Instagram Story Reshare: Instagram అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరికి Instagram Account ఉండవలసింది. ప్రతిరోజులో మినిమం ఒక్కసారైనా మనం Instagram ఓపెన్ చేస్తూ ఉంటారు. మనం Photos, Videos, Reels, Stories షేర్ చేస్తూ ఉంటాము. ఇన్స్టాగ్రామ్ తన యొక్క స్టైల్ లో trend కి తగ్గట్టు కొత్త ఫీచర్స్ మార్కెట్లో రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. మరి ఈసారి ఒక కొత్త ఫీచర్ ను మనకి పరిచయం చేసింది అదే Story Reshare Feature.
Instagram Story Reshare Feature అంటే ఏమిటి?
ఇప్పటివరకు మనం ఇన్స్టాగ్రామ్ లో మనల్ని Tag (or mention) చేస్తూ ఎవరైనా Instagram Story పెట్టిన తర్వాత, ఆ స్టోరీ చూస్తున్నప్పుడు మనకి Add to your story అని కనబడుతుంది. దానిమీద క్లిక్ చేస్తే ఆ స్టోరీ మన అకౌంట్లో కూడా Story గా షేర్ అవుతుంది.
ఒకవేళ మిమ్మల్ని ఆ స్టోరీలో ట్యాగ్ చేయకపోతే మీరు ఆ స్టోరీని, మీ అకౌంట్లో స్టొరీ గా
షేర్ చేసుకోలేరు. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్ వల్ల మనము Add to your story మీద క్లిక్ చేస్తే ఆ స్టోరీని మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టొరీ గా షేర్ చేసుకోవచ్చు, ఇదే కొత్త Story Reshare ఫీచర్.
Join WhatsApp
Join NowJoin Telegram
ఇలాగా మీకు తెలిసిన వాళ్ళ స్టోరీస్ రీషేర్ చేసుకోవడమే కాకుండా, వేరే కంటెంట్ క్రియేటర్ల యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీ గా పెట్టుకోవచ్చు.
Note: మీరు మీ ఫ్రెండ్ స్టోరీ కానీ లేదంటే, వేరే కంటెంట్ క్రియేటర్ల యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీని మీ అకౌంట్లో రీషేర్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఎకౌంటు Public Account అయి ఉండాలి.
ఈ feature ఎలా పనిచేస్తుంది?
- మీరు Instagram Public Account కలిగిన వ్యక్తి యొక్క స్టోరీ చూస్తున్నప్పుడు, మీరు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆడ్ టు యువర్ స్టోరీ అని బటన్ కనిపిస్తుంది, మిగతా sharing options తో పాటుగా.
- అక్కడ కనపడే Add to your story క్లిక్ చేస్తే ఆ స్టోరీ మీ Insta Story లోకి రీషేర్ అవుతుంది.
- ఇదే కాక ఆ స్టోరీ యొక్క User Name మీ స్టోరీలో display అవుతుంది. ఇది కూడా గమనించండి.
మీ Instagram Story ని ఇతరులు Reshare చేయకుండా చేయటం ఎలా?
- మన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి కార్నర్ లో త్రీ లైన్స్ మీద క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు Settings and Activity పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇందులో “How others can Interact with you” అనే టాబ్ లోకి వెళ్ళాలి.
- అందులో “sharing” అని ఉంటుంది. దీనిని క్లిక్ చేస్తే వేరే పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది . ఇక్కడ మనం డిసేబుల్ చేసుకోవాలి
ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ని వేరేవాళ్లు రేశారు చేయలేరు మీరు Public Account ఎనేబుల్ చేసిన కూడా.
ఈ ఫీచర్ వల్ల యూస్ ఏంటి?
ఈ ఫీచర్ మామూలుగా ఇంస్టాగ్రామ్ యూస్ చేసే వాళ్ళకి అంతగా ఉపయోగపడకపోయినా కంటెంట్ క్రియేటర్స్ కు మాత్రం చాలా యూస్ అవుతుంది. Content creators ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేసి అది స్టోరీ కింద పెట్టినప్పుడు ఆ స్టోరీ మనకు నచ్చినట్లయితే మనము ఆ కంటెంట్ క్రియేటర్ Public Account లో ఉంటుంది, కాబట్టి మనము మన Instagram Story కింద పెట్టుకుంటాము.
దీనివలన మనం పెట్టిన స్టోరీని మన ఫ్రెండ్స్ లేదా బంధువులు చూస్తారు. ఇలా చూడడం వల్ల ఆ content creator కి రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా కంటెంట్ క్రియేటర్స్ కి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫీచర్. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ కంటెంట్ క్రియేటర్ కి ఫాలోవర్స్ పెరిగే అవకాశం కూడా ఉంది.
ముగింపు:
ఇంస్టాగ్రామ్ తెచ్చిన ఫీచర్స్ లో ఇది ఒక కొత్త ఫీచర్, అదే Story Reshare, ఈ ఫీచర్ యూస్ చేసుకొని మనం కంటెంట్ క్రియేటర్స్ అయితే లేదా మన స్టోరీ ఎక్కువ రీచ్ అవ్వాలి అనుకుంటే, ఈ Story Reshare ఆప్షన్ మనం Enable చేసుకుంటే మనకు రీచ్ పెరిగే అవకాశం ఉంది.
ఈ స్టోరీ ఆప్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లలో చెప్పండి. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌటు ఉంటే కామెంట్స్ లో ఈ విషయం కూడా అడగండి.
ఈ కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ షిప్ కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త అప్డేట్స్ మీ ముందుకి రావాలంటే డైలీ ఈ Telugu Tech Train బ్లాగు ఫాలో అవుతూ ఉండండి.








