POCO M8 Power 5G: మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పవర్ బ్యాంకు తీసుకెళ్లడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందా? బయటికి వెళ్ళేటప్పుడు మీ మొబైల్ లో ఛార్జింగ్ లేక అయ్యో చార్జింగ్ పెట్టుంటే బాగుండు అని అనిపించిందా? అలాంటి వారి గురించి తెలుసుకొని POCO తన సరికొత్త POCO M8 POWER 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో ఏకంగా 8000 mAH బ్యాటరీ తో తీసుకువచ్చారు.
POCO M8 POWER 5G: ముఖ్యమైన విషయాలు:
- లాంచ్ డేట్ : ఆగస్టు 4వ తేదీ 2026న ఇండియాలో అఫీషియల్ గా విడుదలైంది.
- ప్రైమరీ హైలెట్: 8000 mAH silicon carbon battery నిఇందులో తీసుకువచ్చారు.
- ప్రాసెసర్: ఇందులో Qualcomm Snapdragon 4 Gen 4 ని ప్రొవైడ్ చేశారు.
- ధర(Price): పోకో వాళ్ళు బేస్ వేరియంట్(6GB+128GB) మొబైల్ 24,999 కి తీసుకువచ్చారు.
- సేల్: ఈ POCO M8 POWER 5G మొబైల్ ఆగస్టు 7 2026 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు.
POCO M8 POWER 5G కొత్తగా ఏముంది?:
మనం సాధారణంగా, స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 5000 mAh లేదా 6000 mAh బ్యాటరీ ఉన్న మొబైల్స్ చూస్తూ ఉంటాం. మరి ఈ POCO M8 POWER 5G మొబైల్ లో చూసుకున్నట్లయితే ఏకంగా 8000 mAH silicon carbon బ్యాటరీ తో రావటం వల్ల ఈ మొబైల్ మెయిన్ ఎట్రాక్టివ్ గా ఉంది.
ఇలాంటి మొబైల్ బాగా ఎవరికీ ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ సేపు మొబైల్ యూస్ చేసేవారు, ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవారు, గేమర్స్ ఇలాంటి వారికి ఈ మొబైల్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది దీని బ్యాటరీ వల్ల. ఇది కేవలం బ్యాటరీ తోనే రావడం కాదు, ఈ మొబైల్ కు 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ updates ఇస్తామని కంపెనీ ప్రకటించడం మంచి విషయం.
POCO M8 POWER 5G: Specifications and features | స్పెసిఫికేషన్స్ & ఫీచర్స్
ఈ మొబైల్ గురించి మాట్లాడాలంటే కేవలము బ్యాటరీ గురించే కాదు, మిగతా ఫీచర్స్ లలో కూడా మంచి ఫీచర్స్ ఇచ్చారని కూడా మాట్లాడుకోవచ్చు.
AMOLED display:
ఇందులో 6.99 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ను ప్రొవైడ్ చేశారు. 120 Hz refresh rate తీసుకురావడం వల్ల scrolling మరియు animations చాలా స్మూత్ గా కనిపిస్తాయి. అంతేకాదండోయ్ 1800 nits peak brightness ఉండటంవల్ల ఎండలో ఉన్నప్పుడు కూడా ఫోన్ స్క్రీన్ కనబడుతుంది.
Processor | ప్రాసెసర్:
Qualcomm Snapdragon 4 Gen 4 చిప్ సెట్ తో తీసుకురావడం వల్ల మనం చేసే రోజువారి పనులకు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ వంటి వాటికి యూస్ చేసుకోవచ్చు.
Storage | స్టోరేజ్:
ఈ మొబైల్ ను Price ని బట్టి 6GB RAM లేదా 8GB RAM LPDDR 4X మరియు 128 GB UFS 2.2 storage తో ప్రొవైడ్ చేశారు.
Software support:
ఈ POCO M8 POWER 5G మొబైలు Hyper OS 3 తో Android 16 పై రన్ అవుతుంది. కంపెనీ వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం 4 సంవత్సరాల Android Updates, 6 సంవత్సరాల Security Updates ఉంటాయని చెప్పుకోవచ్చు.
POCO M8 POWER 5G: బ్యాటరీ మరియు చార్జింగ్ | 8000 mAh Battery:
మనం మొదటగా చెప్పుకున్న విషయం ప్రకారమే ఈ ఫోన్లో మెయిన్ హైలెట్ ఫీచర్ ఏంటంటే దీని బ్యాటరీ. ఈ బ్యాటరీ మనకు 8000 mAh Silicon carbon టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది.
45w Fast Charging:
ఈ మొబైల్ కు 45 ఓట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ గల చార్జర్ ను బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు.
22.5w Wired Reverse Charging:
ఈ మొబైలు మనకు ఒక Power Bank లా పని చేస్తుంది అని అనుకోవచ్చు. ఈ రివర్స్ చార్జింగ్ ఫీచర్ వల్ల ఫోన్ నుండి వేరే ఫోన్ కి చార్జ్ చేసుకోవచ్చు.
