Contacts Transfer: కొత్త ఫోన్ కొన్నారా? చాలా బాగుందా? మొబైల్ లో అన్ని ఫీచర్స్ మంచిగా ఉన్నాయా? అయితే మరి మీకు ఒక చిక్కు ప్రశ్న రావాలి కదా! అదేనండి పాత ఫోన్ లో ఉన్న contacts మొత్తం కొత్త ఫోన్ లోకి ఎలా పంపించుకోవాలి? సింపుల్‌గా చెప్పాలంటే contacts send చేయడం ఎలా?
నాకు తెలిసి పాత మొబైల్ లో నుండి కొత్త మొబైల్ లోకి contacts ఎక్కించడం చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ నేను ఈ విషయము తెలియని వాళ్ళ కోసం సింపుల్ గా చెప్పాలి అని అనుకుంటున్నా.
కాంటాక్ట్స్ ట్రాన్స్ఫర్ చేయడం తెలియని వారు ఒక్కొక్క నెంబర్ ని కొత్త మొబైల్ లో సేవ్ చేసుకుంటూ పోతే వందల సంఖ్యలో ఉన్న కాంటాక్ట్స్ ఎప్పుడు save చేసుకుంటారు. ఇలా సేవ్ చేసుకునేటప్పుడు కొన్ని నెంబర్లు డిలీట్ అయ్యే అవకాశం ఉంది, లేదా మిస్ అయ్యే అవకాశం ఉంది.
కనుక రెండంటే రెండే నిమిషాల్లో మీ old mobile నుండి new mobile కు contacts చాలా సేఫ్ గా చేసుకోవడానికి చేతుల్లో క్లియర్ గా చెబుతాను.
గూగుల్ అకౌంట్ సింక్ (Google Account Sync) చేయటం ద్వారా :
మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ (Android Smartphone) మొబైల్ వాడుతున్నట్లయితే మీ మొత్తం contact numbers అన్ని మొబైల్ లోకి చేయడానికి ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గూగుల్ అకౌంట్ తో safe గా ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.
పాత ఫోన్లో చేయాల్సిన స్టెప్స్:
- ముందుగా మీ పాత మొబైల్లో Settings ఓపెన్ చేయండి.
- అక్కడ కిందకు స్క్రోల్ చేస్తే Google అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది అందులో Google contacts sync అని ఉందో లేదో చూడండి.
- దానిపై క్లిక్ చేసిన తర్వాత, మీరు మీ మొబైల్లో చివరిసారిగా sync అయిన మొబైల్ నెంబర్స్ చూసుకోవచ్చు.
- ఇక్కడే మీరు మీ కాంటాక్ట్స్ నంబర్స్ sync ఆన్ లో ఉందో లేదో చూసుకోండి చేసుకునే ఆప్షన్ ఆన్ లో ఉందో లేదో చూసుకోండి.
- ఒకవేళ ఇక్కడ ఆన్ లో లేకపోతే మీరు ఎనేబుల్ చేసుకోవాలి ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిగ్గా మీకు మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం మీయొక్క Gmail ఐడి కి (అంటే మీ యొక్క google అకౌంట్ కి) సింక్ అవుతాయి.
గమనిక: ఇది నేను నా మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఆధారంగా చెప్పాను. మీకు కూడా ఇలాగే ఉంటుందని చెప్పలేను. నేను చెప్పిన సెట్టింగ్స్ ప్రకారంగా కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. దాని ప్రకారంగా మీరు అర్థం చేసుకొని మీ కాంటాక్ట్స్ google అకౌంట్ కి సింగ్ చేసుకోండి.
కొత్త ఫోన్లో చేయాల్సిన స్టెప్స్:
ఇప్పుడు ఇక్కడ మీరు చేయవలసిన మొట్టమొదట పని ఏంటంటే మీరు పాత ఫోన్ లో ఏదైతే Gmail అకౌంట్ యూస్ చేశారో అదే Gmail అకౌంట్ తో మీరు లాగిన్ అవ్వండి మీ కొత్త మొబైల్ లో.
- ఇలా మీరు లాగిన్ అయిన కొద్ది నిమిషాల్లోనే బ్యాక్ గ్రౌండ్ లో మీ Contacts అన్ని ఆటోమేటిక్‌గా మీ కొత్త కాంటాక్ట్స్ యాప్ లోకి వచ్చేస్తాయి.
