Vivo T5e Launch: మన ఇండియాలో ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కి ఒక కొత్త మొబైల్ వచ్చింది. అదే Vivo రిలీజ్ చేసిన Vivo T5e Mobile. మిడ్ రేంజ్ మరియు ఎంట్రీ లెవెల్ మొబైల్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని vivo అధికారకంగా నిన్న అనగా 27-07-2026 న విడుదల చేసింది.
ఈ మొబైలు ₹13,999 రూపాయల తో మొదలవుతు Flipkart మరియు Vivo Official Page లో దొరుకుతుంది. ఈ Price రేంజ్ లో ముఖ్యంగా చార్జింగ్ సమస్యలతో బాధపడే వారికి ఈ ఫోను ఒక బెస్ట్ ఆప్షన్ గా ఉండవచ్చు. అది ఎలాగో ముందు మీరే చూస్తారు కదా!
Vivo T5e Price మరియు Color:
ఈ Vivo T5e మొబైల్ ను 2 కలర్ వేరియంట్స్ లో తీసుకువచ్చారు .
- Aero Blue (ఎయిరో బ్లూ)
- Shadow Grey(షాడో గ్రే)
4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది.
| RAM | Storage | Price |
| 4GB RAM | 64 GB Storage | 13999/- రూపాయలు |
Vivo T5e Specifications మరియు Features:
ఈ మొబైల్ చూడటానికి చాలా స్టైలిష్ గా మరియు మోడ్రన్ లుక్ తో కనిపించే లాగా తీసుకువచ్చారు. ఇందులో డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.74 inches HD+ LCD display తో అందుబాటులోకి తెచ్చారు. Vivo T 5e యొక్క స్లిమ్ వచ్చేసి 0.819 cm, మరి weight చూసుకున్నట్లయితే 199 grams తో తీసుకువచ్చారు. అలాగే రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే ఇది 90Hz Refresh Rate తో వస్తుంది. దీనివల్ల మనకు స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది.
- Brightness: Vivo T5e లో 570 nits Peak Brightness ఇచ్చారు. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ కనిపించేలా కనిపిస్తుంది.
- Eye protection: ఒకవేళ ఈ మొబైల్ ను రాత్రి నిద్రపోయే సమయంలో మొబైల్ వాడుతున్నట్లయితే బ్లూ లైట్ ప్రభావాన్ని తగ్గించి మంచిగా నిద్ర కోసం ‘Sleep Comfort Mode‘ ను ఇందులో తీసుకువచ్చారు.
Vivo T 5e పర్ఫార్మెన్స్ మరియు సాఫ్ట్‌వేర్(Performance & Software):
ఈ బడ్జెట్లో తీసుకువచ్చిన ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్ OriginOS తో provide చేసారు . ఈ Vivo T5e మొబైల్ యూస్ చేసుకొని మనం రోజువారి apps వాడుకోవడం, Multi tasking మరియు social media browsing వంటి పనులను చేసుకోవచ్చు.
ఆడియో పరంగా చూసుకున్నట్లయితే ఇందులో ఈ మొబైల్ లో 200% Super Loud Volume ఫీచర్ ఇచ్చారు, దీనివల్ల స్పీకర్ సౌండ్ చాలా స్పష్టంగా, గట్టిగా వినపడుతుంది. అంతేకాదు Video ఎక్స్పీరియన్స్ మరియు Calls మరియు Music కూడా చాలా బాగుంటుంది.
ఈ మొబైలు ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఫోను మనకు Military-Grade Drop and Shock Resistance మరియు IP64 Waterproof rating మరియు Dust Resistanceతో వస్తుంది. దీనివల్ల ఇది చిన్న చిన్న నీటి తుంపర్ల నుండి పాడవకుండా మంచిగా ఉంటుంది.
