Amazon vs Flipkart, TV offers:మీరు మీ ఇంట్లోకి ఒక Smart Tv ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు ఇది మీకు మంచి సమయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన అందరికీ తెలిసిన విషయమే! Amazon మరియు Flipkart వాళ్ళ Freedom Sale Offers ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి.
అయితే చాలా టీవీల మీద ఆఫర్లు ఉన్నాయి. ఈ TV models లో ఏ టీవీ తీసుకోవాలని తెలియక చాలా మంది కన్ఫ్యూషన్ అవుతారు. ఇలా మీరు ఇబ్బంది పడకుండా నా తరఫున మీ పని సులువు చేయడానికి ఈ “Freedom Sale” లో మీకోసం నేను కొన్ని 32 inches, 43 inches TV సైజులలో కొన్ని ఆప్షన్స్ మీ ముందుకు తీసుకు వచ్చాను.
గమనిక: ఇప్పుడు నేను చెప్పబోయే ఈ Smart Tv యొక్క Prices, Offers, Availability వీటన్నిటిని August 8, 2026 న కనిపించిన marketplace listings ఆధారంగా మీ దగ్గరికి తీసుకు వచ్చాను. ఇవి మీరు చూసేసరికి లేదా మీ ఏరియా బట్టి చేంజ్ అవ్వొచ్చు .
Amazon vs Flipkart Freedom Sale – 32 Inches TV:
మీరు 32 Inches smart TV కొనాలని చూస్తున్నట్లయితే, ఒకసారి ఈ కింద చెప్పబడే ఈ 2 Smart Tv లను కూడా మీ లిస్టులోకి చేర్చుకొని చెక్ చేసుకుని మీకు నచ్చినట్లయితేనే తీసుకోండి.
- Xiaomi 32 Inch HD Ready Smart Fire TV
- TCL 32 Inch Smart Google TV (32V5C)
Xiaomi 32 Inch HD Ready Smart Fire TV:
మీ బడ్జెట్ 10000 రూపాయలు రేంజ్ అయితే, ఈ Xiaomi 32 Inch smart Tv ని Amazon Platform నుండి సెలెక్ట్ చేశాను. ఈ Xiaomi 32 Inch HD Ready Smart Fire TV ప్రైస్ (Price) 12,999 రూపాయలుగా ఉంది.
ఈ Amazon ఫ్రీడమ్ సేల్ లో HDFC CREDIT card offer మీద 2250 రూపాయలు తగ్గి మొత్తంగా 10,749 Offer Price తో వస్తుంది.
Xiaomi 32 Inch HD Ready Smart Fire TV Features | ఫీచర్స్ :
ఈ Xiaomi smart TV, HD Ready LED display,మరియు 60Hz refresh rate ( రిఫ్రెష్ రేట్) ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక ఇది Fire TV OSపై పనిచేస్తుంది. 20W speakers, Dolby Audio, HDMI, Wi-Fi, Bluetooth, Ethernet వంటి features కూడా ఉన్నాయి.
TCL 32 Inch Smart Google TV (32V5C):
మీరు TCL brand నుండి 32 inches TV తీసుకోవాలనుకుంటే నేను ఈ smart TV తీసుకోవచ్చు. ఈ TCL 32 Inch tv నీ చూసినట్లయితే ఇది మనకు Amazon లో Available గా ఉంది. దీని ధర 16,990 రూపాయిలుగా ఉంది.
Amazon Freedom sale లో ఈ TV, Amazon Prime Users కి అయితే HDFC CREDIT CARD ద్వారా 2250 రూపాయలు మరియు PRIME offer ద్వారా 500 రూపాయలు తగ్గి మొత్తంగా 14,240 రూపాయల Offer Price కు వస్తుంది.
