Battery Life : స్మార్ట్ ఫోన్ కొన్న కొత్తలో Mobile Battery Life చాలా ఎక్కువ సేపు వస్తుంది. కానీ అదే ఫోను ఇప్పట్లో చూసుకున్నట్లయితే మొదట్లో వచ్చిన అంతగా ఇప్పుడు Battery Backup ఇప్పుడు రావడం లేదని అనిపిస్తుంది కదా?
దీనికి కారణం ఆ ఫోను పాతది అవడం వల్ల అని అనుకుంటాం. కానీ అదొక్కటే కాదు, మనం చేసే చిన్న చిన్న తప్పులు అంటే Charging Habits, ఎక్కువ Screen Brightness వంటి వాటి వల్ల మన smartphone Battery Life తగ్గుతుందని మీకు తెలుసా?
అయితే మనం కొన్ని Simple Tips ఫాలో అవడం వల్ల కానీ, లేదంటే కొన్ని సెట్టింగ్స్ మార్చడం వల్ల కానీ మన Smartphone Battery Life ఇంకొంచెం ఎక్కువ రోజులు వచ్చేటట్టుగా చేసే అవకాశం ఉంది.
1)వీలైనంత వరకు 20% – 80% మధ్యలో చార్జ్ చేయండి:
నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎవరికైనా ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు 100% Charging పెట్టే అలవాటు ఉందా? అలా ఉంటే ఆ అలవాటు తగ్గించండి. ఇలా తగ్గిస్తే మీ Battery Life కొంచెం పెరగవచ్చు. అంతే కాదండోయ్ కొంతమంది 0% వచ్చేంత వరకు మొబైల్ యూస్ చేస్తూనే ఉంటారు. ఇలా ఈ రెండు చేస్తే మన బ్యాటరీ కొంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
సాధారణంగా మన మొబైల్‌లలో ఎక్కువగా Lithium-ion బ్యాటరీలు వాడతారు. ఈ బ్యాటరీలకు చాలా తక్కువ లేదా చాలా ఎక్కువగా ఉన్న స్టేజ్ లలో ఛార్జ్ చేస్తే ఈ Lithium-ion బ్యాటరీ మీద ఎక్కువ వత్తిడి పడుతుంది. ఒకవేళ మరి ఎక్కువగా లేదా మరీ తక్కువగా కాకుండా ఒక normal range లో చార్జ్ పెట్టినప్పుడు బ్యాటరీ మీద అంతగా ప్రెషర్ ఉండదు.
అందుకే వీలైనప్పుడు మీరు ఇలా చేయండి.
- Mobile Battery 20% దగ్గరకు వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టండి.
- రోజువారీ వాడకానికి 80% వరకు ఛార్జ్ చేస్తే సరిపోతుంది.
- ఫోన్లో Battery Protection, Optimized Charging లేదా Adaptive Charging వంటి ఫీచర్ ఉంటే ఆన్ చేయండి.
అయితే మీరు ప్రతిసారి 80% దగ్గరే చార్జింగ్ ఆపాలి, అని అవసరం లేదు. మీకు ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు 100% ఛార్జ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మీకు కావాల్సినపుడు 100% పెట్టుకోవచ్చు.
2)రాత్రంతా చార్జింగ్ పెట్టడం మానేయండి:
కొంతమంది అనుకుంటారు, రాత్రి పడుకునేటప్పుడు చార్జింగ్ పెట్టుకుంటే పొద్దున్నే లేవగానే ఫుల్ అయి ఉంటది కదా! ఉదయాన్నే లేవగానే మొబైలు వాడుకోవచ్చు. ఒకవేళ మీరు రాత్రంతా చార్జింగ్ పెట్టి వదిలేసినప్పుడు, ఇప్పుడు వస్తున్న స్మార్ట్ఫోన్లలో 100% అయిన తర్వాత charging ను ఆపేలా protection systems ఉన్నాయి.
