U, P, H, HX: మీరు కొత్త laptop ని కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఆన్లైన్లో గాని ఆఫ్లైన్లో గాని లాప్టాప్ స్పెసిఫికేషన్స్ చూసేటప్పుడు “Intel Core Ultra 7 155H” లేదా “Core 7 150U” లాంటి పేర్లు కనిపించి ఉంటాయి? అంతా బాగానే ఉంది కానీ ఆ చివర ఉన్న లెటర్ () ఏంటి అని అర్థం కాక కన్ఫ్యూజన్ అవుతున్నారా?
RAM, storage, display వీటిని మాత్రమే చూస్తారు కానీ processor పేరులో ఉన్న ఈ letter ని పట్టించుకోరు. అయితే ఈ ఒక్క letter మీ laptop battery life, performance, heat, gaming లేదా video editing వంటి పనులకు ఆ laptop ఎంతవరకు సరిపోతుందో అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది.
U, P, H, HX అంటే ఏంటి?
- U = Ultra-low power, ఎక్కువ battery life, thin & light laptops కోసం
- P = U కంటే కొంచెం ఎక్కువ performance ఉంటుంది. అలాగే thin design కూడా maintain చేస్తుంది.
- H = High performance కోసం, అంటే gaming, video editing, content creation వంటి heavy tasks వంటి వాటికోసం. సాధారణంగా U లేదా P కంటే ఎక్కువ power అవసరం అవుతుంది.
- HX = High-performance laptop processors, సాధారణంగా H కంటే ఎక్కువ power/performance కోసం డిజైన్ చేసిన series.
U, P, H, HX: ఈ letters ఏం చెబుతాయి?
Laptop Processor మార్కెట్లో ఒకే రకమైన Chip design ని అన్ని రకాల laptops లో వాడలేరు కదా! ఉదాహరణకు ఒక ultra-thin laptopలో పెద్ద cooling system పెట్టడానికి లోపల ఎక్కువ ప్లేస్ ఉండదు. అలాంటిది gaming laptopలో powerful cooling కోసం ప్రత్యేకంగా ఎక్కువ ప్లేస్ యూస్ చేస్తారు.
ఇలాంటి తేడా వల్లే Intel, AMD లాంటి పెద్ద కంపెనీలు ఒకే processor family ని (అంటే ఒకే core design ఉన్న chip ని) వేర్వేరు power/performance levels కోసం design చేస్తారు. ఇలా డిజైన్ చేసిన processor ఎలాంటి laptop కోసం అనే, ఎలాంటి power-performance balance కోసం అని డిజైన్ చేశారో అని తెలిసేలాగా ఉండేందుకు U, P, H, HX వంటి పేరు చివర్లో పెడతారు.
అంటే, రెండు processorsలో generation లేదా core count దగ్గరగా ఉన్నా, పేరు చివర్లో ఉన్న U, P, H లేదా HX letters వాటి Power and Performance positioning గురించి తెలుసుకోవడానికి యూస్ అవుతాయి . అయితే Exact performance, power consumption, heat మాత్రం processor model, laptop cooling system, power limits లాంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటాయి.
U-Series: Battery Life కి Priority
U-series processors సాధారణంగా power efficiencyకి priority ఇచ్చే laptops కోసం డిజైన్ చేయబడతాయి. అందుకే thin & light laptops లో వీటిని ఎక్కువగా చూడవచ్చు.
ఎవరికి సరిపోతుంది:
- Browsing, emails మరియు Word/Excel లాంటి office work చేసేవాళ్లకి
- లాప్టాప్ బరువు కొంచెం తేలికగా, సన్నగా కావాలనుకునేవాళ్లకి
- ఎక్కువసేపు meetings, travel లో laptop వాడేవాళ్లకి
గమనిక: Heavy video editing లేదా gaming లేదా పెద్ద coding projects లాంటి పనులకి ఇది సరిపోదు అని చెప్పుకోవచ్చు.
P-Series: Balanced Performance:
P-Series, U కంటే ఎక్కువ performance కోసం డిజైన్ చేసిన thin-and-light laptop processors. అయితే ఈ లాప్టాప్ exact power limits processor generation, SKU, laptop design మీద ఆధారపడతాయి. సాధారణంగా H-series కంటే thin-and-light laptopsలో వీటిని ఎక్కువగా చూడవచ్చు.
ఎవరికి సరిపోతుంది:
- Office work తో పాటు కొంచెం heavy multitasking చేసేవాళ్లకి
- Thin laptop కావాలి, కానీ U కంటే కొంచెం ఎక్కువ performance కావాలి అనుకునేవాళ్లకి
H-Series: Performance First
H-series laptops, ఇవి మంచి performance ఇచ్చే laptops. వీటిని content creation, games లేదా advanced applications కోసం డిజైన్ చేసారు అని చెప్పొచ్చు.