TCL 32 Inch Smart Google TV (32V5C) Features | ఫీచర్స్ :
ఈ TCL 32 Inch Smart TV ని Full HD Smart QLED Google TV గా మార్కెట్లో తీసుకువచ్చారు. ఈ TV “Google TV” OS మీద రన్ అవుతుంది. ఈ Tv display చూసుకున్నట్లైతే 60Hz refresh rate, HDR10 వంటి features ఉంది. USB, HDMI,LAN, AV IN,Google Assistant, WiFi, Bluetooth5.0 వంటి వేరే ఫీచర్లు ఉన్నాయి. ఆడియో గురించి చెప్పాలంటే ఇది Dolby Audio టెక్నాలజీ 28 watts తో వస్తుంది.
ఈ Smart Tv లో Full HD resolution ఉండటం వల్ల high-quality video వీడియోస్ చూస్తున్నప్పుడు పైన చెప్పిన Xiaomi TV కన్నా ఈ Smart Tv లో Picture Quality చాలా బాగుంటుంది.
32 inch TV – Price comparision:
| TV Model | Listing Price | Offer Price |
| Xiaomi 32 Inch Fire TV | 12,999 /- | 10,749 /- |
| TCL 32 V5C | 16,990 /- | 14,240 /- |
Amazon vs Flipkart Freedom Sale – 43 Inches TV:
మీరు ఒకవేళ 32 inches TV కాకుండా మీరు 43 Inches smart TV కొనాలి అనుకుంటే నేను చెప్పిన ఈ 2 Options ఒకసారి మీ బడ్జెట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీ బడ్జెట్లో వచ్చినట్లయితే మీకు సెట్ అయ్యే టీవీ ని సెలెక్ట్ చేసుకోగలరు.
- Sony Bravia 2 II 43 Inch Ultra HD 4K LED Smart Google TV
- Samsung Vision AI 43 Inch Ultra HD 4K Mini LED Smart Tizen TV
Sony Bravia 2 II 43 4K TV:
మీరు Sony Brand అంటే ఇష్టం ఉన్నవారు అయితే, కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోగలను ఈ Sony Brand TV కోసం అనుకుంటే ఒకసారి ఈ Sony Bravia 2 II Smart TV ని చెక్ చేయండి. ఈ స్మార్ట్ టీవీ Flipkart platform లో నుండి చూసినట్లయితే, ఈటీవీ యొక్క ధర 44,999 రూపాయలుగా ఉంది.
అదే గాని మీ దగ్గర SBI CREDIT CARD ఉన్నట్లయితే, మీకు ఈ SMART TV ఆ SBI Credit card మీద 7000 రుపాయలు వరకు తగ్గి ఫైనల్ Offer Price 37,999 రూపాయలకు వస్తుంది.
Sony Bravia 2 II 43 Inch Ultra HD 4K LED Smart Google TV Features | ఫీచర్స్:
ఈ Sony BRAVIA 2 II smart TV, 4K LED Smart Google TV గా ఉంది. ఇది X Protection Pro అనే Safety Features తో వస్తుంది. Processor అయితే 4K Processor X1 తో వస్తుంది. Refresh Rate 60Hz గా ఉంది మరియు Audio Dolby Atmos, DTS Digital Surround తో 20 W Output తో వస్తుంది. ఈ రోజు వరకు అనగా ఆగష్టు 8 వరకు ఈ modelకు Flipkartలో 4.7 rating, 34,672 ratings కనిపిస్తున్నాయి.
అందువల్ల Sony brand, 4K resolution మరియు Google TV experience కావాలనుకునేవారు దీన్ని shortlist చేయవచ్చు.
Samsung Vision AI 4K Mini LED Smart TV:
మీరు మాకు Sony వద్దు Samsung Brand నుండి కావాలి అంటే ఒకసారి ఈ Samsung Vision AI 43 Inch smart LED TV ని చెక్ చేయండి. ఈ Samsung Vision AI 43 Inch Flipkart లో 33,990 రూపాయలతో లిస్ట్ అయ్యి ఉంది.
ఇక పైన చెప్పినట్లుగానే మీ దగ్గర SBI CREDIT card ఉన్నట్లయితే, ఈ product మీద మీకు ఏకంగా Card ఆఫర్ మీద 5000 రూపాయలు తగ్గి 28,990 రూపాయలకే వస్తుంది.