గూగుల్ ఎకౌంటు ద్వారా యూస్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మీరు Google అకౌంట్ ద్వారా కాంటాక్ట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మీ రెండు మొబైల్ లో కచ్చితంగా ఇంటర్నెట్ ఆన్ లో ఉండాలి ఉండాలి
- Google అకౌంట్ Password గుర్తుండాలి.
- రెండు mobiles లలో ఒకే Gmail id తో లాగిన్ అవ్వాలి.
VCF File export – ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది.
VCF అంటే Virtual Contact File. ఒకవేళ మాకు ఇలా Google అకౌంట్ ద్వారా కాదు, Internet మా దగ్గర లేదు అని అనుకుంటే, ఇంటర్నెట్ లేకుండా సింపుల్ టెక్నిక్ తో Contacts transfer ఎలా చేసుకోవాలో సింపుల్ గా చెప్తాను.
ఇక్కడ టెక్నిక్ ఏంటంటే మీ మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తాన్ని VCF ఫైల్ అనే ఫార్మేట్ లో Export చేసుకొని కొత్త మొబైల్ లోకి ఫైల్ ని పంపించు కొని import చేసుకుంటే చాలు పాత ఫోన్ లో ఉన్న మొబైల్ కాంటాక్ట్స్ మొత్తం అన్ని కొత్త మొబైల్ లోకి వచ్చేస్తాయి.
- పాత ఫోన్ లోని Contacts యాప్‌ను ఓపెన్ చేయండి.
- అక్కడ పైన ఉండే మూడు చుక్కలు (Menu) లేదా గేర్ ఐకాన్ పై క్లిక్ చేసి Manage Contacts లేదా Settings లోకి వెళ్లండి.
- ఇక్కడ మీకు Export అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కి Export to vcf file లేదా Export to Storage అని సెలెక్ట్ చేసుకోండి.
- ఇప్పుడు మీ Phone Storage ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్‌ను బ్లూటూత్ (Bluetooth) ద్వారా గానీ, లేదా ఇంటర్నెట్ ఉంటే వాట్సాప్ ద్వారా గానీ కొత్త ఫోన్‌కు పంపించుకోండి.
- కొత్త ఫోన్ లో ఆ ఫైల్‌ను డౌన్లోడ్ చేసి, దానిపై క్లిక్ చేయగానే ‘Import Contacts‘ అని అడుగుతుంది. ఓకే చేయగానే అన్ని నంబర్లు ఒక్క సెకనులో యాడ్ అయిపోతాయి.
గమనిక: ఈ VCF export పద్ధతి ద్వారా కాంటాక్ట్స్ ట్రాన్స్ఫర్ చేయడం నేను నా మొబైల్లో జనరల్ గా ఉండే మొబైల్ లో సెట్టింగ్స్ ప్రకారంగా చెప్పాను. నేను చెప్పిన విధంగానే మీ mobile లో కూడా ఇలాగే కరెక్ట్ గా ఆప్షన్స్ ఉంటాయని కాదు కొంచెం అటు ఇటు గా ఉండవచ్చు అని అర్థం చేసుకొని మీరు మీ కాంటాక్ట్స్ ఈ VCF file ద్వారా సింపుల్‌గా ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ముగింపు:
చూశారుగా ఇలా చాలా సింపుల్‌గా ఈ రెండు మెథడ్స్ లో ఏదైనా ఒకటి యూస్ చేసుకొని మీ పాత మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ కొత్త మొబైల్ లోకి transfer చేసుకోవచ్చు. నా సలహా ప్రకారం మీకు మొదటి పద్ధతి అంటే google అకౌంట్ ద్వారా కాంటాక్ట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా సులువు.
ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులలో లేదా చుట్టాల లో ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. కాంటాక్ట్స్ ట్రాన్స్ఫర్ చేయడంలో ఏదైనా డౌటు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇలాంటి మరెన్నో మీకు ఉపయోగపడే విషయాలు మీ ముందుకు రావాలంటే Telugu Tech Train లాగిన్ ప్రతిరోజు ఫాలో చేయండి.
You may also like these:
మీకు ఇంకా చాలా సింపుల్‌గా అర్థం అవటానికి VCF మెథడ్ ద్వారా ఎలా చేయాలో ఒక వీడియో ని కింద ఉంచాను ఒకసారి చూడండి.









Good info..
Thank you..
Useful info
Thank you Vamsi…