ANC vs ENC: Bluetooth Earbuds అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఈ రోజుల్లో. ఒకప్పుడు ఎక్కువగా wired earphones వాడేవాళ్లు. ఆ తర్వాత ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా Bluetooth Earbuds కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఏదైనా ఇయర్ బర్డ్స్ కొనాలి అనుకుంటే మనం ఆఫ్‌లైన్ స్టోర్ లో కానీ లేదా ఆన్లైన్ స్టోర్ లో కానీ కొంటూ ఉంటాము.
మీరు ఎప్పుడైనా చూసినట్లయితే earbuds బాక్స్ మీద Noise Cancellation అనే పదము కనిపిస్తుంది. అలాంటి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న కొన్ని బాక్స్ ల మీద ANC, మరికొన్ని బాక్స్ ల మీద ENC అని రాసి ఉంటుంది. చాలామంది ఈ రెండింటిలో ఏది దేనికి ఉపయోగపడుతుంది అని తెలియకుండానే కొని వాడుతున్నారు.
అసలు ANC, ENC అంటే ఏమిటి వాటి టెక్నాలజీని ఎక్కడ ఉపయోగించుకోవాలో నేను చెప్పాలి అని అనుకున్నాను. అందుకే ఇయర్ బర్డ్స్ కొనే ముందు ఈ చిన్న తేడా తెలుసుకొని వాటి టెక్నాలజీని మంచిగా వాడుకుంటారు అని అనుకుంటున్నా.
ANC అంటే ఏమిటి?
ANC full form ఏమిటంటే Active noise cancellation. ఒకవేళ మీరు ANC ఉన్న ఇయర్ బర్డ్స్ చెవులలో పెట్టుకొని ANC ఆన్ చేసినప్పుడు మీ చుట్టూ ఉండే శబ్దాన్ని(NOISE) తగ్గించి మీకు మంచి అనుభూతిని ఇస్తుంది.
ఉదాహరణకు మీరు బస్సులో లేదా రద్దీ ఉన్న ప్రదేశాలలో మీరు ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నప్పుడు, మీ చుట్టుపక్కల ఉండే గోల లేదా ట్రాఫిక్ శబ్దాన్ని తగ్గించి, చాలా స్పష్టంగా, మంచిగా పాట వినపడుతుంది.
ANC టెక్నాలజీ ఎలా పని చేస్తుంది?
ఈ ANC టెక్నాలజీ ఉన్నఇయర్బడ్స్కు ఉండే మైక్రోఫోన్లు బయటి నుంచి వచ్చే శబ్దాలను (Noise) గుర్తిస్తాయి. అలా గుర్తించిన వెంటనే ఆ బడ్స్ లోపల ఉండే చిప్ సెట్, ఆ శబ్దానికి వ్యతిరేకంగా(opposite గా) ఉండే మరో సౌండ్ వేవ్‌ను (Anti noise) క్రియేట్ చేస్తుంది. ఇలా ఈ టెక్నాలజీ వల్ల, బయటి శబ్దం అక్కడికక్కడే క్యాన్సిల్ అయిపోతుంది. మీరు వినే పాటలు లేదా సినిమా డైలాగులు చాలా స్పష్టంగా వినిపిస్తాయి.
ANC టెక్నాలజీ ఉపయోగాలు:
- మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఆఫీసులో ఉన్నప్పుడు, మీ చుట్టుపక్కల Noise ని తగ్గించి పాటలు వినే అనుభూతి ఉంటుంది.
- ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ గా Movie చూసేటప్పుడు, ఎటువంటి నాయిస్ లేకుండా మంచి ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.
ENC అంటే ఏమిటి?
ENC అంటే Environmental Noise Cancellation. ఈ ఇయర్ బడ్స్ యూస్ చేసుకొని మనము కాల్స్ చాలా చక్కగా, క్లియర్ గా మాట్లాడుకోవచ్చు.