కాబట్టి రాత్రంతా charger కు కనెక్ట్ చేసి ఉంచిన వెంటనే ఫోన్ పాడైపోతుందని చెప్పలేం. అయితే ఫోన్‌ను ఎక్కువసేపు 100% charge ఉండేలా ఉంచడం, ముఖ్యంగా charging సమయంలో వేడి పెరగడం, ఇలా ఉండటం వల్ల బ్యాటరీపై ఎక్స్ట్రా ప్రెజర్ పడుతుంది. పోను పోను battery healthపై ప్రభావం చూపవచ్చు.
- మీరు ఒకవేళ చార్జింగ్ పెట్టి ఉంటే 100% అయిపోయిన తర్వాత ప్లగ్ లో నుండి చార్జర్ ని తీసేయండి.
- మీరు వాడేది లేటెస్ట్ ఫోన్లో అయితే ఛార్జింగ్ కంట్రోల్, ఓవర్‌ఛార్జ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉంటాయి. వాటిని ఎనేబుల్ చేసుకోండి.
3)ఒరిజినల్ లేదా సర్టిఫైడ్ చార్జర్ వాడండి:
మీరు మొబైల్ కొన్నప్పుడు మీకు ఏది అయితే Original Charger వస్తుందో, ఆ చార్జర్ మరియు ఆ కేబుల్ తోనే మీరు ఫోన్ కి ఛార్జ్ పెట్టండి. లేదు మేం కొన్నప్పుడు చార్జర్ రాలేదు అనుకుంటే ఆ మొబైల్ లకు కంపెనీ వారు రికమెండ్ చేసే కంపెనీ Charger లనే వాడండి.
అలా కాకుండా మార్కెట్లో దొరికే చౌకైన, డూప్లికేట్ చార్జర్లు, కేబుల్స్ వాడటం వల్ల ఛార్జింగ్ సరిగ్గా ఎక్కకపోవడమే కాక, కొన్నిసార్లు ఓల్టేజ్ తేడాల వల్ల మీ Smartphone battery తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
- ఫోన్ కంపెనీ సిఫారసు చేసిన Charger వాడండి.
- నాణ్యమైన, మీ మొబైల్ సరిపోయే కేబుల్ ఉపయోగించండి.
- డ్యామేజ్ అయిన కేబుల్‌ను వెంటనే మార్చండి.
- తెలియని లోకల్ ఛార్జర్లను ఉపయోగించకుండా ఉండండి.
Read another: మీ Laptop battery Health గురించి తెలుసుకోవాలా?
4)Screen Brightness తగ్గించండి :
మీ ఫోన్లో ఉండే బ్యాటరీని ఎక్కువగా వాడే వాటిలో ఒకటి ఏంటంటే మీ Mobile Display. మీ మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ ఎప్పుడు ఫుల్ గా పెట్టుకోవడం వల్ల ఎక్కువగా బ్యాటరీ వాడకం అయ్యి వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది.
- Auto Brightness ఉపయోగించండి.
- అవసరమైనంత వరకు మాత్రమే బ్రైట్నెస్ ఉంచండి.
- Screen Timeoutను 15–30 సెకన్లకు సెట్ చేసుకోండి. మీ మొబైల్ స్క్రీన్ ఆన్ లో ఉంటే ఆ సమయం తర్వాత ఆఫ్ అవుతుంది దీనివల్ల మీ బ్యాటరీ సేవ్ అవుతుంది.
5)Apps Background లో ఉండకుండా చూడండి:
ఒకప్పుడు మనము కొన్ని Apps అవసరమై install చేసుకుని ఉంటాము. కానీ ఇప్పుడు ఆ యాప్స్ చాలా రోజులుగా వాడకుండా ఉంటాము. లేదంటే మనం రోజు వారి కొన్ని Apps రోజు వాడుతా ఉంటాము. ఇలా యాప్స్ మనం వాడినా వాడకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ లొకేషన్, డేటా వాడుతూ Mobile Battery ని వాడతాయి.
ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్, న్యూస్ యాప్స్ నిరంతరం రిఫ్రెష్ అవుతూ బ్యాటరీని ఎక్కువగా వాడతాయి. మరి ఇలాంటి యాప్స్ ఏవైతే బ్యాటరీ ఎక్కువగా యూస్ చేస్తున్నాయో అని తెలుసుకోవడానికి Settings > Battery > Battery Usage ఓపెన్ చేసి ఇక్కడ నుండి కంట్రోల్ చేసుకోండి.
గమనిక: Battery Usage తెలుసుకోవడానికి, కొన్ని మొబైల్స్ లో సెట్టింగ్స్ వేరే రకంగా ఉండవచ్చు.
- Background Activity పరిమితం చేయండి.
- Location Permissionను అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వండి.
- అవసరం లేని యాప్స్‌ను Uninstall చేయండి.
6)Location, Bluetooth, Hotspot అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి
మనకి అవసరం లేనప్పుడు Bluetooth లేదా Location, Hotspot off చేసుకుంటే మంచిది. ఇలా అవసరం లేని సమయంలో వీటిని ఉపయోగించకుండా ఉండటం వల్ల కొంత బ్యాటరీ ఆదా చేయవచ్చు.
- Bluetooth ఉపయోగించనప్పుడు దాన్ని ఆఫ్ చేయవచ్చు.
- GPS అవసరం లేకపోతే Location ఆఫ్ చేయండి. కానీ నేను మీరు బయటకు వెళ్లినప్పుడు ఏ ఆప్షన్ నేను ప్రిఫర్ చేయను.
- అవసరం లేని సమయంలో Hotspot ను ఆఫ్ చేయండి.
7)Dark Mode వాడండి (AMOLED లేదా OLED స్క్రీన్ ఉంటే):
మీ ఫోన్‌కి AMOLED లేదా OLED స్క్రీన్ ఉంటే, Dark Mode ఆన్ చేయడం వల్ల నల్ల రంగు చూపించే సమయంలో పిక్సెల్స్ దాదాపు ఆఫ్ అవుతాయి, దీనివల్ల బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది.అయితే పాత LCD స్క్రీన్లు ఉన్న ఫోన్లలో మీరు ఆన్ చేసిన అది అంతగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే LCD స్క్రీన్‌లో బ్యాక్‌లైట్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది.
అందుకే మీ ఫోన్లో OLED లేదా AMOLED డిస్ప్లే ఉంటే Dark Mode + తక్కువ బ్రైట్నెస్ కాంబినేషన్లో వాడండి.
8)Push Notifications కంట్రోల్ చేయండి.
మీరు చాలా Apps Install చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు యాప్ నుండి మీకు information మీకు రావాలి అంటే మీరు ఆ యాప్ ఓపెన్ చేయకుండా, అప్పుడు ఆ యాప్ మీకు నోటిఫికేషన్స్ పంపుతూ ఉంటుంది. కానీ ఆ నోటిఫికేషన్ ప్రతిసారి మీకు ఉపయోగపడేది కాకపోవచ్చు. ఇలా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఆ యాప్ బ్యాక్ గ్రౌండ్ లో మీ Mobile Battery ని మరియు మీ Data ని వాడుకుంటాయి.
ఇలాంటి అప్పుడు మీరు అవసరంలేని Push Notifications ఆఫ్ చేసుకుంటే చాలా దీనివల్ల మీ బ్యాటరీ కొంచెం సేవ్ అయ్యే అవకాశం ఉంది.
9)Phone Case తీసి చార్జ్ చేయండి:
ఫోనుకు వాడే మందపాటి Phone Case, ఫాస్ట్ ఛార్జింగ్ లేదా వైర్లెస్ ఛార్జింగ్ సమయంలో వేడిని బయటకు పోనివ్వకుండా చేస్తాయి. వీలైతే చార్జింగ్ పెట్టేటప్పుడు Phone Case తీసేయడం మంచిది, ఎందుకు అంటే పౌచ్ ఉండడం వల్ల వేడి ఎక్కువ అవుతుంది. ఈ హీట్ వల్ల మన ఫోన్లో లిథియం అయాన్ బ్యాటరీ రియాక్షన్ అయ్యి ఛార్జింగ్ స్లోగా ఎక్కేలా చేస్తుంది. అంతేగాక మన బ్యాటరీ దెబ్బతిని అవకాశం కూడా ఉంటుంది.
