మీ ఇంట్లో Wi-Fi స్పీడ్ తగ్గుతోందా? Wifi Router పక్కన ఈ 3 వస్తువులు ఉండకూడదు!

WiFi router: మీరు Wi-Fi యూస్ చేస్తున్నారా? మీ ఇంట్లో, మీరు మంచి స్పీడు ఉన్న ప్లాన్ వేసుకున్నWifi signal సరిగ్గా రావటం లేదా? మీరు ఎక్కువగా ఆన్లైన్ లో వీడియోస్ చూసే వారైతే మాటిమాటికీ Buffering అవుతా ఉందా? లేదా మీరు ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు, టీమ్స్ కాల్ బఫరింగ్ అవుతున్నాయా?

అయితే దీనికి మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ISP) సమస్య లేదా మీరు తీసుకున్న ప్లాను మాత్రమే కారణం కాకపోవచ్చు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అవి ఎలా చెప్పుకోవచ్చు అంటే మీ Wi-Fi Router పక్కన ఈ ఆర్టికల్ లో నేను చెప్పేఈ వస్తువులు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి.ఒకవేళ ఉంటే మార్చుకోవడానికి ట్రై చేయండి. ఆ వస్తువుల వల్ల ఇంట్లో WiFi Router యొక్క సిగ్నల్ weak అవ్వడానికి అవకాశం ఉంది.

WiFi Router పక్కన ఏ వస్తువులు ఉంటే Internet Speed తగ్గొచ్చు?:

సింపుల్ గా ఒక నిమిషంలో చెప్పుకోవాలి అంటే, మీ ఇంట్లో ఉన్న Wi-Fi Router పక్కన Microwave Oven, పెద్ద Mirrors లేదా Metal Objects, మరియు Bluetooth పరికరాలు ఉంచడం వల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయే అవకాశం ఉంది. నేను చెప్పిన ఏ వస్తువులు ఇంట్లో ఉన్న రూటర్ విడుదల చేసే 2.4 GHz wireless రేడియో తరంగాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇంటర్నెట్ సిగ్నల్ Strength తగ్గిపోకుండా ఉండాలంటే ఏ వస్తువులను నీ Wi-Fi Router నుండి వీలైనంత దూరంలో ఉండేలా చూసుకోండి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

WiFi Home Network సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి?:

మన ఇళ్లలో వాడే ప్రతి WiFi Router, సిగ్నల్స్ ని ఓకే డైరెక్షన్లో కాకుండా అన్నివైపులా పంపిస్తా ఉంటుంది. ఈ సిగ్నల్స్ తమ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఏమైనా బలమైన అడ్డంకులు ఏర్పడితే, Wifi Signal Quality తగ్గవచ్చు. దీని వల్ల Data Retransmissions, Packet Loss లేదా Throughput తగ్గడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. దేనికి ఫలితంగా మనకు Buffering లేదా Connection Instability అయ్యే అవకాశం ఉంటుంది.

WiFi Signalను ప్రభావితం చేసే 3 ముఖ్యమైన వస్తువులు ఏవి?

మైక్రోవేవ్ ఓవెన్ (Microwave Oven):

Microwave Ovens పనిచేసేటప్పుడు సుమారు 2.45 GHz ఫ్రీక్వెన్సీ గల Radio Frequency Energy ని ఉపయోగిస్తాయి. మన ఇండ్లలో ఉండే 2.4 GHz Wifi కూడా ఇదే Frequency Bandను ఉపయోగిస్తాయి. అందువల్ల Microwave Oven మరియు WiFi Router ఈ రెండింటిని పక్కపక్కనే లేదా దగ్గరగా వచ్చినప్పుడు Wireless Interference ఏర్పడవచ్చు. దీని ప్రభావం మనం వాడే Router Model మరియు Microwave Design పై ఆధారపడి ఉంటుంది.

పెద్ద అద్దాలు మరియు మెటల్ వస్తువులు | Large Mirrors & Metal Objects:

WiFi Router ను, మెంటల్ లేదా పెద్ద మిర్రర్స్ పక్కన ఉంచకూడదు. అది ఎలాగంటే మీ Wifi Signal ఏదైనా ఒక మెటల్ వస్తువును టచ్ చేసినప్పుడు, ఆ సిగ్నల్ ని రిఫ్లెక్ట్ చేయడం లేదా వీక్ చేయడం ద్వారా Signal Quality తగ్గే అవకాశం ఉంది.