ఉదాహరణకు, ENC టెక్నాలజీ ఉన్న ఇయర్ బర్డ్స్ మీరు చెవిలో పెట్టుకొని కాల్ మాట్లాడుతున్నప్పుడు పక్కల ఉండే శబ్దాలు లేదా Noise తగ్గించి కేవలం మీరు మాట్లాడే మాటలు స్పష్టంగా చేస్తుంది. అంటే మీరు కొంచెం ట్రాఫిక్ లో ఉన్న లేదా చిన్నగా గాలి వీస్తున్న శాలలో ప్రదేశాలలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు అవతల వారికి చాలా స్పష్టంగా వినబడేటట్లు చేస్తుంది.
ENC టెక్నాలజీ ఎలా పని చేస్తుంది?
ఈ ENC టెక్నాలజీ ఉన్న ఇయర్ బడ్స్ లో, ENC పనిచేయడానికి ఇయర్‌బడ్‌కు కనీసం రెండు మైక్రోఫోన్లు ఉండాలి. మీ నోటికి దగ్గరగా ఉండే మైక్రో ఫోన్ కేవలం, మీరు కాల్ లో అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, మీ నోటి నుంచి వచ్చే వాయిస్‌ను మరియు చుట్టుపక్కల వచ్చే నాయిస్ ను కూడా సేకరిస్తుంది. మిగతా మైక్రో ఫోన్లు చుట్టుపక్కల వచ్చే environmental noise ను సేకరిస్తాయి. ఆ తర్వాత, దీనిలో ఉండే టెక్నాలజీ Algorithmic Analysis ద్వారా ఎనాలసిస్ చేసి, కేవలం మీ వాయిస్‌ను మాత్రమే బూస్ట్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను పూర్తిగా తగ్గించి అవతలి వ్యక్తికి పంపిస్తాయి.
ENC టెక్నాలజీ ఉపయోగాలు:
- మీరు బయట రోడ్డుపై లేదా మార్కెట్లో మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తికి మీ వాయిస్ మరింత స్పష్టంగా వినిపించవచ్చు.
ఇందులో ఏది కొనాలి? ANC or ENC?
మీరు ఎక్కువగా మ్యూజిక్ వినేవారు అయితే, బస్సులో లేదా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు పాటలు వినే వారు అయితే, మంచిగా మూవీస్ అయితే మీకు ANC ఉన్న Earbuds మంచివి.
అలా కాదు మేము ఎక్కువ కాల్స్ మాట్లాడతాము అని అనుకునే వారు అయితే ENC ఉన్న Earbuds సరిపోతాయి.
ఇయర్ బర్డ్స్ కొనే ముందు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్:
- Battery Backup
- Bluetooth Version
- Low Latency Mode
- Fast Charging Support
- Warranty
ముగింపు:
మీరు ఏదైనా ఇయర్ బర్డ్స్ కొనే ముందు స్పష్టంగా దాని మీద రాసిన స్పెసిఫికేషన్స్ మరియు అది ఎలాంటి ట్రాన్స్లేషన్ టెక్నాలజీ ఇయర్ బర్డ్స్ చూసుకొని కొనండి ఇదే నా చిన్ని సలహా.
ఈ పోస్టు గాని మీకు నచ్చినట్లయితే లేదా మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉపయోగపడింది అనుకుంటే వారికి షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో విషయాలు మీ ముందుకు రావాలి అంటే Telugu Tech Train బ్లాగుని ఫాలో అవుతూ ఉండండి.
మీరు ఇయర్ బర్డ్స్ వాడుతున్నట్లయితే మీరు వాడే టెక్నాలజీ లేదా ఏఎంసి కింద కామెంట్స్ లో టైప్ చేయండి.
You may also like these:









3 thoughts on “ANC vs ENC: కొత్త ఇయర్‌బడ్స్ కొంటున్నారా? అయితే ముందుగా ఈ తేడా తెలుసుకోండి”