అందుకని మీరు ఈసారి ఫోను చార్జింగ్ చేసేటప్పుడు Phone Case తీసి ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి.
Live wallpaper వాడటం తగ్గించండి:
మీరు మీ మొబైల్ లో Live wallpaper అంటే Animated Images పెట్టుకున్నట్లయితే బ్యాటరీ కొంచెం తొందరగా అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాల్ పేపర్ మీ బ్యాటరీ మీదే పనిచేస్తుంది కదా! ఇలా కాకుండా మీరు Normal Wallpaper ని పెట్టుకోండి.
ముగింపు:
చివరిగా నేను చెప్పేది ఏంటంటే, Smart Phone Battery ఎప్పుడూ ఒకే Capacity తో పనిచేయదు. బ్యాటరీ వాడే కొద్ది దాని సామర్థ్యం తగ్గుతుంది. అయితే కొంతవరకైనా మన వంతుగా పైన చెప్పిన Battery life saving Tips ఫాలో అయితే మీ బ్యాటరీ మీద పడే బర్డెన్ ను తగ్గించి మీ బ్యాటరీ లైఫ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మన ఫోను బ్యాటరీ ఎప్పుడు 100% ఉండాలని ఆలోచన కంటే మన రోజువారి అవసరాలకు సరిపడేలాగా ఫోను ఉపయోగించుకోవడం ముఖ్యం.ఒకసారి పైన చెప్పుకున్న టిప్స్ ఫాలో అయి చూడండి. కొంతకాలం తర్వాత మీ Phone Battery Backup లో ఏమైనా తేడా ఉందేమో గమనించండి.
నేను చెప్పిన ఈ బ్లాక్ పోస్టు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి లేదా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీరు ఇంతకు ముందు వీటిలో ఏదైనా Tips ఫాలో అయితే, మీరు ఫాలో అయిన ట్రిక్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేసుకోండి.
ఇలాంటి మరెన్నో ఉపయోగపడే స్మార్ట్ ఫోన్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన Telugu Tech Train బ్లాగ్ ను ఫాలో అవుతూ ఉండండి.
You may also like these:
FAQ’s:
ఫోన్‌ను ప్రతిరోజూ 100% ఛార్జ్ చేసుకోవడం తప్పా?
అప్పుడప్పుడు 100% చేయడం పర్వాలేదు, కానీ ప్రతిరోజూ 100% కి చార్జ్ చేసి ఎక్కువసేపు అలాగే ఉంచడం బ్యాటరీపై ఒత్తిడి పెంచుతుంది. వీలైతే 80-90% వద్దే ఆపేయడం మంచిది.
రాత్రంతా చార్జింగ్‌లో పెడితే ఫోన్ పాడవుతుందా?
లేటెస్ట్ మొబైల్లో ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి వెంటనే ఫోన్ పాడవుతుందని చెప్పలేం. అయితే ఫోన్‌ను ఎక్కువసేపు 100% ఛార్జ్ లెవెల్లో ఉంచడం వల్ల, అదే సమయంలో వేడి పెరగడం బ్యాటరీపై ప్రభావం చూపవచ్చు. Optimized లేదా Adaptive Charging ఉంటే దాన్ని ఉపయోగించడం మంచిది.
బ్యాటరీని 20% కంటే తక్కువకు వెళ్లనివ్వకూడదా?
అలా ఖచ్చితమైన నియమం ఏమీ లేదు. 20% అనేది బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒక చిన్న గైడ్ మాత్రమే. అవసరమైనప్పుడు బ్యాటరీ 20% కంటే తక్కువకు వచ్చినా వెంటనే బ్యాటరీ పాడైపోదు. అయితే తరచుగా 0% వరకు ఖాళీ చేయకుండా, వీలైనప్పుడు ముందుగానే ఛార్జింగ్ పెట్టడం మంచి అలవాటు.









Good info about battery life.