మరి మీరు అనుకోవచ్చు వైఫై సిగ్నల్ ఎలా తగ్గుతుందని? దానికి కూడా నేను చెప్తాను. పెద్ద మిర్రర్స్ వెనక Metal Coating వేయడం వల్ల, అద్దంలో చూసుకున్నప్పుడు మన ఇమేజ్ లేదా ప్రతిబింబం కనపడుతుంది. మరి దీని కోసం వేసిన మెటల్ కోటింగ్ మన WiFi Router నుండి వచ్చే Radio Signals ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకని వీటికి కూడా మీ WiFi Router ను దూరంగా ఉంచండి.

బ్లూటూత్ డివైసెస్ | Bluetooth Devices:

ఈ రోజుల్లో అందరం బ్లూటూత్ స్పీకర్లు లేదా బ్లూటూత్ కి సంబంధించిన డివైస్ లను వాడుతున్నాము. ఈ Bluetooth Devices కూడా ప్రధానంగా 2.4 GHz Bandను ఉపయోగిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ2.4 GHz Band wi-fi రూటర్ ఒక సిగ్నల్ Strength పై ప్రభావం చూపుతాయి కనుక ఈ 2.4 GHz Wireless Devices లకు దూరంగా మీ Wi-Fi Router ని ఉంచండి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

WiFi Speed మరియు Signal Strength మెరుగుపరచడానికి కొన్ని Easy Tips:

  • రూటర్ స్థానం మార్చండి: మీ WiFi Router ను పైన చెప్పిన వస్తువులకు దూరంగా, కొంచెం ఎత్తైన మరియు Open Space లో ఉంచడం మంచిది.
  • 5 GHz బ్యాండ్ ఉపయోగించండి: మీ ఇంట్లో Dual-Band సపోర్ట్ చేసే Router ఉంటే, మీ మొబైల్స్ మరియు లాప్టాప్ లను 5 GHz నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి. ఒకవేళ మొబైల్స్ మరియు లాప్టాప్ మీ రూటర్ నుండి దూరంగా ఉంటే 2.4 GHz మరింత ఉపయోగకరంగా ఉండవచ్చు.
  • గోడలకు దూరంగా ఉంచండి: రూటర్‌ను మరీ గోడ మూలన కాకుండా, కొంచెం ఓపెన్ గా ఉండే ప్లేస్ లలో పెట్టండి.

గమనిక: నేను చెప్పిన ఈ ఆర్టికల్లో ఇన్ఫర్మేషన్ నార్మల్ Home Wi-Fi మరియు Networking అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఇంటి నిర్మాణం, Router Model, Connected Devices మరియు Wireless Environment ఆధారంగా ఫలితాలు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏవైనా Network సమస్యలు కొనసాగితే మీ Internet Service Provider లేదా Network Technician ను సంప్రదించండి.

ముగింపు:

ఈ బ్లాగ్ చదివిన తర్వాత ఒకసారి మీ ఇంట్లో WiFi Router ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. మీ WiFi Router పక్కన ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా అద్దాలు లేదా మెటల్ వస్తువులు ఉంటే కాస్త మీ WiFi Router ను కాస్త దూరంగా ఉంచండి. ఇది నా చిన్న సలహా.

ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ మిత్రు మీ Whatsapp గ్రూపు తప్పకుండా షేర్ చేయగలరని కోరుకుంటున్న ఇలాంటి మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం మా Telugu Tech Train బ్లాగును ఫాలో అవ్వండి.

ఇదంతా చదివారు కదా మరి మీ ఇంట్లో ఏ కంపెనీ ప్లాన్ వేసారో? ఎంత MBPS ప్లాన్ వేసారో?కామెంట్లో మెన్షన్ చేయండి కామెంట్లో మెన్షన్ చేయండి.

You may also like these:

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “మీ ఇంట్లో Wi-Fi స్పీడ్ తగ్గుతోందా? Wifi Router పక్కన ఈ 3 వస్తువులు ఉండకూడదు!”

Leave a Comment