Vivo T 5e పవర్‌ఫుల్ బ్యాటరీ మరియు లాంగ్ లైఫ్ (Battery):
ఈ ఫోన్ గురించి చెప్పాలనుకుంటే ముందుగా బ్యాటరీ గురించి మాట్లాడాలి. ఈ మొబైల్ ను ఏకంగా 5500mAh battery తో తీసుకువచ్చారు. ఈ బ్యాటరీ కి సంబంధించి మంచి విషయం చెప్పాలి అనుకుంటే, vivo అఫీషియల్ పేజీలో, 4 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ అని మెన్షన్ చేశారు. దీని ప్రకారం చూసుకున్నట్లయితే బ్యాటరీ చాలా మంచిగా కాలం ఉంటుందని చెప్పుకోవచ్చు. అది ఎలాగంటే అఫీషియల్ పేజీలో వారు చెప్పినట్లుగా దాదాపు 1600 సార్లు పూర్తి ఛార్జ్ చేసినా బ్యాటరీ కెపాసిటీ 80% కంటే తగ్గదు.
- వీడియో ప్లేబ్యాక్: ఈ vivo t5e ఒక్కసారి ఛార్జ్ చేస్తే 28 గంటల పాటు పాటుగా వీడియోస్ చూసుకోవచ్చు.
- సోషల్ మీడియా వాడకం: మీరు ఒకవేళ సోషల్ మీడియా బాగా యూస్ చేసే వారైతే, మీరు 13.5 గంటల పాటు సోషల్ మీడియా యాప్స్ వాడుకోవచ్చు.
- రివర్స్ ఛార్జింగ్: ఎప్పుడైనా గాని మీ ఫ్రెండ్ మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతే మీ స్నేహితుల మొబైల్స్ కూడా చార్జి చేయవచ్చు. ఈ ఫీచర్ నాకు కొంచెం నచ్చింది. (Reverse Charging సపోర్ట్).
- వీడియో కాల్స్: వీడియో కాల్స్ గురించి చెప్పుకోవాలంటే 20.9 గంటలపాటు మాట్లాడుకోవచ్చు.
Vivo T 5e కెమెరా (Camera Features):
ఈ స్మార్ట్‌ఫోన్ Rear Camera 8-Mega Pixel Primary Camera తో తీసుకువచ్చారు. పగటి పూట నార్మల్ ఫోటోలు తీసుకోవడానికి ఇది బాగానే పనిచేస్తుంది. ఇక సెల్ఫీల కోసం మరియు వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి 5-Megapixel Front Camera తో తీసుకు వచ్చారు. ఇది బడ్జెట్ రేంజ్ మొబైల్ కదా! కొంచెం కెమెరా పర్ఫార్మెన్స్ తక్కువగా ఉండొచ్చు.
Vivo T5e Pros & Cons:
| ప్లస్ పాయింట్స్ (Pros) | మైనస్ పాయింట్స్ (Cons) |
| 5500mAh భారీ బ్యాటరీ బ్యాకప్ | కేవలం 4G కనెక్టివిటీ మాత్రమే ఉంది |
| 4 ఇయర్స్ బ్యాటరీ హెల్త్ | కెమెరా క్వాలిటీ చాలా బేసిక్‌గా ఉంది |
| 90Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే | హెవీ గేమింగ్‌కు పనికిరాదు |
| IP64 డస్ట్ & వాటర్ ప్రొటెక్షన్ | 64GB బేసిక్ స్టోరేజ్ మాత్రమే |
ముగింపు:
చూశారు కదా, Vivo T5e స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్. నాకు తెలిసి ఈ మొబైల్ ఎవరికి బాగా కావాలి అనుకుంటే ఎక్కువసేపు మొబైల్ మాట్లాడుతూ, సోషల్ మీడియా యూస్ చేస్తూ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వారికి ఈ మొబైల్ ఒక మంచి ఆప్షన్ గా పెట్టుకోవచ్చు.
ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా ఈ మొబైల్ ఈ మొబైల్ ఉపయోగపడుతుంది. వివో తీసుకొచ్చిన ఈ కొత్త బడ్జెట్ ఫోన్ ఫీచర్స్ మరియు ధర మీకు నచ్చాయా? మీరు ప్రస్తుతం ఏ బ్రాండ్ ఫోన్ వాడుతున్నారు? కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో చెప్పండి.
ఈ ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త ఫోన్స్ గురించి కావాలి అంటే Telugu Tech Train బ్లాగ్ ఫాలో అవుతూ ఉండండి.
You may also like these:









Good information about Vivo T5e
Thanks for supporting us..