Samsung Vision AI 4K Mini LED Smart TV Features | ఫీచర్స్:
ఈ Samsung Vision AI 43 Inches TV, Ultra HD 4K Resolution తో వస్తుంది. మరొక విషయం, పైన చెప్పిన Sony TV Google TV OS తో వస్తుంది కానీ ఇది మాత్రం Samsung వాళ్ళ “Tizen” TV OS తో వస్తుంది. Refresh Rate 50HZ గా ఉంది. ఇందులో ALLM (Auto Low Latency Mode), VRR (Variable Refresh Rate) అనే Motion and Gaming Enhancement Technologies తో వస్తుంది. ఇందులో Mini LED technology ఉంది. ఈ Tv లో audio 30 W oupt తో వస్తుంది.
కనుక ఏదైనా Smart TV కొనాలి అనుకుంటే కేవలం “ఏది తక్కువ ధర?” అని కాకుండా మీకు Google TV కావాలా, Tizen కావాలా? Mini LED priorityనా? Brand preference ఏంటి? అనే విషయాలను మీరు ఆలోచించుకొని ఈ రెండిటి లో ఏది మీకు Set అవుతుందో చూసుకొని తీసుకోండి.
43 inch TV – Price comparison:
| TV Model | Listing Price | Offer Price |
| Sony Bravia 2 II 43 4K TV | 44,999 /- | 37,999 /- |
| Samsung Vision AI 4K Mini LED | 33,990 /- | 28,990 /- |
Smart TV కొనేముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు:
Room size:
ఒకేవేళ చిన్న room లో చాలా పెద్ద TV పెడితే viewing experience ఎప్పుడూ better ఉంటుంది అని కాదు. Viewing distance కూడా చూడాలి. ఆలా చూసి మన రూమ్ కి సరిపడే TV తీసుకుంటే viewing experience చాలా బాగుంటుంది.
Display technology:
LED, QLED, Mini LED మధ్య తేడా ఉంటుంది. కేవలం “4K” అనే పదాన్ని చూసి TV కొనకండి.
Sound Output:
TV speakers 20W, 24W, 30W వంటి variationsలో ఉండొచ్చు. సౌండ్ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే మీకు తగ్గట్టుగా తీసుకోండి.
Operating System:
Google TV, Fire TV, Tizen వంటి platformsలో interface, apps మరియు ecosystem వేర్వేరుగా ఉంటాయి.
Ports:
Set-top box, gaming console, soundbar, Fire TV Stick లాంటివి connect చేయాలంటే వాటికీ తగ్గ Ports count ను ముందే check చేయండి.
Conclusion:
మీరు ఒకవేళ చిన్న బడ్జెట్ లోనే పోదాం అనుకుంట 32 Inches Smart TV మీకు బాగానే సెట్ అవుతుంది లేదు కొంచెం బడ్జెట్ పెంచుకున్న పర్వాలేదు అనుకుంటే 43 inches Smart TV కూడా మంచిగానే ఉంటుంది. ఇలా మీకు నచ్చిన ఫీచర్స్ ఏ Smart Tv లో ఎక్కువగా ఉన్నాయో చూసుకొని ఆ TV కొనుక్కోవడం మంచిది.
సో ఇలాగా మీరు Smart TV కొనాలి అనుకున్నప్పుడు, రివ్యూస్ చూసి మాత్రమే కొనుక్కోండి. ఎలాంటి Reviews లేకుండా డైరెక్ట్ గా కొనకండి. మీకు సరిపడే మంచి Smart TV ని కొనుక్కోండి.
మీరు చివరి వరకు చదివారంటే మీకు ఈ బ్లాగుపోస్టు ఏదో ఒక రకంగా ఉపయోగపడినట్లే, మీ ఫ్రెండ్స్ లో లేదా బంధువులలో ఎవరికైనా Smart TV కొనాలనుకునే వారికి మా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో కొత్త కొత్త విషయాలు, Deals మీ ముందు ఉండాలి అంటే మన Telugu Tech Train (తెలుగు టెక్ ట్రైన్) బ్లాగును ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి.
You may also like these:









Good information about tv”s.
Yes Murali, thanks for your support.
nice info