Smart TV Size Guide: మీరు మీ ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీ (Smart TV) ని కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విషయంలో చాలామంది చేసే ఒక తప్పు ఏమిటంటే? మన దగ్గర బడ్జెట్ ఉందిలే అని, రూము సైజు(Room Size)తో సంబంధం లేకుండా పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ ని కొంటా ఉంటారు. అదేనండి Flipkart మరియు amazon సేల్స్ సమయంలో ఆఫర్లు చూసి మాకు పెద్ద టీవీ కావాలి అంటే పెద్ద టీవీ అని చూస్తారు కదా!
కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయని పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ మనకు ఉండే లాభం కన్నా కొంచెం నష్టమే ఉంటుంది. అది ఎలాగంటే ఇప్పుడు మీ గది చిన్నగా ఉండి టీవీ చాలా పెద్దదైతే మీకు ఎలా ఉంటుంది? థియేటర్లలో ఫస్ట్ సీట్లో కూర్చొని సినిమా చూసినట్లు ఉంటుంది. దీనివల్ల పెద్ద స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల కొంతమందికి కంటి అలసట, అసౌకర్యం లేదా తలనొప్పి అనిపించవచ్చు.
మీ రూమ్‌కు ఏ టీవీ సైజ్ సరిపోతుందో ఒక్క నిమిషంలో తెలుసుకోండి?
మీ సోఫా నుండి టీవీకి ఉండే దూరాన్ని బట్టి సరైన టీవీ సైజును ఈ విధంగా ఎంచుకోవాలి. కొన్ని ప్రముఖ సంస్థల గైడ్ అధికారిక లెక్కల ప్రకారం: 6 నుండి 8 అడుగుల దూరం ఉంటే 43 ఇంచుల నుండి 50 ఇంచుల టీవీ, 8 నుండి 10 అడుగుల దూరం ఉంటే 55 ఇంచుల టీవీ, మరియు 10 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉంటే 65 లేదా 75 ఇంచుల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం మంచిది.
TV స్క్రీన్ దూరం ఎంత ఉండాలి? (TV Size vs Distance):
అసలు మనం ఏదైనా టీవీ స్క్రీన్ సైజు కొలవాలి అంటే, పొడవు వెడల్పు కొలత కాదు, టీవీ యొక్క ఒక మూల నుండి మరొక మూల (Diagonally) మధ్య దూరమును ఇంచుల తో కొలుస్తారు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఒకసారి తెలియని వారి కోసం చెప్పాను.
ఇప్పుడు మీ గదిలో సోఫా లేదా మంచం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నుండి మీరు టీవీ ని ఏ గోడకి లేదా టేబుల్ మీద ఉంచుతారో ముందుగా వీటి మధ్య కొలత (measurement) టేప్ తో కొలవండి.
ఇక్కడ నేను ఒక టేబుల్ ప్రొవైడ్ చేస్తాను. ఈ టేబుల్ లో ప్రకారంగా అటు ఇటుగా కొంచెం మీరు సరైన నిర్ణయం తీసుకోండి.
| చూసే దూరం (Viewing Distance) | టీవీ సైజ్ (TV Size) |
| 5 నుండి 6 అడుగులు | 32 ఇంచుల స్మార్ట్ టీవీ |
| 6 నుండి 8 అడుగులు | 43 ఇంచుల నుండి 50 ఇంచుల టీవీ |
| 8 నుండి 10 అడుగులు | 55 ఇంచుల 4K టీవీ |
| 10 అడుగుల కంటే ఎక్కువ | 65 ఇంచుల నుండి 75 ఇంచుల టీవీ |
ఫీల్డ్ ఆఫ్ వ్యూ (Field of View) ఫార్ములా ఏంటి?:
మీకు పైన చెప్పినవి నేనేదో ఊరికినే చెప్పలేదు. నేను కొన్ని ప్రముఖ వెబ్ పేజీలను రిఫర్ చేసి అర్థం చేసుకొన్నా తర్వాతనే నేను చెప్పగలిగాను. కొన్ని ప్రముఖ టెస్టింగ్ సంస్థల గైడ్‌లైన్స్ ప్రకారం, ఏదైనా టీవీ ఉన్నప్పుడు మన కంటికి 30 నుండి 40 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (Field of View – FOV) ఉండాలి.
ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే ఏమిటి?: మనము తల తిప్పకుండా మన కళ్ళు ఒకేసారి చూసే మొత్తం ఏరియా ని ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటారు. మీరు చూసే టీవీ స్క్రీన్ మీ కంటి చూపులో 30° నుండి 40° భాగాన్ని ఆక్రమించినప్పుడు మాత్రమే సినిమా చూసేటప్పుడు మంచి ఫీలింగ్ ఉంటుంది.
దీనికోసం ఒక సింపుల్ మ్యాథ్స్ ఫార్ములా ఉంది. మీ సోఫా నుండి టీవీ కి గల దూరాన్ని మీరు ఇంచులలో (ఇంచెస్) కొలవండి.
ఉదాహరణకు వాటి మధ్య దూరం 8 అడుగులు (96 ఇంచులు) వచ్చింది అనుకుంటే, ఆ దూరాన్ని 1.6 తో డివైడ్(Divide) చేయాలి. (96 /1.6 = 60). దీన్ని బట్టి మీ యొక్క కంటి చూపు తిప్పకుండా ఉండాలంటే గరిష్టంగా 55 లేదా 60 ఇంచుల టీవీని మాత్రమే కొనుగోలు చేయాలి.
చిన్న గదిలో పెద్ద టీవీ పెడితే వచ్చే ఇబ్బందులు:
- కంటి అలసట (Eye Strain): మీరు అతి తక్కువ దూరం నుండి ఎక్కువ బ్రైట్నెస్ ఉన్న పెద్ద టీవీ స్క్రీన్ ను చూడటం వల్ల కంటి అలసట, తలనొప్పి వంటి సమస్యలు అవకాశం ఉంది.
- కరెంట్ బిల్లు బాదుడు: టీవీ స్క్రీన్ సైజ్ పెరిగేకొద్దీ అది వాడుకునే విద్యుత్ పవర్ (Watts) కూడా పెరుగుతుంది. దానివల్ల నెలవారీ కరెంట్ బిల్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
ముగింపు (Conclusion):
కనుక కేవలం డబ్బులు ఉన్నాయని కానీ లేదా ఆఫర్ ఏదో ఉంటుందని గాని మీరు ఇబ్బంది పడకండి. ఇది నా సైడ్ నుండి చిన్న సలహా. ఇక మీ గది కొలతలకు సరిపోయే స్మార్ట్ టీవీ ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు గాని ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వెంటనే మీ whatsapp గ్రూపులలో షేర్ చేసి, మీ స్నేహితుడు మరియు కుటుంబ సభ్యులకు కూడా తెలిసేలాగా చేయండి.
మరి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం తెలుగు టెక్ ట్రైన్ తెలుగు టెక్ ట్రైన్ (Telugu Tech Train) వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.
You may also like these:









Good information about Smart Tv’s.
Thanks for supporting us..