్ చేసుకోండి.
ఎలా ఆన్ చేయాలి?
- WhatsApp ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ కి వెళ్ళండి. Settings > Privacy > Advanced
- ఇలా Advanced అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత “Protect IP address in calls” ఆప్షన్‌ను కనపడుతుంది.
- ఈ ఆప్షన్‌ను మీరు ఎనేబుల్ చేసుకోండి.
మీరు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు మాట్లాడే కాల్స్ డైరెక్ట్ గా కాకుండా, WhatsApp servers ద్వారా జరుగుతుంది. దీనివల్ల మీ IP addressను protect చేయవచ్చు.
గమనిక: ఇలా కాల్స్ డైరెక్ట్ గా కాకుండా, WhatsApp servers మీద జరిగినప్పుడు కొంచెం మీ Call Quality తగ్గవచ్చు.
WhatsApp Account కోసం Two-Step Verification ఆన్ చేయండి:
మనం పైన చెప్పుకున్న Privacy settings తో పాటు మీ WhatsApp account security కూడాఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా మీకు తెలియకుండా WhatsApp account ను మరో Device లో వాడడానికి ట్రై చేసినప్పుడు Two-Step Verification అనేది మీకు ఒక ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్ లాగా వర్క్ అవుతుంది.
ఎలా ఆన్ చేయాలి?
- ముందుగా మీరు WhatsApp ఓపెన్ చేసి Settings కి వెళ్లండి.
- అక్కడ Account పై ట్యాప్ చేయండి.
- ఆ తర్వాత Two-step verification ను సెలెక్ట్ చేసుకోండి.
- ఇక్కడ Two-step verification ని ఆన్ చేసుకోండి.
- ఇప్పుడు మీకు Password క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. మీకు గుర్తుండే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి.
- ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీ email address కూడా ను add చేసుకోండి. ఇది ఎందుకంటే తర్వాత మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మీకు email అడ్రస్ ద్వారా మీ పాస్వర్డ్ ని మీరు రికవర్ చేసుకోవచ్చు.
గమనిక: మీ WhatsApp verification code లేదా Two-Step Verification PIN ను ఎవరితోనూ share చేయకండి.
గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:
- బ్లాక్ & రిపోర్ట్ (Block & Report): తెలియని నంబర్ల నుండి మీకు లాటరీ, ఫేక్ ఉద్యోగం లాంటి వేరే ఏ మెసేజ్‌లు వచ్చిన వాటికి రిప్లై ఇవ్వకుండా వెంటనే చాట్ స్క్రీన్ పై కనపడే Report & Block ఆప్షన్ నొక్కండి.
- అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దు: Parcel Delivery, Bank KYC, e-Challan, Aadhaar Update వంటి పేర్లతో మీకు తెలియని వారు ఫేక్ లింక్స్ పంపించవచ్చు. ఇలాంటి లింక్స్ అసలు click చేయకండి.
- Screen Share లో జాగ్రత్త: గుర్తుతెలియని వ్యక్తులతో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడుఅవసరమైనంత వరకు ‘Screen Share’ చేయకుండా ఉండటమే బెస్ట్.
ముగింపు:
నా అభిప్రాయం ప్రకారం, మీరు ఎక్కువగా Unknown Calls లేదా Spam Messages లేదా Unwanted Groups ఇలాంటి ఇబ్బందులను ఫేస్ చేసే వారైతే, మనం పైన చెప్పుకున్న Privacy settings ను తప్పకుండా ట్రై చేయండి.
ఈ Information మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ Family & Friendsతో కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారిలో ఎవరికైనా తెలియని Calls లేదా Spam Messages వస్తున్నట్లయితే ఈ ప్రైవసీ సెట్టింగ్స్ వారికి కూడా యూస్ అవుతాయి.
ఇప్పటికే WhatsAppలో ఏ Privacy Setting అయినా మీరు వాడుతున్నట్లైతే Comment లో చెప్పండి. ఈ పోస్ట్ చదివేవాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన Telugu Tech Train బ్లాగ్ ను ప్రతిరోజు Follow ఫాలో అవుతూ ఉండండి.
You may also like these:









Content manchiga undi.. ilane continue cheyandi..
okay
whatsapp DP privacy on cheskunnanu.
thank you for the information.
Thanks…
Good information about what’s app settings.