WhatsApp status Reshare: మీరు పెట్టిన WhatsApp status ని, మీ friends కూడా తన వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేయాలి అంటే మీరు ఈ ఒక్క ఆప్షన్ ని ఆన్ చేయండి. అదేనండి Allow Sharing. లేదు ఒకవేళ మీరు ఎవరిదైనా status మీ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవాలంటే వాళ్లు కూడా ఈ WhatsApp Status Reshare ఎనేబుల్ చేసుకోవాలి.
ఇదివరకు మీ WhatsApp status, మీ ఫ్రెండ్ కి నచ్చినట్లయితే మిమ్మల్ని “Please send me” అని అడగడం లేదా మీ status screenshot తీసుకోవడం లేదా Screen Recorder చేయడం లేదా Status Saver Apps వాడడం లాంటివి అక్కర్లేదు! మీరు ఈ ఒక్క ఆప్షన్ ఆన్ చేస్తే చాలు మీ స్టేటస్ ను వాళ్ళ స్టేటస్ గా పెట్టుకోవచ్చు. కనుక నేను ఇప్పుడు మీ WhatsApp status Reshare ఫీచర్ ని ఎలా ఎనేబుల్ చేయాలో చాలా క్లియర్ గా సింపుల్ గా చెప్తాను.
ఒక్క లైన్‌లో చెప్పాలంటే:
WhatsApp Status Reshare ఫీచర్ ద్వారా ఇతరులు షేర్ చేసుకోవడానికి ఎనేబుల్ చేసిన స్టేటస్‌ను నేరుగా మీ స్టేటస్‌గా రీషేర్ చేయవచ్చు.
ఇది మీకు ఇంతక ముందే తెలిసి ఉంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం నా ఈ చిన్న ప్రయత్నం.
WhatsApp Status Reshare ఫీచర్ అంటే ఏమిటి?
whatsapp లో ఉండే ఒక ఒక మంచి ఫీచర్ ఈ Allow Sharing (Reshare). మీరు ఈ ఆప్షన్‌ను enable చేసుకుంటే, మీ స్టేటస్‌ను చూసే మీ కాంటాక్ట్స్ (Friends & Family) ఆ ఫోటో లేదా వీడియోను నేరుగా వారి వాట్సాప్ స్టేటస్‌గా రీపోస్ట్ చేసుకోవచ్చు.
WhatsApp Status Reshare ఎలా ఎనేబుల్ చేయాలి? (Step-by-Step Guide):
మీరు ఈ feature ని ఎనేబుల్ చేసుకోవాలి అని అంటే చాలా సింపుల్ గా ఎనేబుల్ చేసుకోవచ్చు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయితే!
Step 1:
- ముందుగా మీ మొబైల్ లో ఉండే WhatsApp యాప్ ఓపెన్ చేయండి.
Step 2:
- Right side corner లో ఉన్న Three Dots (మూడు చుక్కల మెనూ) పై టాప్ చేయండి.
Step 3:
- ఇక్కడ సెట్టింగ్స్ Settings ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
Step 4:
- ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనపడతాయి అందులో “Privacy” నీ సెలెక్ట్ చేయండి
Step 5:
- ఆ తర్వాత మీకు కనపడే ఆప్షన్స్ లో Status ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 6:
- ఇక్కడ మీకు “Allow sharing” అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దాని పక్కన ఉన్న టోగుల్ బటన్‌ను On (Green) పొజిషన్‌లోకి మార్చండి.
ఇలా చాలా సింపుల్ గా మీ ఫ్రెండ్ మీ స్టేటస్ ను షేర్ చేసే విధంగా మీరు allow sharing ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు.
Whatsapp status upload చేసేటప్పుడు Reshare ని నేరుగా ON లేదా OFF చేసుకోవటం ఎలా ?
ఇప్పుడు మీరు మీ whatsapp లో కొన్ని Status లు పెట్టారు అని అనుకోండి! అందులో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ Whatsapp Status లను వేరేవాళ్లు షేర్ చేయకుండా ఉండాలి అంటే ఇలా చేయండి.
- మీరు స్టేటస్ పెట్టేటప్పుడు క్రింద కనిపించే Audience (My contacts) ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అక్కడే మీకు నేరుగా Allow sharing సింబల్ కనిపిస్తుంది, దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ( ఆన్ చేసుకుంటే reshare enable చేసినట్లు ఆఫ్ చేసుకుంటే reshare disable చేసినట్లు)
ఈ WhatsApp status Reshare లో Privacy ఎలా ఉంటుంది?
ఇలా Allow Reshare feature on చేస్తే మా ప్రొఫైల్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి వెళ్లిపోతాయి ఏమో ఉన్న భయం మీకు ఉండొచ్చు? కానీ ఇక్కడ ఎవరైనా మీ Whatsapp status ని వేరే వాళ్ళు Reshare చేసినప్పుడు మీ Whatsapp Status లో ఉండే Photos లేదా Videos మాత్రమే షేర్ అవుతాయి . మీ name లేదా ఫోన్ నెంబర్ లేదా మీ Profile Picture వాళ్ల status లో అసలు కనపడదు.
Reshare Label: ఎవరైతే మీ Whatsapp Status ను షేర్ చేశారో వాళ్లకి మాత్రం Status పైన “Reshared” అనే లేబుల్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఒకవేళ ఈ ఆప్షన్ మీకు కనిపించకపోతే ఏం చేయాలి?
మీరు వాడుతున్న WhatsApp లో ఈ Allow Reshare ఆప్షన్ కనిపించకపోతే మీరు వెంటనే Google Play Store లేదా Apple App Store కి వెళ్లి మీ వాట్సాప్ యాప్‌ను Update చేసుకోండి.
ముగింపు:
నాకు సంబంధించిన అంతవరకు WhatsApp నుండి మీ స్టేటస్ ను ఎక్కువ మంది షేర్ చేసుకోవాలి లేదా ఎక్కువ మంది చూడాలి అని అనిపిస్తే WhatsApp Status Reshare అనే ఫీచర్ చాలా మంచిగా ఉంటుంది బాగా ఉపయోగపడుతుంది. నా అభిప్రాయం ప్రకారం, ఒకవేళ మీరు పర్సనల్ ఫొటోస్ లేదా ఫ్యామిలీ వీడియోలు స్టేటస్ గా పెడితే మాత్రం ఈ Allow sharing ఆప్షన్‌ను వెంటనే Off చేసుకుంటేనే చాలా బెటర్ అనిపిస్తుంది.
whatsapp లో ఉన్న Allow sharing ఎంతమంది ఆక్టివేట్ చేసుకొని యూస్ చేస్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి కానీ లేదా మీ బంధుమిత్రులకు కానీ షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో విషయాలు మి ముందు ఉండాలి అంటే మా ఈ Telugu Tech Train బ్లాగ్ ని Follow అవుతూ ఉండండి.
You may also like these:









Knowledgeable content.
Thanks for supporting..