POCO M8 POWER 5G CAMERA | కెమెరా:
ఈ మొబైల్ యొక్క కెమెరా గురించి మనం చెప్పుకోవాలి అని అంటే వెనుక వైపు అంటే rare side కెమెరా 50MP Dual camera తో వస్తుంది. మరి ముందువైపు సెల్ఫీల కోసం 8 MP camera ను తీసుకువచ్చారు.
కెమెరా విషయానికి వచ్చినట్లయితే, రోజువారి ఫోటోలు తీసుకోవడానికి మంచిగానే ఉంటుంది. కానీ ultra-wide camera లేదని చెప్పుకోవచ్చు.
POCO M8 Power 5G: Price and Offer | ధర మరియు ఆఫర్ల వివరాలు:
ఈ ఫోను మనకు మొత్తంగా 2 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వాటి గురించి కింద టేబుల్ లో ఇస్తాను.
మరి కలర్(Color) వేరియంట్ లో చూసుకున్నట్లయితే ఇది మనకు 3 కలర్లలో దొరుకుతుంది.
- Black
- Green
- Blaze Orange
| వేరియంట్ (Variant) | అసలు ధర | ఆఫర్ ధర (Effective Price) |
| 6GB RAM + 128GB Storage | ₹24,999 | ₹21,999 |
| 8GB RAM + 128GB Storage | ₹27,999 | ₹24,999 |
గమనిక: ఈ ఆఫర్ ధర, డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ లేదా ఫోన్ ఎక్స్చేంజ్ బెనిఫిట్ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ ను కొనుక్కోవాలి అనుకుంటే ఈ డిస్కౌంట్ ఆఫర్ చెక్ చేసుకుని కొనుక్కోండి.
కొనేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
Weight: 8000 mAh బ్యాటరీ ఉండడం వల్ల ఫోను కొంచెం సాధారణ మొబైల్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు.
Camera: మీరు ప్రొఫెషనల్ గా ఫోటోగ్రఫీ లేదా Reels చేయడం కోసం మొబైల్ కొనాలి అనుకుంటే ఈ కెమెరా మీకు కొంచెం యావరేజ్ గానే ఉంటుంది అని అనుకోవచ్చు.
ఈ మొబైల్ POCO M8 POWER 5G ఎవరికి సరిపోతుంది?:
ఈ మొబైలు ఈ కింద చెప్పుకున్న వారికి బాగా సరిపోతుందని మనం అనుకోవచ్చు.
- రోజంతా ఎక్కువ సేపు యూట్యూబ్ లో వీడియోస్ చూసే వాళ్ళు
- ఎక్కువసేపు ఫేస్బుక్ మరియు వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ఆప్స్ యూస్ చేసేవారు
- ఎక్కువగా మ్యాప్స్ యూస్ చేసే వాళ్ళకి అంటే బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి
- బ్యాటరీ బ్యాక్అప్ కావాలని కోరుకునే వారికి.
- ఈసారి తమతో పాటు పవర్ బ్యాంకు తీసుకెళ్లడం ఇష్టం లేని వారికి
వీరికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు.
POCO M8 Power 5G: మా అభిప్రాయం:
POCO M8 Power 5Gలో 8,000mAh battery మెయిన్ highlight కావచ్చు మరియు దీనితో పాటు 120Hz AMOLED display, 5G connectivity ఉండడం, ఎక్కువ సంవత్సరాల software support ఇలాంటి విషయాలు ఈ ఫోన్ కి చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి.
అయితే ఓన్లీ battery ఉందనే కారణంతోనే phone అందరికీ best option అని చెప్పలేం. మీకు battery backup ముఖ్యమా, లేక camera, performance, design ముఖ్యమా? అని చూసుకొని ఫోను ని కొనుక్కోవడం మంచిది అని మా అభిప్రాయం.
ఈ సమాచారం గానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మీ బంధుమిత్రులకు లేదా Whatsapp గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు మీ ముందుకు రావాలి అంటే మన Telugu Tech Train బ్లాక్ ను డైలీ ఫాలో అవుతూ ఉండండి.
You may also Like these:
FAQ’s:
ప్రశ్న 1: POCO M8 Power 5G సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
సమాధానం: ఈ ఫోన్ సేల్స్ ఆగస్టు 7, 2026 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్ (Flipkart) లో ప్రారంభమౌతాయి.
ప్రశ్న 2: ఈ ఫోన్‌తో వేరే ఫోన్లను ఛార్జ్ చేయవచ్చా?
సమాధానం: అవును, ఇందులో 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేబుల్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఫోన్లను కూడా ఛార్జ్ చేయవచ్చు.
ప్రశ్న 3: బాక్స్‌లో ఛార్జర్ ఇస్తున్నారా?
సమాధానం: అవును, పోకో కంపెనీ బాక్స్‌లోనే 45W ఫాస్ట్ ఛార్జర్ ని అందిస్తున్నట్లు సమాచారం.









Good content about POCO M8 Power 5G