ఎవరికి సరిపోతుంది:
- Gaming laptops కొనేవాళ్లకి
- Video editing, 3D rendering లాంటి heavy tasks చేసేవాళ్లకి
- Multitasking heavy గా ఉండే professionals కి
గమనిక: ఈ laptops కొంచెం బరువుగా, thick గా ఉంటాయి, అంతేకాక battery life U లేదా P వంటి series తో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
HX-Series: highest Performance
High-performance laptop processors. ఇవి సాధారణంగా H-series కంటే ఎక్కువ performance/power కోసం డిజైన్ చేయబడతాయి. Gaming, rendering, 3D work వంటి demanding tasks కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఎవరికి సరిపోతుంది:
- బాగా గేమింగ్స్(Gaming) అంటే ఇష్టం ఉన్నవాళ్లు
- Professional video లేదా 3D workstation లేదా Render సాఫ్ట్వేర్లు వాడేవాళ్లకి
U, P, H, HX Comparison | కంపారిసిన్:
| Letter | Main Focus | ఎవరికి? |
| U | Battery efficiency | Office, browsing, students |
| P | Performance + efficiency balance | Multitasking |
| H | performance first | Gaming, editing |
| HX | high performance | Gaming, rendering, workstation tasks |
గమనిక: ఇవి కేవలం general guidelines మాత్రమే. పైన చెప్పిన స్పెసిఫికేషన్స్ ఆ లాప్టాప్ యొక్క Actual performance processor model, cooling system, power limits మరియు laptop designపై ఆధారపడి మారవచ్చు.
AMD Processors లో కూడా ఇదే Logic:
AMD వాళ్లు కూడా Ryzen laptop chips లో power consumption ని సూచించడానికి U, HS, HX అనే letters వాడుతారు, అయితే AMD, Intel suffixes ని ఒకటే అని అనుకోకూడదు. processor generation మరియు exact model specifications ని కూడా చూడాలి.
Laptop కొనేముందు మీరు ఏమి చేయాలి? | U, P, H, HX:
- మీరు Laptop కొనేటప్పుడు, కేవలం ఆ లాప్టాప్ మీద ఉండే “i7” లేదా “Ryzen 7” అనే number చూసి మాత్రమే కొనకండి. ఆ number తర్వాత వచ్చే letter ని కూడా చూడండి.
- మీరు అసలు లాప్టాప్ ఏ అవసరం కోసం కొనాలనుకుంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు సరిపడే లాప్టాప్ ను తీసుకోండి. ఉదాహరణకు Portability కావాలా, Performance కావాలా అని
- మీరు నాకు కేవలం Battery life ఉంటే చాలు అనుకుంటే U లేదా P series వంటి లాప్టాప్ ను తీసుకోండి.
- మేము బాగా Gaming, video editing, heavy multitasking, Rendering softaware వాడతాము అనుకుంటే, మీరు H లేదా HX వైపు వెళ్లండి.
- మాకు Weight, thickness, noise ఉన్న పర్వాలేదు అనుకుంటే, ఈ H/HX laptops లను తీసుకోగలరు. ఎందుకంటే ఇవి సాధారణంగా బరువుగా, cooling fan noise ఉండేలా డిజైన్ చేస్తారు.
- మీరు Reviews లో actual battery backup, thermal performance చూడండి, కేవలం processor name మీద ఆధారపడకండి ఇది నా సలహా.
Laptop తీసుకునేటప్పుడు సాధారణంగా జరిగే తప్పులు:
- తప్పు 1: కేవలం “i7” లేదా “Ryzen 9” చూసి “ఇది powerful processor” అని అనుకోని దాని చివర ఉన్న లెటర్ చూడకుండా తీసుకోవడం.
- తప్పు 2: Thin, light laptop కావాలి అనుకుంటూ, వేరే వాళ్ళు చెప్పారని మీకు ఆ లాప్టాప్ అవసరం లేకపోయినా H/HX series laptop కొనుక్కోవడం.
- తప్పు 3: Gaming లేదా video editing కోసం అని U-series laptop కొనడం
ముగింపు:
Laptop processor పేరులో ఉండే HX, H, P, U అనేవి ఏదో ఊరికినే ఇచ్చారు అని అనుకోవద్దు. నా లాప్టాప్ ని మీరు ఏ పర్పస్ కోసం తీసుకోవాలా అని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.
ఉదాహరణకుమీకు battery efficiency మరియు portability important అయితే U-series వంటి options చూడొచ్చు. Performanceతో పాటు thin design కూడా కావాలంటే P-series ని చెక్ చేయండి . Gaming, video editing, rendering వంటి heavy workloads అయితే H లేదా HX-series వైపు చూడొచ్చు. కానీ చివరిగా, exact model, brand cooling design, మరియు reviews చూసి decide చేయడం ఎప్పుడూ మంచిది.
You may also like these:
FAQ:
Q1: U series processor తో gaming చేయగలమా?
తేలికైన, పాత games ఆడగలరు, కానీ modern, heavy games కోసం ఇది సరిపోదు. Gaming కోసం H లేదా HX series better.
Q2: HX laptop ఎప్పుడూ H కంటే better అని అర్థమా?
సాధారణంగా HX-series ఎక్కువ performance/power కోసం position చేయబడుతుంది. కానీ HX ఉన్న ప్రతి laptop ప్రతి పరిస్థితిలో H laptop కంటే faster అని చెప్పలేం. Exact processor, cooling, power limits మరియు laptop design కూడా performanceని ప్రభావితం చేస్తాయి.
Q3: P series laptops కూడా thin గా ఉంటాయా?
అవును, P series U కంటే ఎక్కువ power వాడినా, ఇప్పటికీ thin-and-light design లో ఇమిడేలా design చేస్తారు.
Q4: AMD processors లోనూ ఇదే letters ఉంటాయా?
AMD U, HS, HX అనే letters వాడుతుంది, logic Intel తో సమానంగా ఉంటుంది.









Good suggestion about laptop.
Thanks Murali